అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన పాస్టర్ ప్రవీణ్ కేసులో మరో సంచలనం చోటుచేసుకుంది. 2025 మార్చి 24వ తేదీ ఉదయం 11 గంటలకు హైదరాబాద్ నుంచి రాజమండ్రికి తన బైక్ పై బయలుదేరారు పాస్టర్ ప్రవీణ్. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆయన హైదరాబాద్ నుంచి రాజమండ్రికి ఎందుకు వెళ్లారనేదానిపై ఆర్టీవీ చేసిన ఇన్వేస్టిగేషన్ లో కీలక విషయాలు బయటపడ్డాయి.
509 గజాల ల్యాండ్ కొనుగోలు
రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో పాస్టర్ ప్రవీణ్ ఇటీవల 509 గజాల ల్యాండ్ కొనుగోలు చేశారు. ఈ ల్యాండ్ ను ఆయన కుమార్తె రిషిక, మేనల్లుడు రాజేష్ లపై కొనుగోలు చేశారు. మార్చి 12న ల్యాండ్ రిజిస్ట్రేషన్ అయింది. ప్రవీణ్ రాజమండ్రికి వచ్చే విషయం తన భార్యతో పాటుగా ఆకాష్, జాన్ లకు మాత్రమే తెలుసు. ఓ సేవ స్వంస్థతో పాటుగా అనాధ పిల్లల కోసం హాస్టల్ నిర్మించాలని ప్రవీణ్ ఈ 509 గజాల ల్యాండ్ కొనుగోలు చేసినట్లుగా తెలిసింది.