JC Prabhakar Reddy: ఆవేశంలో అలా చేశాను.. నన్ను క్షమించు: జేసీ

నటి మాధవీలత గురించి ఆవేశంలో అలా మాట్లాడటం తప్పేనని జేసీ ప్రభాకర్ రెడ్డి అంగీకరించారు. ఆమెకు క్షమాపణలు చెబుతున్నట్లు పేర్కొన్నారు. కాగా నూతన సంవత్సర వేడుకలపై మాధవీలత సంచలన కామెంట్స్ చేసింది. ఆ వ్యాఖ్యలపై జేసీ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

New Update
JC Prabhakar Reddy apologizes to Madhavi Latha

JC Prabhakar Reddy apologizes to Madhavi Latha

అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్‌ ఛైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి - సినీ నటి, బీజేపీ నాయకురాలు మాధవీలత మధ్య మాటల యుద్ధానికి తెరపడింది. తాను చేసిన వ్యాఖ్యలు తప్పేనని జేసీ ప్రభాకర్ రెడ్డి అంగీకరించారు. ఈ మేరకు నటి మాధవీ లతకు మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పారు. 

ఆవేశంలోనే మాటలు జారాను

ఇది కూడా చదవండి: సినిమా ఇండస్ట్రీకి పవన్ కీలక సూచన.. సంచలన లేఖ విడుదల!

తాను తప్పులు చేయనని.. కొందరు మాత్రం తాను తప్పులు చేశానని అంటున్నారని అన్నారు. అయితే ఆవేశంలో మాధవీ లతను ఒక మాటన్నానని తెలిపారు. ఆమెను అంటే తనకు ఏమీ రాదని.. ఏదో ఆవేశంలోనే మాటలు జారానని పేర్కొన్నారు. తాను అలా మాట్లాడి ఉండాల్సింది కాదని అన్నారు. అలా మాట్లాడినందుకు నటి మాధవీ లతకు క్షమాపణలు తెలియజేస్తున్నానన్నారు. 

ఇక తాను తప్పు చేశానన్న వాళ్లందరి గురించి తనకు తెలుసని ఆయన అన్నారు. తనపై విమర్శలు చేసేవాళ్లంతా ఫ్లెక్సీగాల్లే అంటూ ఫైర్ అయ్యారు. అదృష్టం కలిసొచ్చి కొందరు నాయకులు అయ్యారన్నారు. తనపై మాట్లాడేవారు ప్రజలకు మేలు చేయాలని సూచించారు. తనకు పార్టీ మారిపోవాలని కొందరు విమర్శలు చేస్తున్నారని.. అయితే పార్టీ మారాల్సిన అవసరం తనకు లేదన్నారు. చంద్రబాబు నాయుడు విజన్ చూసే టీడీపీలో ఉంటున్నానన్నారు. తాడిపత్రి అభివృద్ధి కోసం పోటీ పడతానంటూ చెప్పుకొచ్చారు. 

ఇంతకీ ఏం జరిగిందంటే?

2024 డిసెంబర్ 31 రాత్రి న్యూ ఇయర్ వేడుకలను జేసీ ప్రభాకర్ రెడ్డి నిర్వహించారు. ఈ ఈవెంట్ వ్యవహారంలోనే జేసీ ప్రభాకర్ అండ్ మాధవీలత మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఈ ఈవెంట్‌కు ముందు మాధవీలత అనుచిత వ్యాఖ్యలు చేసింది. ఈ ఈవెంట్‌కు మహిళలు ఎవరూ వెళ్లొద్దని తెలిపింది. ఈవెంట్‌ కోసం జేసీ ప్రభాకర్ దగ్గరకు వెళ్తే అక్కడ దారుణాలు జరుగుతాయని ఆమె ఓ వీడియో రిలీజ్ చేసింది.

Also Read : బండి సంజయ్ నా బ్రదర్.. RTV ఇంటర్వ్యూలో పొన్నం సంచలన సీక్రెట్స్

ఆ వ్యాఖ్యలు నెట్టింట దుమారం రేపాయి. దానిపై జేసీ ఘాటుగా స్పందించారు. మాధవీలత ఒక ప్రాస్టిట్యూట్ (వ్యభిచారి) అని, అలాంటి వాల్లు తన గురించి మాట్లాడుతారా? అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో అతడి వ్యాఖ్యలు నెట్టింట రచ్చ లేపాయి. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య వివాదం మొదలవగా.. జేసీ క్షమాపణలతో ఇప్పటికి క్లోజ్ అయినట్లు కనిపించింది.

