/rtv/media/media_files/2025/01/12/nxj1v4Lj2y7O1I4v0QPh.jpg)
tirumala employee Photograph: (tirumala employee)
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ తెలిపింది. కొండపై ఉన్న మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ కేంద్రంలోని అన్నప్రసాదం మెనూలో మరో స్పెషల్ ఐటెమ్‌ను టీటీడీ చేర్చింది. ఈ క్రమంలోనే టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు శెనగపప్పు వడలు వడ్డింపు కార్యక్రమాన్ని ప్రారంభించారు. శెనగపప్పు వడలను ముందుగా స్వామి వారి చిత్ర పటాల దగ్గర పెట్టి పూజలు చేశారు. ఆ తర్వాత భక్తులకు స్వయంగా బీఆర్ నాయుడు వడలు వడ్డించారు. గారెలు రుచిగా, కమ్మగా ఉన్నాయని భక్తులు తెలిపారు.
ఇది కూడా చూడండి: Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ లో భారత్ vs న్యూజిలాండ్..దక్షిణాఫ్రికా ఇంటికి..
తిరుమల.... తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో భక్తులకు శెనగపప్పు గారెలు వడ్డింపు కార్యక్రమం ప్రారంభంచిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈఓ , అదనపు ఈఓ
— RTV (@RTVnewsnetwork) March 6, 2025
ముందుగా గారెలను స్వామిఅమ్మవార్ల చిత్రపటాలు వద్ద ఉంచి పూజలు చేసిన చైర్మన్, అధికారులు
అనంతరం భక్తులకు స్వయంగా గారెలు వడ్డించిన… pic.twitter.com/LygQUutYJR
ఇది కూడా చూడండి: Railway Jobs: రైల్వేలో మరో 835 పోస్టులు.. త్వరగా దరఖాస్తు చేసుకోండి!
యానిమల్ రేడియో కాలర్ సిస్టమ్..
ఇదిలా ఉండగా ఇటీవల ఓ కీలక నిర్ణయం కూడా టీటీడీ తీసుకుంది. దర్శనానికి వెళ్లే భక్తులకు అడవి జంతువులు నుంచి రక్షణ కల్పించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. కాలినడక మార్గాలు, ఘాట్‌రోడ్లలో ప్రయాణించే వాహనదారులకు చిరుత, ఏనుగు, ఎలుగబంట్ల నుంచి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు యానిమల్ రేడియో కాలర్ సిస్టంను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. దీని కోసం వైల్డ్‌లైఫ్ అధికారుల అనుమతి కూడా కోరినట్లు తెలుస్తోంది.
ఇది కూడా చూడండి: Mahesh Babu: SSMB29 కోసం రాష్ట్రం దాటిన మహేశ్.. ఉత్కంఠభరితమైన సన్నివేశాలపై షూట్!
2023లో అలిపిరి నుంచి నడుచుకుంటూ వెళ్తుండగా ఓ చిన్నారిపై చిరుత దాడి చేసింది. ఈ ఘటన తీవ్ర సంచలనం రేపింది. అదే ఏడాదిలో నాలుగేళ్ల బాలుడిపై కూడా చిరుత దాడి చేసింది. అదృష్టవశాత్తు ఆ బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే ఇలా చిరుతలు కనిపించడం ఇదేం మొదటిసారి కాదు. గత పదిహేనళ్ల నుంచి అలిపిరి, శ్రీవారిమెట్టు కాలిబాట, తిరుమల రెండో ఘాట్‌లపై కనిపిస్తుంటాయి. ఈ క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.