/rtv/media/media_files/2025/02/15/osGwaCWvteQtX8nLhAyP.jpg)
Annavaram Police Station
Soil Mafia At Annavaram : కాకినాడ జిల్లా అన్నవరంలో మట్టి మాఫియా ఆగడాలు మితిమీరుతున్నాయి. సమాధులను కూడా వదలకుండా తవ్వుకెళ్లిపోతున్నారు. అర్థరాత్రి పూట స్మశానంపై పడి కళేబరాలతో సహా తవ్వుకెళ్లిపోతున్నారు. తవ్వుకెళ్లిన మట్టిని కళేబరాలతో సహా కొత్త ఇంటి నిర్మాణానికి పునాదుల్లో వాడుతున్నారు. స్మశానాల్లో తమవారి సమాధులు మాయం అవుతుండటంతో ముస్లిం పెద్దలు పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు మట్టి తవ్వకానికి వినియోగిస్తున్న ప్రోక్లయిన్ స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.
Also Read : Tamilanadu: ఒక్క నిమ్మకాయ అక్షరాలా రూ.6 లక్షలు.. అందులో ఏమంతా స్పెషల్ ఉందబ్బా!
కాకినాడ జిల్లాలో మట్టిమాఫియా ఏకంగా స్మశానంలో సమాధులను సైతం తవ్వి మట్టిని తరలించుకుపోతున్నారు. సమాధుల్లోని కళేబరాలను కూడా వదిలిపెట్టకుండా తవ్వుకెళ్తున్నారు.కాకినాడ జిల్లా శంఖవరం మండలం అన్నవరం గ్రామంలో మట్టి మాఫియా ముస్లిం స్మశాన భూములను సమాధులు తో పాటు తవ్వుకెళ్ళిపోయింది. మట్టితో పాటు కళేబరాలను కూడా తవ్వుకెళ్లడంతో ఆ ఎముకలు నూతన భవన నిర్మాణ పునాదుల్లో దర్శనమిస్తున్నాయి. ఇటీవల కాలంలో మృతి చెందిన వ్యక్తుల సమాధులకు సంబంధించి కళేబరాలు మాయం కావడం కలకలం రేపింది. దీంతోముస్లిం సోదరులు సోదాలు నిర్వహించి ఒక మృతదేహనికి సంబంధించిన కళేబరాన్ని పట్టుకున్నారు. దాన్ని పోలీసులు సమక్షంలో మసీదులో భద్రపరిచారు.
ఇది కూడా చదవండి: వాళ్లు అప్లై చేసుకోవద్దు.. కొత్త రేషన్ కార్డు అప్లికేషన్లపై బిగ్ ట్విస్ట్!
ముస్లిం పెద్దల ఫిర్యాదులతో కదిలిన అన్నవరం పోలీసులు ముస్లిం స్మశాన భూముల్లో మట్టిని తవ్వి అన్నవరం పరిసర గ్రామాల్లో నూతన భవన నిర్మాణ పునాదులకు వినియోగించినట్లు గుర్తించారు. వారి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు మట్టి తవ్వకాలకు ఉపయోగించిన ప్రోక్లయిన్ ను స్వాధీనం చేసుకున్నారు. అర్ధరాత్రి అయితే చాలు ఈ మట్టి మాఫియా ఇష్టానుసారం మట్టి తవ్వుకెళ్తూ స్థానికులను భయాబ్రాంతులకు గురి చేస్తుందని ప్రజలు ఆరోపిస్తున్నారు. 76/1 సర్వే నెంబరు ముస్లిం స్మశాన వాటిక భూముల్లో సమాధులతో పాటు మట్టి మాఫియా పూర్తిగా తవ్వుకెళ్లిపోయింది. కాగా ఇప్పటికే మట్టి మాఫియాగా మారి తవ్వకాలు జరిపిన వ్యక్తుల పేర్లతో సహా ముస్లిం కుల పెద్దలు అన్నవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల వివరాలపై ఆరా తీస్తున్నారు.
ఇది కూడా చదవండి: Ramarajyam Raghav Reddy : రామరాజ్యం రాఘవరెడ్డి నెక్ట్స్ టార్గెట్ చిన్నజీయర్ స్వామినా? వీడియోలు వైరల్