Aghori - Sri Varshini: వర్షిణీ మిస్సింగ్.. రంగంలోకి అఘోరీ- అరెస్టు చేయాలని డిమాండ్!

శ్రీవర్షిణీ ఇంకా ఇంటికి చేరుకోకపోవడంపై అఘోరీ సంచలన వ్యాఖ్యలు చేసింది. వర్షిణి మిస్సింగ్ వెనుక విష్ణు ఉన్నాడంటుంది. అంతేకాకుండా వర్షిణీ కుటుంబంతో విష్ణు డ్రామాలు ఆడుతున్నాడని చెప్తుంది. విష్ణుపై నిఘా పెట్టి కేసు నమోదు చేయాలంటూ డిమాండ్ చేస్తుంది.

New Update

అఘోరీ- శ్రీవర్షిణీ ఇష్యూ మరోసారి రచ్చకెక్కింది. ఇటీవల అఘోరీ నుంచి తన చెల్లి వర్షిణీని తీసుకొచ్చిన హర్ష, విష్ణులు.. ఆ తర్వాత ఒక హోటల్‌లో ఉన్నారు. రీసెంట్‌గానే వర్షిణీని ఇంటికి తీసుకొస్తున్నట్లు ట్రైన్‌లో ఉన్న ఒక వీడియో రిలీజ్ చేశారు. కానీ ఇప్పటివరకు వారు ఇంటికి చేరుకోలేదు. దీంతో వారు ఎక్కడ ఉన్నారు అనేది ఆసక్తికరంగా మారింది. 

Also Read: పోలీసులకు లొంగిపోయిన 26 మంది మావోయిస్టులు

విష్ణుపై కేసు నమోదు చేయండి

ఈ నేపథ్యంలో లేడీ అఘోరీ రంగంలోకి దిగింది. RTV  ఛానెల్‌తో లైవ్‌లో మాట్లాడింది. వర్షిణీ అన్నయ్య విష్ణుపై తీవ్ర ఆరోపణలు చేసింది. వర్షిణి మిస్సింగ్ వెనుక విష్ణు ఉన్నాడంటుంది. అంతేకాకుండా వర్షిణీ కుటుంబంతో విష్ణు డ్రామాలు ఆడుతున్నాడని చెప్తోంది. విష్ణుపై నిఘా పెట్టి కేసు నమోదు చేయాలంటూ చెప్పుకొస్తుంది. ఈ మేరకు శ్రీవర్షిణీ క్షేమంగా ఇంటికి చేరుకోవాలని అఘోరీ అంటోంది. తన దగ్గర నుంచి తీసుకెళ్లిన తర్వాత వాళ్లు మొదటగా పోలీసుల వద్దకు వెళ్లాలని.. ఆ తర్వాత వాళ్ల ఫ్యామిలీ వద్దకు చేర్చాలని డిమాండ్ చేసింది. 

Also Read: తెగ తాగేసిన మందు బాబులు..గతేడాది కంటే తెలంగాణలో భారీగా పెరిగిన మద్యం అమ్మకాలు!

కానీ ఎక్కడా చేర్చకుండా ఎందుకు తిరుగుతున్నారు అని ప్రశ్నించింది. అసలు విష్ణుకి వర్షిణీ ఫ్యామిలీతో ఏంటి సంబంధం.. వారితో ఎందుకు ఆడుకుంటున్నాడు. ఇప్పటి వరకు ప్రజలు ఎంతో మంది తనను విమర్శించారని.. ఆడపిల్లను వదిలేయాలని అన్నారని.. కానీ ఇప్పటి వరకు వర్షిణీని ఇంటికి తీసుకెళ్లకపోవడానికి గల కారణం ఏంటని ఎందుకు ప్రశ్నించడంలేదు అని పేర్కొంది. నాలుగు రోజులు అవుతున్నా.. ఎందుకు వర్షిణీని ఇంటికి తీసుకెళ్లలేదు. ఆ పిల్లని ఏం చేద్దామనుకుంటున్నారు అంటూ చెప్పుకొచ్చింది. 

Also Read: ఆ నిర్ణయం వెంటనే వెనక్కి తీసుకోండి..లేదంటే...చైనాకు ట్రంప్ హెచ్చరికలు!

Also Read: క్షమించండి..దొంగతనం చేయాలనుకోలేదు..ఆరు నెలల్లో తిరిగి ఇచ్చేస్తాను..!

(sri varshini | aghori sri varshini | aghori | latest-telugu-news | telugu-news )

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

AP: బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు.. 6గురి దుర్మరణం.. కన్నీరు పెట్టించే వీడియోలు..!

అనకాపల్లిలో దారుణం జరిగింది. కైలాసపట్నంలోని బాణాసంచా కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 6గురు అక్కడికక్కడే స్పాట్‌లో ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు కంటతడి పెట్టిస్తున్నాయి. విగతజీవులుగా మృతులు దృశ్యాలు ఉన్నాయి.

New Update

అనకాపల్లిలో దారుణం జరిగింది. కైలాసపట్నంలోని బాణాసంచా కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 6గురు అక్కడికక్కడే స్పాట్‌లో ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తీవ్ర గాయాలపాలై హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. 

విగతజీవులుగా పడివున్న దృశ్యాలు

వెంటనే సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తుంది. ఇక ఈ ప్రమాదంలో గాయాలపాలైన వారు హాస్పిటల్‌ ప్రాణాలతో పోరాడుతున్నారు. మరికొందరు సంఘటనా స్థలంలోనే విగతజీవులుగా కనిపిస్తున్నారు. శరీరం మొత్తం కాలిపోయి విలవిల్లాడుతున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు కంటతడి పెట్టిస్తున్నాయి. 

https://x.com/YSRCParty/status/1911354811322089657

fire accident | latest-telugu-news | telugu-news | viral-videos

Advertisment
Advertisment
Advertisment