ఈవెంట్‌లో జేసీ మాస్ డ్యాన్స్

ఇది కూడా చూడండి: పదో తరగతి విద్యార్థులకు అలర్ట్.. పరీక్షల్లో మార్పులు

2024 డిసెంబర్ 31 రాత్రి న్యూ ఇయర్ వేడుకలలో జేసీ ప్రభాకర్ రెడ్డి దుమ్ముదులిపేశారు. తన డ్యాన్స్‌తో అదరగొట్టేశారు. పుష్ప 2 సినిమాలోని సూసేకి అగ్గిరవ్వ మాదిరే ఉంటాడే నా సామి అంటూ సాగే సాంగ్‌కు జేసీ డ్యాన్స్ వేశారు. పక్కన ఉన్న మహిళలు, అమ్మాయిలతో కలసి కాలు కదిపారు. డీజే లైటింగ్‌కు, సాంగ్‌కు తోడు జేసీ తగ్గేదే లే స్టెప్పు అదిరిపోయింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయింది.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

🔴Live News Updates: పాత వాహనాలకూ కొత్త రిజిస్ట్రేషన్ నంబర్లు

Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!

New Update
Live News Updates in Telugu

Live News Updates in Telugu

🔴Live News Updates:

TS: పాత వాహనాలకూ కొత్త రిజిస్ట్రేషన్ నంబర్లు

తెలంగాణలో నెంబర్ ప్లేట్లు మార్చాల్సిన టైమ్ వచ్చేసింది. పాతదే అయినా హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్ తప్పనిసరి చేసింది రవాణాశాఖ. సెప్టెంబర్ 30వ తేదీని గడువుగా నిర్ణయించింది. 

ts
High Security number plate

 

మీ వెహికల్ 2019 ఏప్రిల్ 1వ తేదీ కన్నా ముందు తయారైందా...అయితే అర్జంటుగా వెళ్ళి నంబర్ ప్లేట్ మార్చుకోండి.  పై తేదీ కన్నా ముందు తయారైన వాహనాలకు హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ బిగించుకోవాల్సిందేనని తెలంగాణ రవాణాశాఖ చెప్పింది.  దీనికి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. వాహన రకాన్ని బట్టి నంబర్‌ ప్లేట్‌కు కనిష్ఠంగా రూ.320.. గరిష్ఠంగా రూ.800గా ఛార్జీలను ఖరారు చేసింది. నకిలీ నంబర్‌ ప్లేట్లకు అడ్డుకట్ట వేయడం, దొంగతనాలను అరికట్టడం, వాహనాలు రహదారి భద్రతలను దృష్టిలో ఉంచుకుని ఈ మార్పులు చేస్తున్నామని రవాణాశాఖ చెబుతోంది. సుప్రీంకోర్టు ఆదేశాల మరకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. 

కచ్చితంగా మార్చాల్సిందే..

పాత వాహనాలకు నంబర్ ప్లేట్ మార్చాల్సి బాధ్యత యజమానిదే అని తేల్చి చెప్పింది రవాణాశాఖ. హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ మార్చుకోకపోతే వాహనాలను అమ్మాలన్నీ, కొనాలన్నా సాధ్యం కాదని తెలిపింది. అలాగే బీమా, పొల్యూషన్ సర్టిఫికేట్ లాంటివి కూడా లభించవు. పైగా సెప్టెంబర్ తర్వాత కొత్త నంబర్ ప్లేట్లు కనిపించకపోతే కేసులు కూడా నమోదు చేయనున్నారు.  ఇక ఈ నంబర్ ప్లేట్లు వాహన తయారీ సంస్థలు తమ డీలర్ల దగ్గర కూడా చేయించుకోవచ్చును. దీనికి సంబంధించిన సమాచారం, నంబర్ ప్లేట్ ధరలు డీలర్ దగ్గర కనిపిచేలా చేయనున్నారు. వాహనదారులు ఈ ప్లేట్‌ కోసం www.siam.in వెబ్‌సైట్‌లో ..వాహన వివరాలు నమోదు చేసి బుక్‌ చేసుకోవాలి. కొత్త ప్లేట్‌ బిగించాక ఆ ఫొటోను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలి.

Also Read: Sai Sudarshan: చెండాడేశాడు భయ్యా.. చుక్కలు చూపించిన సుదర్శన్- ఎంత స్కోర్ చేశాడంటే?

Also Read:  Badminton: ఆసియా ఛాంపియన్ షిప్ లో పీవీ సింధు మొదటి విజయం

Advertisment
Advertisment
Advertisment