AP BREAKING: వివేక హత్య కేసు సాక్షి రంగన్న మృతి.. డీజీపీకి ఏపీ కేబినెట్ కీలక ఆదేశం!

ఏపీ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. మంత్రివర్గ సమావేశం అనంతరం వివేకా హత్య కేసు ప్రత్యక్ష సాక్షి వాచ్ మెన్​ రంగయ్య మృతిపై సుదీర్ఘ చర్చ జరిగింది. వివేకా హత్య కేసు నిందితులు ఒక్కొక్కరుగా చనిపోవడం పై దాదాపు గంటపాటు చర్చించారు.

New Update
Y. S. Vivekananda Reddy

Y. S. Vivekananda Reddy

AP BREAKING:  ఏపీ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. మంత్రివర్గ సమావేశం అనంతరం వివేకా హత్య కేసు ప్రత్యక్ష సాక్షి వాచ్ మెన్​ రంగయ్య మృతిపై సుదీర్ఘ చర్చ జరిగింది. వివేకా హత్య కేసు నిందితులు ఒక్కొక్కరుగా చనిపోతున్న అంశంపై దాదాపు గంటపాటు చర్చించారు. రంగయ్య మృతి వెనుక ఉన్న అనుమానాలను డీజీపీ మంత్రులకు వివరించారు. రంగయ్య మృతి ముమ్మాటికీ అనుమాన్పదమేనని క్యాబినెట్ అనుమానం వ్యక్తం చేసింది. సీబీఐ పరిధిలో కేసు ఉన్నా సాక్షులను రక్షించాల్సిన బాధ్యత మనపై ఉందని మంత్రి వర్గం అభిప్రాయపడింది. సాక్షులు అనుమానాస్పద రీతిలో మృతి చెందడం దురదృష్టకరమని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. 

ఇది కూడా చూడండి: SVSC Re Release: థియేటర్ లో పూలకుండీ సీన్ రిక్రియేషన్.. SVSC రీరిలీజ్ హంగామా! 

రంగయ్యది అనుమానాస్పద మృతేనని పోలీసుల విచారణలోనూ నిర్ధారణ అయిందని డీజీపీ వెల్లడించారు. వివేకా హత్య జరిగిన రోజు జగన్, భారతిలను హైదరాబాద్ నుంచి పులివెందుల తీసుకొచ్చిన డ్రైవర్ కూడా చనిపోయిన అంశం మంత్రివర్గంలో ప్రస్తావనకు వచ్చింది. ఇలా ఇప్పటివరకు ఏడుగురు చనిపోయారని క్యాబినెట్​లో చర్చించారు. మరో సాక్షి దస్తగిరికి వచ్చిన బెదిరింపులు అంశంపైనా చర్చ జరిగింది. ఉన్న అనుమానాలతో కేసును ఎలా ముందుకు తీసుకెళ్లాలనే అంశంపై చర్చించారు.పూర్తిస్థాయి విచారణ జరిపించాలని డీజీపీని మంత్రివర్గం ఆదేశించింది.

ఇది కూడా చూడండి: VIRAL VIDEO: కన్నీరు పెట్టిస్తున్న బాల్య వివాహం.. రానంటున్నా భుజంపై ఎత్తుకుని తీసుకెళ్లిన వరుడు!

కాగా మాజీ మంత్రి వివేకా హత్య కేసులో కీలక సాక్షిగా ఉన్న వాచ్‌మన్‌ రంగన్న బుధవారం మృతి చెందారు. ఉబ్బసం, శ్వాసకోశ వ్యాధులతో కొంతకాలంగా బాధపడుతున్న ఆయన రెండు వారాల కిందట కిందపడ్డాడు. అప్పుడు కాలికి గాయమైంది. అప్పటి నుంచి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ పులివెందులలోని ఇంటి వద్దే ఉంటున్నారు. బుధవారం మధ్యాహ్నం ఊపిరాడటం లేదని తెలపడంతో కుటుంబ సభ్యులు, రక్షణగా ఉన్న కానిస్టేబుల్‌ కడప రిమ్స్‌కు తరలించారు. అక్కడ సాయంత్రం మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

ఇది కూడా చూడండి: gold smuggling : పోలీస్ బాస్‌కు క్రిమినల్ హిస్టరీ.. స్మగ్లింగ్‌ చేస్తూ దొరికిన కన్నడ హీరోయిన్ తండ్రి కూడా..

కాగా రంగన్న మృతిపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆయన భార్య సుశీలమ్మ పులివెందుల పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా వాచ్‌మెన్ రంగన్న భార్య సుశీలమ్మ షాకింగ్ విషయాలు బయటపెట్టింది. పోలీసులు, సీబీఐ వేధింపుల వల్లే తన భర్త రంగన్న అనారోగ్యానికి గురయ్యారని ఆవేదన వ్యక్తం చేసింది. తప్పుచే‌సింది ఒకళ్లు.. శిక్ష తన భర్త రంగన్నకు వేశారని ఆమె కన్నీరు పెట్టుకుంది. గత ఆరేళ్లుగా పోలీసులు తమ ఇంటి ముందు కాపలా ఉన్నారని తెలిపింది. పోలీసులు సరైన సమయంలో వైద్యం చేయించలేదని..మూడు నెలల నుంచి తన భర్త మంచాన పడ్డారని చెప్పింది. అప్పట్లో తప్పు చేసిన వారిని పట్టుకోకుండా తన భర్తను పట్టుకుని వేధించారని రంగన్న భార్య సుశీలమ్మ వాపోయింది.

