తిరుపతి లడ్డూతో రాజకీయాలు వద్దు.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు తిరుమల లడ్డూ కల్తీ వివాదం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే .ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. రాజకీయాల నుంచి దేవుడిని దూరంగా ఉంచాలని ధర్మాసనం సూచనలు చేసింది. లడ్డూలో కల్తీ జరిగిందని నిర్ధారించారా అంటూ ప్రశ్నించింది. By B Aravind 30 Sep 2024 in ఆంధ్రప్రదేశ్ నేషనల్ New Update షేర్ చేయండి తిరుమల లడ్డూ కల్తీ వివాదం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. లడ్డూ తయారీలో జంతు కొవ్వు కలిపారని సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలపై వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు కమిటీ ఏర్పాటు చేయాలని బీజేపీ సీనియర్ నేత సుబ్రమణియన్‌స్వామి, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి సహా పలువురు పిటిషన్లు వేశారు. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో స్వతంత్ర దర్యాప్తు జరపాలని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అభ్యర్థించారు. ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టులో జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ కేవీ విశ్వనాథన్ ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రస్తుతం ఈ అంశంపై న్యాయవాదులు తమ వాదనలు వినిపిస్తున్నారు. J Gavai (jokes): Hopefully we don't have to eat laddus in lunch#SupremeCourt #Tirupati — Live Law (@LiveLawIndia) September 30, 2024 రాజకీయాల నుంచి దేవుడిని దూరంగా ఉంచాలని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. అలాగే సీఎం చంద్రబాబుపై కూడా ప్రశ్నల వర్షం కురిపించింది. ప్రసాదానికి సంబంధించిన ఆరోపణలపై ఎప్పుడు ప్రత్యేక విచారణ బృందం (SIT) ఏర్పాటు చేశారని ప్రశ్నించింది. ఎలాంటి విచారణ లేకుండానే మీడియాలో ఎలా స్టేట్‌మెంట్లు ఇస్తారంటూ నిలదీసింది. అయితే ఇటీవలే లడ్డూ వివాదంపై సిట్ ఏర్పాటు చేశామని ప్రభుత్వ లాయర్ బదులిచ్చారు. తమ దగ్గర ల్యాబ్ రిపోర్టు కూడా ఉందన్నారు. అయితే లడ్డూలో కల్తీ జరిగిందని నిర్ధారించారా అంటూ ప్రశ్నించింది. దీనిపై స్పందించిన ధర్మాసనం ఈ రిపోర్టులను పరిశీలిస్తే.. కల్తీ పదార్థాలు ప్రసాదాన్ని తయారు చేసేందుకు వాడలేదని కనిపిస్తోందని వ్యాఖ్యానించింది. టీటీడీ మాత్రం కల్తీ నెయ్యి వాడలేదని చెబుతోందని పేర్కొంది. అనుమానం ఉంటే రెండో అభిప్రాయం తీసుకోవాలని సూచించింది. లడ్డూలో కల్తీ జరగలేదని భావిస్తున్నామని పేర్కొంది. కల్తీ జరిగిందా లేదా అనేది టీటీడీ చెప్పాలని స్పష్టం చేసింది. సిట్ ఏర్పాటు చేయకముందే, విచారణ చేయకముందే లడ్డూలో కల్తీ జరిగిందని సీఎం వ్యాఖ్యానించారని పేర్కొంది. సెప్టెంబర్ 18 నాటి సీఎం ప్రకటనకు ఆధారం లేదని చెప్పింది. Also Read : తెలంగాణ డీఎస్సీ ఫలితాలు విడుదల.. ఈ లింక్‌తో డైరెక్ట్ రిజల్ట్స్! #telugu-news #national-news #Tirupati Laddu మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి