Donald Trump : వైట్‌ హౌజ్‌ సమీపంలో కాల్పులు...ఆ సమయంలో అదే హోటల్‌లో  కేఏ పాల్‌

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై జరిగిన హత్యాయత్నం ఘటనలో ఒక అనూహ్యమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కాల్పుల సమయంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అదే హోటల్‌లో ఉండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

New Update
FotoJet - 2026-04-26T092149.528

Shooting near the White House...KA Paul was in the same hotel at the time

Donald Trump :  అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై జరిగిన హత్యాయత్నం ఘటనలో ఒక అనూహ్యమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కాల్పుల సమయంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అదే హోటల్‌లో ఉండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.వైట్‌హౌజ్ సమీపంలోని ఒక హోటల్‌లో ఏర్పాటు చేసిన 'కరస్పాండెంట్స్ డిన్నర్' కార్యక్రమంలో డొనాల్డ్ ట్రంప్ పాల్గొన్నారు. ఆ సమయంలో గుర్తుతెలియని దుండగుడు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డాడు. సుమారు 5 నుంచి 8 రౌండ్ల వరకు కాల్పులు జరిగినట్లు సమాచారం.

 కాల్పులు మొదలవ్వగానే సీక్రెట్ సర్వీస్ బలగాలు అప్రమత్తమై, ట్రంప్‌ను రక్షణ కవచంలా చుట్టుముట్టి సురక్షిత ప్రాంతానికి తరలించాయి.పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని, హోటల్ పరిసరాలను తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు.గత మూడు దశాబ్దాలుగా అంతర్జాతీయ వేదికలపై శాంతి దూతగా ప్రచారం చేసుకుంటున్న కేఏ పాల్, ఈ ఘటన జరిగిన సమయంలో అదే హోటల్‌లో బస చేసి ఉన్నారు. ఈ భయానక అనుభవంపై ఆయన స్పందిస్తూ.. "గత 37 ఏళ్లుగా అమెరికా వచ్చినప్పుడు నేను ఈ హోటల్‌లోనే ఉంటాను, కానీ ఇలాంటి పరిస్థితిని చూడటం ఇదే మొదటిసారి" అని ఆవేదన వ్యక్తం చేశారు. సాక్షాత్తు అమెరికా అధ్యక్షుడికే రక్షణ లేకపోతే, సామాన్యుల పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాల వల్ల పెరిగిన హింసా ప్రవృత్తే ఇటువంటి దాడులకు దారితీస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.

హత్యాయత్నం నుంచి సురక్షితంగా బయటపడిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ తన సొంత సోషల్ మీడియా వేదిక 'ట్రూత్ సోషల్‌' (Truth Social) ద్వారా స్పందించారు.తనను కాపాడిన సీక్రెట్ సర్వీస్,పోలీస్ విభాగాల పనితీరును అద్భుతమని కొనియాడారు.తాను క్షేమంగా ఉన్నానని అభిమానులకు భరోసా ఇచ్చారు.ఈ ఘటనతో అమెరికా వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. ప్రపంచ దేశాల అధినేతలు ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఒక అంతర్జాతీయ స్థాయి కార్యక్రమంలో భద్రతా వైఫల్యాలు ఎలా చోటు చేసుకున్నాయనే కోణంలో దర్యాప్తు సంస్థలు విచారణ జరుపుతున్నాయి.

Advertisment
తాజా కథనాలు