Lady Aghori-Sri Varshini: అఘోరీ ఎపిసోడ్‌లో బిగ్ ట్విస్ట్.. వర్షిణిని రప్పా రప్పా ఈడ్చుకెళ్లిన ఫ్యామిలీ (వీడియో చూశారా)

లేడీ అఘోరీకి బిగ్ షాక్ తగిలింది. వర్షిణిని తమ ఫ్యామిలీ ఇంటికి తీసుకొచ్చింది. గుజరాత్‌లోని సౌరాష్ట్రలో పెట్రోల్‌ బంక్‌లో నిద్రిస్తున్న టైంలో విష్ణు, శ్రీ హర్ష పోలీసులతో వెళ్లి పట్టుకున్నారు. తాను అఘోరీని వదిలి రానంటున్నా బలవంతంగా లాక్కెల్లారు.

New Update
Sri Varshini back to home from Lady Aghori

Sri Varshini back to home from Lady Aghori

లేడీ అఘోరీ - వర్షిణీ వ్యవహారం ఈ మధ్య హాట్ టాపిక్‌గా మారింది. వీరిద్దరూ లవర్స్ అని కొందరు ప్రచారం చేస్తున్నారు. అఘోరీ మంత్రాలు చేసి తమ బిడ్డను తీసుకెళ్లిపోయిందని వర్షిణి ఫ్యామిలీ ఆరోపిస్తుంది. వర్షిణి ఆమె ఇష్టంతోనే తన వద్దకు వచ్చిందని అఘోరీ చెబుతోంది. ఏది ఏమైనా వర్షిణి ఇప్పుడు అఘోరీ మాయలో ఉందని.. ఇక తన ఇంటికి ఇప్పుడిప్పుడే వెళ్లేలా కనిపించడం లేదని అంతా భావించారు. 

Also Read: ఏపీ ప్రజలకు ఐఎండీ హెచ్చరికలు.. ఈ జిల్లాల్లో వర్షాలు, పిడుగులు ...!

వర్షిణీని ఇంటికి తీసుకొచ్చిన ఫ్యామిలీ

కానీ అందరి అంచనాలు తలకిందులయ్యాయి. వర్షిణి ఫ్యామిలీ ఒక్కసారిగా అఘోరికి షాక్ ఇచ్చింది. వర్షిణి ఫ్యామిలీ అఘోరి నుంచి తమ కూతురుని తీసుకుని వెళ్లిపోయింది. అవును మీరు విన్నది నిజమే. వర్షిణి ఫ్యామిలీ పక్కా ప్లాన్‌ను అమలు చేసింది. ఈ ప్లాన్‌లో భాగంగానే వర్షిణి ఫ్యామిలీ విష్ణు, శ్రీ హర్ష, భవాని అఘోరీ ఉన్న ప్రాంతానికి పోలీసులతో వచ్చారు. గుజరాత్‌లోని సౌరాష్ట్రలో పెట్రోల్‌ బంక్‌లో నిద్రిస్తున్న టైంలో శ్రీవర్షిణిని పోలీసుల సాయంతో తీసుకెళ్లారు. ఆమె అఘోరీని వదిలి రాను రాను అంటూ కన్నీళ్లు పెట్టుకున్నా బలవంతంగా లాక్కెల్లారు. అందుకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి.

Also Read: మనుషులులేని దీవులపై కూడా ట్రంప్ టారిఫ్ ఛార్జీల మోత.. ఎందుకంటే?

గత ఏడాది నుంచి అఘోరీ తరచూ వార్తల్లో నిలుస్తుంది. పలు ఆలయాలు సందర్శిస్తూ వెళ్లే దారిలో ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూనే ఉంది. ఇందులో భాగంగానే ఇటీవల వర్షిణి అనే యువతిని తన వెంట తిప్పుతూ కనిపించింది. ప్రస్తుతం అదే సెన్సేషనల్‌గా మారింది. వర్షిణీ అనే బీటెక్ విద్యార్థిని ఇంట్లో రెండు వారాలు ఉండటం.. అక్కడ ఆ ఫ్యామిలీకి పలు వస్తువులు, అలాగే వేలకు వేలు పెట్టి వర్షిణీకి బంగారం చైన్ కొనడం వంటివి చేసింది. 

Also Read: నటిపై గృహ హింస కేసు.. హైకోర్టును ఆశ్రయించిన హన్సిక!

అక్కడ వరకు అంతా సాఫీగా సాగిపోయింది. కానీ ఇవన్నీ కొనిచ్చిన అనంతరం వర్షిణీ.. అఘోరీతో వెళ్లిపోయింది. అక్కడ నుంచి అసలు ఆట మొదలైంది. ఒకవైపు వర్షిణీ ఫ్యామిలీ ఆరోపణలు చేస్తుంటే.. మరోవైపు అఘోరీ, ఆమెతో పాటు ఉన్న వర్షిణి వాటికి సమాధానాలు చెబుతూ వస్తున్నారు. ఇక ఇప్పటికైనా వీరి వ్యవహారం సర్దుమనుగుతుందో లేదో చూడాలి. 

Also Read: టర్కీలో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. 200మంది భారతీయులు 16 గంటలుగా

(lady aghori | aghori sri varshini | btech student sri varshini | latest-telugu-news)

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Rain Alert:  ఉరుములు..మెరుపులు...ఏడు రోజులు భారీ వర్షాలు.. ఎక్కడంటే?

వాతావరణం రోజురోజుకు అనేక మార్పులు సంతరించుకుంటోంది. దేశవ్యాప్తంగా పలు చోట్ల రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. మరోవైపు రానున్న రోజుల్లో దేశంలోని పలుచోట్ల మోస్తరు వర్షాలు పడే అశకాశాలున్నాయని తెలిపింది.

New Update
  Rain Alert For Telangana

Rain Alert

Rain Alert : వాతావరణం రోజురోజుకు అనేక మార్పులు సంతరించుకుంటోంది. దేశవ్యాప్తంగా పలు చోట్ల రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతుంటే , మరోవైపు అకాల వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. రానున్న రోజుల్లో దేశంలోని పలుచోట్ల మోస్తరు వర్షాలు పడే అశకాశాలున్నాయని తెలిపింది. రాబోయే ఏడు రోజుల పాటు దేశంలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దేశంలోని ఈశాన్య, దక్షిణ ప్రాంతాలలో భారీ వర్షాలు కొనసాగవచ్చని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ క్రమంలో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన బలమైన గాలులు వీస్తాయని తెలిపింది. ఈశాన్య రాష్ట్రాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలిపింది. అలాగే దక్షిణ భారత దేశంలోని పలు ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

Also Read: Pastor Praveen Case: పాస్టర్ ప్రవీణ్ మృతి.. హర్ష కు మార్ కు సోనియా గాంధీ సంచలన లేఖ!
 
ముఖ్యంగా అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల్లో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అస్సాంలోని గౌహతిలో  భారీ వర్షం కురిసింది. భారీ వర్షాల కారణంగా అనేక ప్రాంతాలు జలమయం అయ్యాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రెండు మూడు గంటల పాటు కురిసిన వర్షం కారణంగా.. నగరంలోని ప్రధాన రోడ్లన్నీ జలమయం అయ్యాయి. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహన దారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బుధవారం కూడా భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలో రాబోయే 24 గంటల్లో అస్సాంతో పాటు అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయలో కూడా భారీ వర్షాలు, బలమైన గాలులు కొనసాగవచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది.

Also Read:TG Crime: కానిస్టేబుల్‌తో అక్రమ సంబంధం.. అడ్డొస్తున్నాడని కొడుకునే లేపేసిన పిన్ని!
 
అయితే.. వాయువ్య బీహార్ మీదుగా తుఫాను ఏర్పడిందని.. ఇది మన్నార్ గల్ఫ్ వరకు ఉత్తర-దక్షిణ ద్రోణి ఏర్పడుతుంది. దీని ప్రభావంతో రాబోయే 7 రోజులు ఈశాన్య భారతదేశంలో ఉరుములు, మెరుపులు, బలమైన గాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఈ నెల22 నుంచి27 మధ్య అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్‌లలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు నాగాలాండ్, మణిపూర్, మిజోరం మరియు త్రిపురలలో కూడా భారీ వర్షాలు కురిస్తాయని పేర్కొంది.

Also Read:దుబాయ్ నుంచి బ్యాగ్‌ తెచ్చిన భర్త.. చంపి అదే బ్యాగ్‌లో ప్యాక్ చేసిన భార్య.. ఎలా దొరికిందంటే?
 
ఈ ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉండనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు కురుస్తున్నాయి. మూడు రోజుల పాటు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనా. ఉత్తర కోస్తా ఆంధ్ర ప్రదేశ్, యానాం, దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్ మరియు రాయలసీమలో కొన్ని చోట్ల ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ అధికారులు సూచించారు.

 

 

Advertisment
Advertisment
Advertisment