/rtv/media/media_files/2026/02/07/fotojet-5-2026-02-07-16-14-58.jpg)
kavitha
Woman And Boy Incident : చిత్తూరు జిల్లాలో 17 ఏళ్ల మైనర్ బాలుడితో వివాహేతర సంబంధం కొనసాగించిన 37 ఏళ్ల మహిళ, అడ్డుగా ఉన్న భర్త, అత్తను చంపేయాలని ఆమె ఆ బాలుడితో కలిసి స్కెచ్ వేసింది. అత్తపై మైనర్ దాడి చేయగా ఆమె ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న మహిళ కోసం గాలిస్తున్నారు.
ఆమెకు 37 ఏళ్లు, అతడికి 17 ఏళ్లు.. ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. అక్కడితో ఆగకుండా 20 ఏళ్లు చిన్నవాడైన ఆ కుర్రాడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. వివాహేతర సంబంధానికి భర్త, అత్త అడ్డుగా ఉన్నారని ఆ వివాహిత భావించింది.. ఇద్దరిని అడ్డు తొలగించుకుంటే ఇబ్బంది లేకుండా పోతుందని ప్లాన్ చేసింది. ఆ కుర్రాడికి చెప్పి భర్తతో పాటుగా అత్తను హత్య చేయాలని రెచ్చగొట్టింది. ఆ కుర్రాడు కూడా కత్తితో వివాహిత అత్తను చంపేందుకు వెళ్లాడు.. ఆమెపై దాడి చేశాడు. ఇంతలో చుట్టుపక్కల వారు రావడంతో ప్లాన్ బెడిసికొట్టి అతడు దొరికిపోయాడు. చిత్తూరు జిల్లాలో జరిగిన ఈ ఘటన కలకలంరేపింది.
వివరాల్లోకి వెళ్తే.. చిత్తూరు జిల్లా చామంతిపురం ప్రాంతానికి చెందిన కవిత (37)కు అదే ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల బాలుడితో కొంతకాలంగా పరిచయం ఏర్పడి, అది వివాహేతర సంబంధంగా మారినట్లు సమాచారం. కవితకు 17 ఏళ్ల క్రితం వివాహం కాగా, 15 ఏళ్ల వయస్సున్న ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే బాలునితో వివాహేతర సంబంధం విషయం తెలుసుకున్న భర్త విజయ్‌కుమార్ పలుమార్లు కవితను మందలించాడు. భార్యాభర్తల మధ్య వాగ్వాదం కూడా జరిగినట్లు చెబుతున్నారు.
ఇటీవల మరోసారి భర్త కవితను తీవ్రంగా హెచ్చరించాడు.. అయినా సరే ఆమె మాత్రం తన పద్ధతి మార్చుకోలేదు. పైగా అప్పుడు భర్త, అత్తపై కోపం పెంచుకుంది.. వారిని అడ్డు తొలగించుకోవాలని భావించింది. వాళ్లిద్దర్ని చంపేయాలని మైనర్ బాలుడిని కవిత రెచ్చగొట్టింది. మైనర్ బాలుడు ఫిబ్రవరి 5న రాత్రి ఇంట్లో ఒంటరిగా ఉన్న అత్త నిర్మలపై దాడికి పాల్పడ్డాడు. ఆమె కళ్లల్లో కారం కొట్టి, కత్తితో గొంతు కోసి హత్య చేయడానికి ప్రయత్నించాడు. నిర్మల బాలుడ్ని ప్రతిఘటించి పెద్దగా కేకలు వేసింది. వెంటనే చుట్టుపక్కల జనాలు పరుగెత్తుకొచ్చారు. వాళ్లను చూసి ఆ బాలుడు అక్కడి నుంచి పరారయ్యాడు. నిర్మల గొంతుపై తీవ్ర గాయం కావడంతో వెంటనే స్థానికులు ఆమెను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు నిందితుడైన బాలుడ్ని అదుపులోకి తీసుకున్నారు. కవిత రెచ్చగొట్టడంతోనే మైనర్ బాలుడు ఈ దారుణానికి ఒడిగట్టాడని పోలీసులు తెలిపారు. కవిత మాత్రం పరారీలో ఉంది.. మైనర్ బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని జువైనల్ హోమ్‌కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన చిత్తూరు వన్‌టౌన్ పోలీసులు దర్యాప్తు చేపట్టి, పరారీలో ఉన్న కవిత కోసం గాలిస్తున్నారు.
Follow Us