ఏపీలో కల్తీ టీ పొడి కలకలం.. ఎక్కడ, ఎలా తయారు చేస్తున్నారో తెలిస్తే..

జీడిపప్పు పై పొట్టు, రసాయనాలు వినియోగించి నకిలీ టీ పొడి తయారు చేస్తున్న కేంద్రం పై పోలీసులు దాడి చేశారు. గోకవరం మండలం రంపయర్రంపాలెం గ్రామంలో శ్రీ వెంకటరామ రైస్‌ మిల్‌ లో నకిలీ టీ పొడి తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

New Update
powder

AP: జీడిపప్పు పై పొట్టు, రసాయనాలు వినియోగించి నకిలీ  టీ పొడి తయారు చేస్తున్న కేంద్రం  పై పోలీసులు దాడి చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..గోకవరం మండలం రంపయర్రంపాలెం గ్రామంలో శ్రీ వెంకటరామ రైస్‌ మిల్‌ లో నకిలీ టీ పొడి తయారు చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది.

Also Read: ఈరోజే మనకు బాలల దినోత్సవం..ఏఏ దేశాల్లో ఎప్పుడు జరుపుకుంటారో తెలుసా?

నకిలీ టీ పొడితో పాటు...

దీంతో కోరుకొండ సీఐ సత్య కిషోర్‌, ఎస్సై పవన్‌ కుమార్‌ లు బుధవారం ఆ రైస్‌ మిల్‌ వద్దకు వెళ్లి తనిఖీలు చేశారు. అక్కడ 31 బస్తాలలో ఉన్న 1250 కేజీల నకిలీ టీ పొడితో పాటు తయారీకి వాడే రెండు సంచులలో ఉన్న వాషింగ్‌ సోడా, క్రీం రంగు పొడి ఉన్న 15 సంచులు, బూడిద రండు పొడి ఉన్న 14 సంచులను స్వాధీనం చేసుకున్నారు.

Also Read: BIG BREAKING: మరికొద్ది సేపట్లో కేటీఆర్ అరెస్ట్.. తెలంగాణ భవన్ వద్ద హైటెన్షన్!

పోలీసులు ద్వారా సమాచారం అందుకున్న జిల్లా ఫుడ్‌ సేఫ్టీ అధికారి రొక్కయ్య సంఘటన స్థలానికి చేరుకుని తనిఖీలు నిర్వహించారు. జీడిపప్పుపై పొట్టులో రసాయనాలు కలిపి తయారు చేస్తున్నట్లు గుర్తించారు. నకిలీ టీ పొడి శాంపిల్స్‌ తీసుకొని పరీక్షల నిమిత్తం ల్యాబ్‌ కు పంపించారు. అది నకిలీ టీ పొడిగా నిర్థారణ అయితే నిర్వాహకుల పై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని ఎస్సై పవన్ కుమార్‌ తెలిపారు.

Also Read: TG News: హైదరాబాద్‌లో దారుణం.. ఎస్సై తలపగులగొట్టిన గంజాయి గ్యాంగ్‌

Also Read: Karnataka: 50 మంది ఎమ్మెల్యేలకు రూ.50 కోట్ల చొప్పున..బీజేపీ బంపరాఫర్‌!

Advertisment
Advertisment
తాజా కథనాలు