ఇంటి పైకప్పు కూలి ముగ్గురు మృతి అనంతపురం కుందుర్పి మండలం ఎనుములదొడ్డి పంచాయతీ పరిధిలోని రుద్రంపల్లి గ్రామంలో గత రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం తెల్లవారుజామున ఇంటిపై కప్పు కూలి ఇంట్లో ఉన్న ముగ్గురు కుటుంబసభ్యులు ముగ్గురు మృతిచెందారు. By K Mohan 04 Dec 2024 in ఆంధ్రప్రదేశ్ అనంతపురం New Update షేర్ చేయండి అనంతపురం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండలం ఎనుములదొడ్డి పంచాయతీ పరిధిలోని రుద్రంపల్లి గ్రామంలో గత రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం తెల్లవారుజామున ఇంటిపై కప్పు కూలి ఇంట్లో ఉన్న ముగ్గురు కుటుంబసభ్యులు కురుబ గంగన్న (43), ఆయన భార్య శ్రీదేవి (38), 9వ తరగతి చదువుతున్న వీరి కూతురు సంధ్య(14) మృతిచెందారు. Also Read: AP: అయ్యప్ప భక్తులకు తప్పిన పెను ప్రమాదం.. మంటల్లో కాలిపోయిన బస్సు! గంగన్న టీడీపీ కార్యకర్త. విషయం తెలుసుకున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్, ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబులు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. Also Read: ApsRTc: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. ఏపీఎస్ఆర్టీసీ ఛైర్మన్ ఏమన్నారంటే! ఇది కూడా చదవండి : TTD: టీటీడీ కీలక నిర్ణయం.. భక్తులకు అడిగినన్ని లడ్డూలు ప్రస్తుతం శబరిమల యాత్రలో వున్న కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు వెంటనే స్పందించి, ఫోన్ ద్వారా వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి.. ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. తక్షణ సహాయం కింద ఎమ్మెల్యే అమిలినేని రూ.50 వేల ప్రకటించారు. మంత్రి నారా లోకేష్ కలెక్టర్ తో ఫోన్లో మాట్లాడి తక్షణ సహాయ సహకారాలు అందించాలని ఆదేశించారు. టీడీపీ కార్యకర్త మృతి పార్టీకి తీరని లోటని ఎమ్మెల్యే గారు విచారం వ్యక్తం చేశారు. #tdp #rains #ananthapuram మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి