Singer Mangli: ప్లీజ్ నన్ను వదిలేయండి.. సింగర్ మంగ్లీ ఎమోషనల్ !

కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుతో శ్రీకాకుళం అరసవల్లి వీఐపీ దర్శన వివాదంపై సింగర్ మంగ్లీ స్పందించారు. ఈ వివాదం ఎంతో బాధకలిగించిందని అన్నారు. కావాలనే రాజకీయ లబ్ధికోసం ఫేక్ న్యూస్‌ ప్రచారం చేస్తున్నారని ఆవేదన చెందారు. ఇక్కడితో ఈ విషయాన్ని వదిలేయండని తెలిపారు.

New Update
Singer Mangli Clarity On Srikakulam Arasavalli Rathasapthami VIP darshan controversy

Singer Mangli Clarity On Srikakulam Arasavalli Rathasapthami VIP darshan controversy

శ్రీకాకుళం జిల్లా అరసవెల్లిలో ఇటీవల రథ సప్తమి సందర్భంగా సింగర్ మంగ్లీ సందడి చేసింది. తన పాటలతో హోరెత్తించింది. అదే సమయంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడితో కలిసి వీఐపీ ప్రొటోకాల్ దర్శనం చేసుకుంది. అంతేకాకుండా ఆయనతో కలిసి సన్నిహితంగా ఉండటం.. మీడియాతో మాట్లాడటంతో టీడీపీ కార్యకర్తలకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. జగన్‌ను ఎంతో అభిమానించే మంగ్లికి తమ ప్రభుత్వంలో ఇంత ప్రాధాన్యం ఇవ్వడమేంటని సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేశారు. అయితే ఈ వివాదంపై తాజాగా మంగ్లి స్పందించారు. ఈ మేరకు ఆమె ఎమోషనల్ ప్రకటన రిలీజ్ చేశారు. 

Also Read :  మరో బ్యూటీతో లలిత్ మోదీ రాసలీలలు.. లవర్స్ డే స్పెషల్ పోస్ట్.. ఆ అందగత్తే ఎవరో తెలుసా!

ఒక్క మాట కూడా అనలేదు

అరసవల్లి దేవాలయంలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుతో కలిసి దర్శనంపై చాలా మంది విమర్శించడం బాధ కలిగించిందన్నారు. 2019 ఎన్నికలకు ముందు వైసీపీకి చెందిన కొందరు లీడర్లు తనను సంప్రదిస్తే పాటలు పాడానని.. దాని తర్వాత రెండు నియోజకవర్గాల్లో క్యాంపెయిన్ చేశానని తెలిపారు. అక్కడి స్థానిక నేతలు వ్యక్తిగతంగా తెలిసిన కారణంగానే ప్రచారంలో పాల్గొనాల్సి వచ్చిందని అన్నారు. కానీ ఏ ఇతర పార్టీలకు సంబంధించి ఎవరినీ ఒక్క మాట కూడా అనలేదని.. దూషించలేదని తెలిపారు.

Also Read: ఆ విషయంలో భర్త బలవంతం చేసినా తప్పుకాదు: హైకోర్టు

అవమానాలు ఎదుర్కున్నా

తాను ఎక్కడా పార్టీ జెండా ధరించలేదని, పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొనలేదని అన్నారు. అప్పటి పరిస్థితుల్లో ఒక కళాకారిణిగా పాటలు పాడానని తెలిపారు. వైసీపీ ఒక్కటే కాదని.. బిజెపి, బీఆర్ఎస్ పార్టీలతో పాటు దాదాపు అన్ని పార్టీల లీడర్లకు పాటలు పాడానని గుర్తు చేశారు. కానీ అప్పటికే తనపై రాజకీయ పార్టీ ముద్ర పడటంతో మిగతా పార్టీలకు చెందిన వాళ్లకు తన పాట దూరమయ్యిందన్నారు. దీంతో చాలా అవకాశాలు కోల్పోయానని.. ఎన్నో అవమానాలు ఎదుర్కున్నానని ఆవేదన చెందారు.

