Ration cards : ఏపీ రేషన్‌ కార్డుదారులకు అలర్ట్...మరో వారం రోజులే ఛాన్స్..

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది దాటింది. అయితే ఇంతవరకు కొత్త రేషన్‌కార్డులు జారీ కాలేదు. గత ప్రభుత్వం వేలాది బోగస్‌ కార్డులు ఇచ్చిందని, వాటిని ఏరివేశాకే కొత్తవి జారీ చేయాలని నిర్ణయించింది. ఈ విఫయంలో ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తోంది.

New Update
Ration cards

Ration cards

Ration cards :  కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది దాటింది. అయితే ఇంతవరకు కొత్త రేషన్‌కార్డులు జారీ కాలేదు. గత ప్రభుత్వం వేలాది బోగస్‌ కార్డులు ఇచ్చిందని, వాటిని ఏరివేశాకే కొత్తవి జారీ చేయాలని నిర్ణయించింది. అయితే ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలకు రేషన్‌ కార్డు ప్రామాణికం కావటంతో పాతవి కొనసాగింపు.. కొత్తవి జారీ పైన ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తోంది. ఇదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా రేషన్‌ కార్డుదారులు ఈ నెల 31లోపు ఇకెవైసి ప్రక్రియ పూర్తి చేయాలని అన్ని జిల్లాల యంత్రాంగానికి ప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీ చేసింది.

Also Read: Bangladesh: ఢాకాలో భారీగా సైన్యం.. తిరుగుబాటు పరిస్థితులు..!

 ఏపీలో కొత్త రేషన్ కార్డుల కోసం లక్షలాది మంది నిరీక్షిస్తున్నారు. ప్రభుత్వం అమలు చేయనున్న సూపర్ సిక్స్ పథకాలకు రేషన్ కార్డు ప్రాతిపదిక కావటంతో.. పథకాల లబ్ది దారులు ఈ కార్డుల మంజూరు కోసం ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి చూస్తున్నారు. అదే సమయంలో కార్డుల్లో మార్పుల చేర్పుల కోసం పెద్ద సంఖ్యలో లబ్ది దారులు నిరీక్షిస్తున్నారు. అర్హత లేకుండా కార్డులు పొందిన వారివి తెలిగించేలా ప్రభుత్వం క్షేత్ర స్థాయిలో సర్వే చేస్తోంది. ఇక, ఇప్పుడు రేషన్ కార్డుల లబ్దిదారులు ఈ కేవైసీ తప్పని సరిగా చేసుకొనేలా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోవాలని పౌరసరఫరాలశాఖ కమిషనరు సౌరబ్‌గౌర్‌ ఆదేశించారు.

Also Read: ప్రపంచంలో ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న క్రీడ ఏదో తెలుసా..?

 ఈ కేవైసీ యూనిట్లు రేషన్‌ డీలర్లు, తహశీల్దార్లు, డీఎస్‌ఓల లాగిన్‌లలో యూనిట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లోని మొబైల్‌ యాప్‌, రేషన్‌ షాపుల్లోని ఈ పోస్‌ పరిక రాల ద్వారా అప్‌డేట్‌ చేసుకోవచ్చన్నారు. ఐదేళ్లలోపు పిల్లలకు ఈ కేవైసీ  నుంచి మినహాయింపు ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే జిల్లాలో రేషన్‌ కార్డుల ఈకేవైసీ ప్రక్రియ జోరుగా సాగుతున్నది. ఈకేవైసీ ప్రక్రియతో ప్రస్తుతం ఉన్న రేషన్‌కార్డుల ప్రక్షాళనతో పాటు బోగస్‌ ఏరివేతకు అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. రేషన్‌కార్డుల్లోని లబ్ధిదారులందరి బయోమెట్రి క్‌ నమోదు చేయడంతో దాదాపుగా కార్డులు ప్రక్షాళన జరిగి వాస్తవ లబ్ధిదారులకు మాత్రమే రేషన్‌ పంపిణీ చేసేందుకు అవకాశం కలుగుతుందని డీలర్లు అంటున్నారు.

Also Read: Italy: ఆ ప్రాంతంలో స్థిరపడితే కనుక రూ. 92 లక్షలు మీవే !

పథకాల కోసం ప్రస్తుతం ప్రభుత్వ యంత్రాంగం చేపడుతున్న ఈకేవైసీని లబ్ధిదారులు చేయించకుంటే వారి కార్డు రద్దయ్యే అవశాలున్నాయని ప్రచారం సాగుతోంది. ఈకేవైసీ జరగని కారణంగా ఆ రేషన్‌కార్డు రద్దు జాబితాలో చేరుతుందని చెబుతున్నారు. దీంతో, రేషన్‌కార్డు లబ్ధిదారులు విధిగా ఈకేవైసీ చేయిం చుకోవాలని పౌర సరఫరాల శాఖ అధికారులు కోరుతున్నారు. దాదాపు 30 శాతం కార్డులకు ఇప్పటికేఈ కేవైసీ పూర్తి కాలేదని సమాచారం. దీని కారణంగానే జిల్లా యంత్రాంగానికి తాజాగా ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి. వచ్చే మే నెల నుంచి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాల అమలు దిశగా కసరత్తు చేస్తోంది. ముందుగా లబ్ది దారుల ఖరారులో భాగంగా రేషన్ కార్డులను ప్రామాణికం గా భావిస్తున్నారు. దీంతో.. ఇప్పుడు రేషన్ కార్డుల కొనసాగింపు.. పథకాల లబ్దిదారుల ఎంపికలో ఈ కార్డులు - ఈ కేవైసీ ప్రక్రియ కీలకంగా మారుతోంది.

ఇది కూడా చూడండి: Viral video: ఫోన్‌లో IPL మ్యాచ్ చూస్తూ బస్సు నడిపిన డ్రైవర్.. భారీ జరిమానాతోపాటు..!

 

 


 

Advertisment
Advertisment
Advertisment