/rtv/media/media_files/2025/03/06/lx8A4wExMEhom6AZVceL.jpg)
CM Chandra babu and Janasena Chief Pawan kalyan
టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక కొలిక్కి వస్తోంది. మొత్తం ఐదు స్థానాల్లో.. నాలుగు ఎమ్మెల్సీలను తెలుగుదేశం పార్టీ తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాజకీయ, సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్సీ అభ్యర్థులను ఎంపిక చేస్తున్నట్లు సమాచారం. ఉభయ గోదావరి జిల్లాల్లో రాజుల సామజిక వర్గం నుంచి ఎమ్మెల్సీ సీటు కోసం పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, మంతెన సత్యనారాయణ రాజు, గన్ని వీరాంజనేయులు పోటీపడుతున్నారు.
Also Read: షామా కేక్‌పై మళ్లీ రచ్చ.. టేస్ట్ చూడాలంటే రోహిత్ కంటే ఫిట్‌గా ఉండాలట!
కృష్ణా జిల్లా నుంచి దేవినేని ఉమా, వంగవీటి రాధా.. గుంటూరు జిల్లా నుంచి పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే కొమ్మాలిపాటి శ్రీధర్, మద్దిపట్ల సూర్య ప్రకాష్ పోటీ పడుతున్నారు. రాయలసీమ జిల్లాల్లో జోన్ 4 నుంచి బీసీ అభ్యర్థికి ఎమ్మెల్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక నెల్లూరు జిల్లాకు చెందిన బీద రవిచంద్రకి దాదాపుగా ఎమ్మెల్సీ ఖరారయ్యే ఛాన్స్ ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
Also Read: పోసానికి ఏపీ హైకోర్టులో నిరాశ..క్వాష్ పిటిషన్ కొట్టివేసిన ఏపీ హైకోర్టు.
ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి రేపల్లె మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణకు వచ్చే దఫా ఎమ్మెల్సీ ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. బీసీలతో పాటు.. ఒక ఎస్సీ, ఒక మైనార్టీకి కూడా ఎమ్మెల్సీ ఇవ్వాలని టీడీపీ అధిష్టానం యోచిస్తోంది. శుక్రవారం సాయంత్రానికి అభ్యర్థుల పేర్లు అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం.
Also Read: పెళ్లైన రెండోరోజే బిడ్డకు జన్మనిచ్చిన వధువు.. షాక్‌లో వరుడు, అతని కుంటుంబం ఏం చేశారంటే!