Also Read: TG GPO jobs: ఉద్యోగాల జాతర.. 10వేల GPO పోస్టులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్


2019 మార్చి 15న వివేకా దారుణ హత్యకు గురయ్యారు. ఇప్పటిదాకా మూడు సిట్‌లు, సీబీఐ విచారణ జరిపినా ఇంకా హత్యకు సూత్రధారులెవరో తేలలేదు. సిట్‌ దర్యాప్తు సమయంలోనే శ్రీనివాసులరెడ్డి అనుమానాస్పద రీతిలో చనిపోవడం అప్పట్లో సంచలనం కలగించింది. 2022 జూన్ 9న దేవిరెడ్డి శివశంకర్ ​రెడ్డి ముఖ్య అనుచరుడు కువైట్ గంగాధర్ ​రెడ్డి అనంతపురం జిల్లా యాడికిలో అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. మరో కీలక సాక్షి డాక్టర్ వైఎస్​ అభిషేక్ రెడ్డి హైదరాబాద్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇక వివేకా హత్యను కేసులో ప్రత్యక్షసాక్షి వాచ్‌మెన్‌ రంగన్ అనారోగ్యంతో చికిత్సపొందుతూ చనిపోయాడు.

Also Read: ఒరేయ్ ఇదేం పనిరా.. పెళ్లాం ముందే నిద్రిస్తున్న మరో యువకుడి ప్రైవేట్ పార్ట్స్ టచ్ చేస్తూ.. ఛీ ఛీ!

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Ketireddy: గెస్ట్‌హైస్‌ వివాదం.. హైకోర్టులో కేతిరెడ్డికి ఊరట

వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి హైకోర్టులో ఊరట లభించింది. గెస్ట్‌హౌస్ వివాదంలో న్యాయస్థానం స్టేటస్ కో విధించింది. శ్రీసత్యసాయి జిల్లాలో గుర్రాల కొండపై కేతిరెడ్డికి చెందిన 2.42 ఎకరాల భూమిపై వివాదం నడుస్తోన్న సంగతి తెలిసిందే.

New Update
EX MLA Keti reddy

EX MLA Keti reddy

వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి హైకోర్టులో ఊరట లభించింది. గెస్ట్‌హౌస్ వివాదంలో న్యాయస్థానం స్టేటస్ కో విధించింది.  ఇక వివరాల్లోకి వెళ్తే..  శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డికి ధర్మవరం చెరువు ప్రాంతంలో ఉన్న గుర్రాల కొండపై 2.42 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నట్లు రెవెన్యూ అధికారులు గుర్తించారు. సర్వే నెంబర్ 905-2లో 2.42 ఎకరాలు ఆయన సోదరుడు కేతిరెడ్డి వెంకటకృష్ణారెడ్డి భార్య గాలి వసుమతి పేరుతో రిజిస్టర్ అయ్యింది. 

Also Read: లేడీ కానిస్టేబుల్ కారులో డ్రగ్స్.. తర్వాత ఏం జరిగిందంటే?

1960లో ఈ భూమిలో వ్యవసాయం చేసుకునేందుకు ధర్మవరం మండలం మోటుమర్లకు చెందిన అంకే నారాయణ, లక్ష్మీచెన్నకేశవపురానికి చెందిన ఓబులమ్మ, రామగిరి మండలం శ్రీహరిపురానికి చెందిన తలారి అంజినమ్మలకు ప్రభుత్వం పట్టాలు ఇచ్చింది. అయితే వాళ్లు ఈ భూమిని గాలి వసుమతికి అమ్మేసి రిజిస్టర్ చేయించారు. వాస్తవానికి ప్రభుత్వం వ్యవసాయం చేసుకునేందుకు ఇచ్చిన భూమిని అమ్మేసేందుకు పర్మిషన్ లేదు. దీంతో ఈ భూమిని అమ్మిన ముగ్గురికి రెవెన్యూ అధికారులు నోటీసులు పంపించారు.  

Also Read: ఎట్టకేలకు నెరవేరిన యూనస్ కోరిక.. మొదటిసారి విందు పంచుకున్న మోదీ

అలాగే ఈ భూమిని కొన్న గాలి వసుమతికి కూడా రిజిస్టర్ పోస్ట్‌ ద్వారా నోటీసులు పంపించారు. కానీ ఆమె నోటీసు తీసుకోకపోవడంతో అది తిరిగి వచ్చింది.  దీంతో గుర్రాలకొండ వ్యవసాయ క్షేత్రంలోని ఆ ప్రభుత్వ భూమిని గుర్తించి, స్వాధీనం చేసుకోవాలని ఇటీవల హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.  దీంతో అధికారులు భూమిని గుర్తించి బోర్డు ఏర్పాటు చేసేందుకు వెళ్లగా.. గేటుకు తాళాలు వేసి ఉండటంతో వెనక్కి వచ్చేశారు. చివరికీ ఈ గెస్ట్‌హౌస్‌ స్థల వివాదంపై కేతిరెడ్డి లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. కేతిరెడ్డి పిటీషన్‌పై హైకోర్టులో తీర్పు వచ్చాక రెవెన్యూ అధికారులు స్థలంలో ఉన్న ఆక్రమణలు తొలగించాలని నిర్ణయించినట్లు సమాచారం. అయితే తాజాగా కోర్టు దీనిపై స్టేటస్ కో విధించింది. అంటే కోర్టు తుది నిర్ణయానికి వచ్చేవరకు ఈ వివాదంలో ఎలాంటి జోక్యం చేసుకోకుండా యథాతథ స్థితిని కొనసాగించాలి.  

 telugu-news | rtv-news | ketireddy | former-mla-ketireddy-peddareddy | andhra-pradesh 

Advertisment
Advertisment
Advertisment