Singer Mangli: ప్లీజ్ నన్ను వదిలేయండి.. సింగర్ మంగ్లీ ఎమోషనల్ !
కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుతో శ్రీకాకుళం అరసవల్లి వీఐపీ దర్శన వివాదంపై సింగర్ మంగ్లీ స్పందించారు. ఈ వివాదం ఎంతో బాధకలిగించిందని అన్నారు. కావాలనే రాజకీయ లబ్ధికోసం ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారని ఆవేదన చెందారు. ఇక్కడితో ఈ విషయాన్ని వదిలేయండని తెలిపారు.