తాను ఎవరి మీద దాడి చేయలేదని తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఈ రోజు టీడీపీ క్రమశిక్షణ కమిటీ ఎదుట ఆయన విచారణకు హాజరైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన ఆర్టీవీతో ఆయన మాట్లాడారు. తిరువూరులోని గోపాలపురం అనే గ్రామంలో జరిగిన సంఘటనపై ఈరోజు టీడీపీ క్రమశిక్షణ కమిటీ తనను విచారణకు పిలిచిందన్నారు. ఆ రోజు ఏం జరిగిందనే అన్ని వివరాలు కమిటీకి చెప్పానన్నారు. తాను దాడి చేశానని చెబుతున్న కుటుంబం.. గతంలో ఎమ్మెల్యే అభ్యర్థుల మీద దాడులు చేశారన్నారు. చంద్రబాబు పాదయాత్రలో వాటర్ బాటిల్ విసిరారన్నారు. ఈ వివరాలన్నీ కమిటీ ముందు చెప్పానన్నారు. నియోజకవర్గంలో తన మీద ఎక్కడ వ్యతిరేకత లేదన్నారు. తనను టార్గెట్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? అని ప్రశ్నించారు. నన్ను టార్గెట్ చేసినా పట్టించుకోనన్నారు. కొలికపూడి పూర్తి ఇంటర్వ్యూను ఈ వీడియోలో చూడండి.
Kolikapudi: నేనేం తప్పు చేయలేదు.. RTVకి కొలికపూడి సంచలన ఇంటర్వ్యూ!
తాను ఎలాంటి తప్పు చేయలేదని తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ స్పష్టం చేశారు. RTVకి ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ రోజు టీడీపీ క్రమశిక్షణ కమిటీ విచారణకు ఆయన హాజరయ్యారు. కమిటీ సభ్యులకు అన్ని విషయాలు చెప్పానన్నారు.