/rtv/media/media_files/2025/04/03/1FjdxaK1lCHua26Rmhdu.jpg)
ap-asembly thives
ఏపీ అసెంబ్లీ ఆవరణలో దొంగలు తమ చేతివాటాన్ని ప్రదర్శించారు. 2025 ఏప్రిల్ 02వ తేదీ బుధవారం రోజున ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారం సందర్భంగా టీడీపీ ఎమ్మెల్సీ బీటీ నాయుడు జేబులోని రూ.10వేలు, ఆయన గన్ మెన్ జేబులో ఉన్న రూ.40వేలు, హైకోర్టు లాయర్ జేబులో రూ.50వేలు, మరో వ్యక్తి జేబులో రూ.32వేలను కొట్టేశారు. మొత్తం దాదాపుగా రూ.4 లక్షలు చోరీ అయినట్లు భావిస్తున్నారు.
ఈ ఘటనపై ఎమ్మెల్సీ బీటీ నాయుడు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా సమాచారం. పోలీసులు సీసీ కెమరాల ఆధారంగా దొంగలను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏపీ అసెంబ్లీలో దొంగలు ఇలా రెచ్చిపోతే ఇక బయట పరిస్థితి ఏంటని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. కాగా ఇటీవల ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా ఎన్నికైన ఐదుగురు సభ్యులు బుధవారం ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. సోము వీర్రాజు(బీజేపీ), కొణిదెల నాగబాబు(జనసేన), బీటీ నాయుడు(టీడీపీ), పేరాబత్తుల రాజశేఖర్(టీడీపీ), ఆలపాటి రాజేంద్రప్రసాద్(టీడీపీ)ల చేతత అమరావతి అసెంబ్లీ భవనంలో మండలి చైర్మన్ మోషేన్ రాజు ప్రమాణ స్వీకారం చేయించారు.
సీఎం చంద్రబాబును కలిసిన నాగబాబు
నాగబాబు తన సతిమణీతో కలిసి ఏపీ సీఎం చంద్రబాబును రాష్ట్ర సచివాలయంలో కలిశారు. ఈ సందర్భంగా నాగబాబును సీఎం చంద్రబాబు శాలువాతో సత్కరించి, వెంకటేశ్వరస్వామి విగ్రహాన్ని ఆయనకు బహూకరించారు. అంతకుముందు చంద్రబాబును శాలువాతో సత్కరించిన నాగబాబు దంపతులు సీఎంకు పుష్పగుచ్ఛం అందజేశారు. తనకు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా అవకాశం కల్పించినందుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లకు నాగబాబు ధన్యవాదాలు తెలిపారు. వారి సూచనలకు అనుగుణంగా తన బాధ్యతలను నిబద్ధతతో నిర్వర్తిస్తానని నాగబాబు వెల్లడించారు.
ఎమ్మెల్సీ గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సతీ సమేతంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసి ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్సీ నాగబాబు....
— RTV (@RTVnewsnetwork) April 2, 2025
దీంతో నాగబాబు క్యాబినెట్ లో వస్తారా అనే చర్చ మొదలయింది.. @NagaBabuOffl @ncbn #janasena #TDP #RTV pic.twitter.com/TDwRaygtPo