/rtv/media/media_files/2025/03/19/jdn8Bvrdq6XVRkdQOSDf.jpg)
Hijra deepu-bunny
Anakapalle murder case : అనకాపల్లిలో రెండు కాళ్లు, చేతులు నరికిన మహిళ మృతదేహం లభ్యమైన విషయం తెలిసిందే. ఆమెను హత్య చేసిన తర్వాత బెడ్ షీట్ లో రెండు చేతులు, రెండు కాళ్లను కట్టేసి పడేశారు. మహిళను హత్య చేసి, శరీర భాగాలు వేరు చేసి పడేసారని గుర్తించారు. ఆ మహిళ హత్యను పోలీసులు చేధించారు. కాగా హత్యకు గురైన వ్యక్తి హిజ్రాగా గుర్తించారు. మిగిలిన డెడ్ బాడీలోని అవయవభాగాలను అనకాపల్లి డైట్ కాలేజీ సమీపంలో పోలీసులు గుర్తించారు. ఈ మిస్టరీ కేసును పోలీసులు 8 బృందాలుగా వెళ్లి దర్యాప్తు చేపట్టారు. హత్య ఎందుకు జరిగింది అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టగా సంచలన విషయాలు వెలుగు చూశాయి.
AP News : భర్త వేధింపులు...బిడ్డను చంపిన తల్లి
Anakapalle Murder Case
చనిపోయిన వ్యక్తి హిజ్రా దిలీఫ్ అలీయాస్ దీపుగా గుర్తించిన పోలీసులు. అతను నాలుగేళ్లుగా బన్నీ అనే వ్యక్తితో గుట్టుగా మునగపాక మండలం నాగులాపల్లి లో నివాసం ఉంటూ సహజీవనం సాగిస్తున్నట్లు తెలిసింది. దీపు సహజీవనం చేస్తున్నట్టు తోటి హిజ్రాలకు కూడా తెలియకుండా జాగ్రత్త పడినట్లు తెలుస్తుంది. కాగా బన్నీనే హిజ్రాను హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇద్దరి మధ్య తలెత్తిన తగాదాలు హత్య కు దారి తీసి ఉంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు. దీపు చాలాకాలంగా హిజ్రా కమ్యూనిటీకి దూరంగా ఉంటుందని తోటి హిజ్రాలు తెలిపారు. హిజ్రా హత్యలో నిందితుడు బన్నీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Also Read: Horoscope:నేడు ఈ రాశి వారు వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి...!
కాగా నిన్న బయ్యవరం బ్రిడ్జి కింద దొరికిన శరీర భాగాల్లో ఒక చేయి రెండు కాళ్లు దొరకగా... ఒక సంచిలో తల, ఒక చేయి హైవే పక్కన డ్రైనేజీలో దొరికింది. మిగిలిన డెడ్ బాడీలోని అవయవాలను అనకాపల్లి డైట్ కాలేజీ సమీపంలో పోలీసులు గుర్తించారు. ఇప్పటివరకు అనకాపల్లి పరిసర ప్రాంతాల్లో హిజ్రాలపై జరిగిన దాడుల్లో ముగ్గురు అనుమానస్పద స్థితిలో చనిపోగా ఒకరిపై యాసిడ్ దాడి జరిగి తీవ్రంగా గాయపడ్డారు.హిజ్రాలపై జరుగుతున్న దాడుల్లో న్యాయం జరగలేదని హిజ్రాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం...వారిద్దరికీ రెడ్‌కార్నర్ నోటీస్
Also Read : సినిమా అవకాశాల పేరుతో గాలం...వ్యభిచార రొంపిలోకి దింపి...