/rtv/media/media_files/2024/12/14/P6EWCcfLMdPBxVf2Ka2d.jpg)
ఈజీ మనీకి అలవాటుపడిన కొందరు అడ్డదారిలో డబ్బులు ఎలా సంపాదించాలా అని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో దొంగ నోట్ల కరెన్సీకి పాల్పడుతున్నారు. లక్షలు, కోట్లలో నకిలీ నోట్లు తయారు చేసి మార్కెట్‌లో చెలమనీ చేస్తున్నారు. ఈ గుట్టు రట్టు చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగి.. దీనికి పాల్పడిన వారిని కటకటాల్లోకి పంపిస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో జరిగింది. అడ్డదారిలో డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో దొంగ నోట్లను రూపొందించిన రెండు ముఠాలను పోలీసులు అరెస్టు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
Also Read: ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’లో బిగ్ ట్విస్ట్.. 2034లోనే జమిలీ ఎన్నికలు..!
ఆంధ్రా - ఒడిశా సరిహద్దు అయిన మెళియాపుట్టి మండలం సంతలక్ష్మీపురం గ్రామానికి చెందిన తమ్మిరెడ్డి రవిని పోలీసులు అరెస్టు చేశారు. నకిలీ నోట్ల కరెన్సీ డబ్బును చెలామనీ చేస్తున్నారన్న సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని.. అతడి వద్ద నుంచి రూ.50 వేల దొంగ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. దీంతో నిందితుడిని విచారించగా మొత్తం వివరాలను బయటపెట్టాడు.
Also Read: రాత్రంతా నిద్రపోని అల్లు అర్జున్ భార్య, పిల్లలు.. గంట గంటకు టెన్సన్ పడుతూ...
ఈ దొంగ నోట్ల కరెన్సీ వ్యాపారంలో ఎవరెవరు ఉన్నారో వారందరి పేర్లు బయటపెట్టడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. పలాస, వజ్రపుకొత్తూరు, మెళియాపుట్టి మండలాలకు చెందిన తమ్మిరెడ్డి ఢిల్లీరావు, దాసరి రవికుమార్, కుసిరెడ్డి దుర్వాసులు (శంకర్‌రెడ్డి), దుమ్ము ధర్మారావు, దాసరి కుమారస్వామిలను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి భారీగా నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు.
Also Read: తగ్గేదేలే.. అల్లు అర్జున్ అరెస్టుతో 'పుష్ప2' ఖాతాలో మరో 100కోట్లు
నిందితుల్లో వైసీపీ నాయకుడు
దాదాపు రూ.57.25 లక్షల నకిలీ నోట్లతో పాటు తయారీకి ఉపయోగించిన కలర్‌ప్రింటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు ఒక స్కూటీ, నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అయితే నిందితుల్లో వైసీపీ నాయకుడు, కరజాడ ఎంపీటీసీ సభ్యుడు దాసరి రవికుమార్‌ను పోలీసులు ఎ-5గా చేర్చారు.
Also Read: స్కూళ్లు బంద్‌పెట్టి టీచర్ల దావత్..ప్రభుత్వ అధికారులు సైతం హాజరు
కాగా ఇందులో పట్టుబడ్డ కుసిరెడ్డి దుర్వాసులు, తమ్మిరెడ్డి రవి గతంలో బ్లాక్ కరెన్సీ, పురాతన నాణేలతో నేరాలకు పాల్పడినట్లు టెక్కలి డీఎస్పీ మూర్తి తెలిపారు. అయితే ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. వీరు యూట్యూబ్ వీడియోలు చూసి నకిలీ నోట్ల తయారీ చేసి వాటిని ఒడిశా నుంచి చెలామణి చేయాలని ప్లాన్ చేసినట్లు డీఎస్పీ తెలిపారు.