సున్నితంగా తిరస్కరించా

ఈ కారణంగానే 2024 ఎన్నికలకు ముందు వైసీపీతో పాటు అన్ని ప్రధాన పార్టీలు ప్రచార పాటలు పాడాలని కోరినా సున్నితంగా తిరస్కరించానని గుర్తు చేశారు. ఒక కళాకారిణీగా గుర్తించి ఎస్వీబిసి ఛానల్ సలహాదారుగా నియమిస్తున్నట్లు ఛానల్ అధికారులు తనను సంప్రదించారని.. అయితే తాను ఆ పదవి స్వీకరించాలా వద్దా అని చాలా రోజులు తర్జన భర్జన పడ్డానని అన్నారు. ఇది రాజకీయ పదవి కాదని, అప్పటికే చాలా మంది కళాకారులు సలహాదారులుగా చేశారని తన శ్రేయోభిలాషులు సూచించారన్నారు.

Also Read :  USA:  ట్రంప్, మస్క్ కలిసి ఉద్యోగాలు పీకేస్తున్నారు..ఇప్పటికి 10వేల మంది అవుట్

చంద్రబాబును ఏమీ అనలేదు

పైగా తమ ఇంటి ఇలవేల్పు శ్రీవారికి సన్నిధిలో ఎలాంటి అవకాశం వచ్చినా తిరస్కరించరాదనే ఉద్దేశంతో ఆ పదవిని కొనసాగించానే తప్ప ఎక్కడా బహిరంగంగా ఆ పదవి గురించి ప్రకటించుకోలేదని తెలిపారు. తాను పాటను నమ్ముకునే వచ్చాను.. కాని పార్టీలను, పదవులను నమ్ముకొని రాలేదని చెప్పారు. చంద్రబాబు నాయుడుని తాను ఎక్కడా అనని మాటలను, ఆధారాలు లేకుండా వాస్తవాలు తెలీకుండా కొందరు కావాలనే రాజకీయ లబ్ధి కోసం ఫేక్ న్యూస్‌ను ప్రచారం చేస్తున్నారని ఆవేదన చెందారు. చంద్రబాబుకి తాను పాట పాడను అన్నది ముమ్మాటికి వాస్తవం కాదని ప్రమాణం చేసి చెబుతున్నానన్నారు. 

విష ప్రచారం

మొదట్లో వైసీపీకి పాడిన కారణంగానే కావచ్చు.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీకి చెందిన ఎవరూ కూడా తనను సంప్రదించలేదన్నారు. దేశ రాజకీయ చరిత్రలో ఒక ప్రత్యేక స్థానం కలిగిన అంతపెద్ద మనిషిని తాను అంతమాట అన్నానని ప్రచారం చేయడం న్యాయమేనా? అని ఆవేదన వ్యక్తం చేశారు. 2019 ఎన్నికల్లోని వీడియో క్లిప్పులతో రాజకీయ పార్టీలకు ముడిపెట్టి తనపై విష ప్రచారం చేస్తున్నారన్నారు. 

బలహీనురాలిని

ఒక గిరిజన కుటుంబం నుంచి వచ్చిన తనలాంటి బలహీనురాలిపై ఇలాంటి వ్యతిరేక ప్రచారం చేయటం చాలా బాధాకరం అని అన్నారు. తనకు ఎలాంటి రాజకీయ అభిమతాలు కాని, పక్షపాతాలు కాని లేవని.. తాను ఏ పార్టీ ప్రచార కార్యకర్తను కానని క్లారిటీ ఇచ్చారు. అందరు నాయకులపై తనకు గౌరవం ఉందని.. ప్రతి ఒక్కరూ తనకు ఆదర్శనీయులని అన్నారు. తాను హాజరయ్యే కార్యక్రమాలు కేవలం కళాదృష్టితోనే చూడమని వేడుకుంటున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు