/rtv/media/media_files/2025/02/06/QnH3wosne4BQvH9liJZe.jpg)
Ram Gopal Varma
Ram Gopal Varma: వివాదస్పద సినిమా డైరెక్టర్ రాంగోపాల్ వర్మ పై నమోదైన కేసు విషయంలో రేపు ((07/02/25) ప్రకాశం జిల్లా ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ లో హాజరు కావలసి ఉంది. ఇప్పటికే విచారణకు హాజరు కావాలని ఆర్జీవీ కి ఒంగోలు రూరల్ పోలీసులు నోటీసులు అందజేశారు.గతంలోనూ నోటీసులు ఇచ్చినప్పటికీ ఆయన హాజరుకాలేదు. కోర్టును ఆశ్రయించినప్పటికీ ఊరట లభించలేదు.దీంతో రేపు ఉదయం 11గం.లకు హాజరవుతున్నట్లు ఆర్జీవీ సమాచారం ఇచ్చినట్లు పోలీసులు దృవీకరించారు.శుక్రవారం రోజున విచారణకు హాజరు కావాలని పోలీసులు ఇప్పటికే మొబైల్ వాట్స్ ఆప్ ద్వారా సమాచారం అందించారు.
Also Read : తాడేపల్లి వైసీపీ ఆఫీస్ సమీపంలో అగ్ని ప్రమాదం
నాటి ప్రతిపక్షనేత, నేటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుతో పాటు ఆయన కుమారుడు మంత్రి నారా లోకేష్ ను ఉద్ధేశించి అనుచిత వ్యాఖ్యలు చేశాడని ఆరోపిస్తూ తెలుగుదేశం పార్టీ కార్యకర్త రామలింగం గత ఏడాది నవంబర్ 11న మద్ధిపాడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు రాంగోపాల్ వర్మకు నోటీసులు జారీ చేశారు. అదే ఏడాది నవంబర్ 13న ఆర్జీవీకి మద్దిపాడు పోలీసులు హైదరాబాద్ లో నోటీసులు అందజేశారు. దీంతో తనకు సమయం కావాలని కోర్టును ఆశ్రయించారు. అయితే కోర్టు అందుకు అనుమతివ్వలేదు. దీంతో 19 న పోలీస్ విచారణకు రావలసిన ఆర్జీవీ తన తరుపున లాయర్ ను పంపించి గడువు కోరారు.
Also Read : కుల గణన సర్వేపై నెక్స్ట్ స్టెప్ ఇదే.. మంత్రి ఉత్తమ్ సంచలన ప్రకటన!
ఆర్జీవీ మీదా మొత్తం 7 సెక్షన్ల కింద కేసు
పోలీసులు గడువు ఇవ్వకపోగా ఆయనను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారు. కానీ ఆయన పోలీసులకు చిక్కలేదు. ఆ తర్వాత మళ్లీ కోర్టును ఆశ్రయించడంతో కొంత కోర్టు కొంత సమయం ఇచ్చింది.కోర్టు ఇచ్చిన గడువు ముగియడంతో మరోసారి ఆర్జీవీ కి ఒంగోలు రూరల్ పోలీసులు నోటీసులు ఇచ్చారు.దీంతో ఎట్టకేలకు ఒంగోలు వస్తున్నట్లు ఆర్జీవీ సమాచారం ఇచ్చినట్లు పోలీసులు వెల్లడించారు.కాగా ఆర్జీవీ మీదా మొత్తం 7 సెక్షన్ల కింద కేసు నమోదైంది.
Also Read: సీఎం రేవంత్ పై తిరగబడ్డ మంత్రి.. ఆ ఎమ్మెల్యేతో కలిసి ఖర్గేతో చర్చలు.. అసలు కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది?
ఈ నేపథ్యంలో రేపు విచారణకు ఆర్జీవీ హాజరవుతారా లేదా? వస్తే ఆయన విచారణ ఎలా ఉండబోతుంది? విచారణ సందర్భంగా ఆయనకు ఎలాంటి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. ఆ ప్రశ్నలకు ఆర్జీవీ సమాధానం చెప్తారా? ఒకవేళ సరైన సమాధానాలు రాకపోతే అరెస్ట్ చేస్తారా? లేక మరో అవకాశం ఇస్తారా? అనేది తేలాల్సి ఉంది. కాగా ఆర్జీవీ విచారణ నేపథ్యంలో ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ పరిసరాల్లో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు.
Also Read: Sekhar Basha: శేఖర్ బాషాకు బిగ్ షాక్.. మరో కేసు నమోదు..