ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను టీడీపీ ప్రకటించింది. సీఎం చంద్రబాబు నాయుడు మూడు స్థానాలకు ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేశారు. కావలి గ్రీష్మ (SC), బీటీ నాయుడు (BC), బీద రవిచంద్ర (BC) పేర్లను ప్రకటించారు. సోమవారం నామినేషన్ గడువు ముగియనుండటంతో ఎంపికైన అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను రెడీ చేసుకుంటున్నారు.
Also Read: జైలు నుంచి బెయిల్‌పై బయటకొచ్చి.. కుంభమేళాలో జాక్‌పాట్ కొట్టిన రౌడీషీటర్
ఇదిలాఉండగా ఏపీలో ఎమ్మెల్యే కోటాలో మొత్తం ఐదు స్థానాలకు ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో ఒక స్థానాన్ని జనసేనకు కేటాయించారు. అలాగే ఆ పార్టీ తరఫున కొణిదెల నాగబాబు సైతం నామినేషన్ వేశారు. ఇక మిగిలిన నాలుగు స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దించేందుకు టీడీపీ అధిష్ఠానం గత కొన్ని రోజులుగా కసరత్తులు చేసింది. ఈ నేపథ్యంలో బీజేపీకి కూడా ఒక స్థానం కేటాయించాలని ఆ పార్టీ పెద్దలు అడిగారు. దీంతో బీజేపీకి కూడా ఒక స్థానం కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది.
Also Read: బర్డ్ ఫ్లూ భయంతో అమెరికాలో కోడిగుడ్లు స్మగ్లింగ్.. అద్దెకు కోడిపెట్టలు
అయితే బీజేపీకి ఒక సీటు ఇవ్వడం వల్ల సర్దుబాటు చేయలేకపోతున్నామని ఆశావహులకు టీడీపీ పెద్దలు సర్దిచెబుతున్నారు. 2027లో ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు ఖాళీలు ఏర్పడుతాయని అప్పుడు అవకాశం ఇస్తామని హామీ ఇస్తున్నారు. దీంతో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, మాజీ మంత్రి జవహర్, దువ్వారపు రామారావు, టీడీ జనార్ధన్‌కు టీడీపీ అధిష్ఠానం నుంచి ఫోన్లు వెళ్లినట్లు తెలుస్తోంది.
Also Read: స్టార్ హోటల్ బాత్రూమ్‌లో రోజా అనుమానస్పద మృతి.. ఎన్నారై డాక్టర్ అరెస్ట్!?