/rtv/media/media_files/2025/11/10/pakistan-2025-11-10-13-48-14.jpg)
Terrorist unrest in Vijayawada.
Vijayawada: విజయవాడలో ఉగ్రవాదులు ఉన్నారన్న అంశం కలకలం సృష్టించింది. సోషల్‌మీడియాలో ఉగ్రవాద కార్యకలాపాలకు మద్ధతు పలుకుతున్న ముగ్గురు యువకులను కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. విజయవాడ పాతబస్తీలో తనీఖీలు చేపట్టిన అధికారులు మొహ్మద్ రహమతుల్లా షరీఫ్, మీర్జా సొహైల్ బేగ్, మొహ్మద్ డానిష్ అనే ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన ముగ్గురికి ఉగ్రమూలాలతో సంబంధం ఉందని అధికారులు అంటున్నారు. వారు ముగ్గురు ఉగ్రవాద, ఐసిస్ భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నట్లు గుర్తించారు.అల్ మాలిక్ ఇస్లామిక్ యూత్ పేరుతో జిహాదీ భావజాలాన్నివ్యాప్తి చేస్తూ.. ఐసిస్ గ్రూప్‌తో టచ్‌లో ఉన్నట్లు గుర్తించిన అధికారులు వారిని అరెస్ట్ చేసి కోర్టులో హజరుపరచగా విజయవాడ కోర్టు ఏప్రిల్ 6వ తేదీ వరకు రిమాండ్ విధించింది.
విజయవాడలో టెర్రరిస్టు సానుభూతిపరులను కోర్టులో ప్రవేశపెట్టిన పోలీసులు
— RTV (@RTVnewsnetwork) March 24, 2026
విజయవాడ వన్ టౌన్ లోని గాంధీ బొమ్మ సెంటర్ సమీపంలో ఓ గృహంలో ఆకస్మిక తనిఖీ చేసిన ఇంటెలిజెన్స్ అధికారులు
గత కొంతకాలంగా సోషల్ మీడియాలో టెర్రరిస్టుల గురించి సోషల్ మీడియాలో వీడియోస్ పోస్టింగులు
టెర్రరిస్టులతో… pic.twitter.com/xaa7VxB5nS
కాగా ఆ ముగ్గురిని కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. వారికి పాకిస్థాన్​లోని హ్యాండర్లతో పాటు పలు దేశాల్లోని ఉగ్రవాద గ్రూపులతోనూ వారు టచ్ లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు.అ ముగ్గురికి వన్ టౌన్​లోని ఓ మసీదులో పరిచయం ఏర్పడగా ముగ్గురు ఒక గ్రూపుగా ఏర్పడినట్లు పోలీసులు గుర్తించారు. వీరు వివిధ ప్రాంతాల్లో యువకులను ఉగ్రవాదం వైపు మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారని ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారు. వీరిపై కొత్తపేట పోలీస్ స్టేషన్​లో కేసు నమోదు చేశారు. ఇరాన్ యుద్ధం నేపథ్యంలో కొంతకాలంగా సోషల్ మీడియాలో.. నిషేధిత వీడియోలు పోస్ట్ చేస్తున్న ముగ్గురు యువకులు ఇతర రాష్ట్రాల్లోని ఉగ్రవాద సానుభూతిపరులతోనూ సంబంధాలు కలిగి ఉన్నట్లు గుర్తించారు వీరు ఇన్​స్టాగ్రాం, టెలిగ్రాం సహా పలు సోషల్ మీడియా గ్రూపుల ద్వారా యువతను ఉగ్రవాద భావజాలం వైపు ఆకర్షిస్తున్నట్లు అధికారులు తెలిపారు.ఈ ముగ్గురు 7 రాష్ట్రాల్లో 42 మందితో గ్రూప్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఈ ముగ్గురు ఏపీలోనే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన యువకులతో ఒక గ్రూపు ఏర్పాటు చేశారు. వారిని జీహాదీ కోసం సన్నద్ధమవ్వాలంటూ రెచ్చగొడుతున్నట్లు కౌంటర్ ఇంజిలిజెన్స్ తేల్చింది. విజయవాడ వించిపేట నారాయణస్వామి వీధిలో మొహ్మద్ రహమతుల్లా షరీఫ్, అబ్దుల్జాక్ వీధిలో మీర్జా సొహైల్ బేగ్, భవానీపురం ఇందిరా ప్రియదర్శినీ కాలనీలో మొహ్మద్ డానిష్ ఉంటున్నట్లు తెలిపారు. వీరు తెలంగాణ, ఢిల్లీ, రాజస్థాన్, బిహార్ తదితర రాష్ట్రాల వారితో సంబంధాలు నెరపినట్లు తెలుస్తోంది. దీంతో వారిని అదుపులోకి తీసుకోవడానికి ప్రత్యేక పోలీస్ బృందాలు ఆయా రాష్ర్టాలకు వెళ్లాయి. కాగా నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి వారిని ప్రశ్నిస్తున్నట్లు తెలిపారు.
Follow Us