Puttaparthi: వెంటాడి వేటాడి కొట్టి చంపిన ఫ్రెండ్స్.. షాకింగ్ రీజన్!

సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని సంస్కృతి ఇంజనీరింగ్ కాలేజీలో దారుణం జరిగింది. బీటెక్ 2nd ఇయర్ చదువుతున్న ప్రేమ్‌సాయిని కొందరు విద్యార్థులు ర్యాగింగ్ చేయడంతో.. యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లాడు. కక్ష కట్టుకొని విద్యార్థులు ప్రేమ్‌ను తీవ్రంగా కొట్టి చంపారు.

New Update

ఈ మధ్య ఎవరిని నమ్మాలో.. ఎవరిని నమ్మకూడదో అర్థం కావడం లేదు. పక్కనున్న స్నేహితులే శత్రువుల్లా మారుతున్నారు. చిన్న చిన్న విషయాలకే గొడవ పడి ప్రాణాలు తీసుకుంటున్నారు. ఎంతో కాలంగా స్వార్థం లేని స్నేహం చేసిన వారు.. క్షణాకావేశంలో హత్యలకు పాల్పడుతున్నారు. ఎన్నో ఏళ్లు బతకాల్సిన నిండు ప్రాణాలు.. అర్ధాంతరంగా గాల్లో కలిసిపోతున్నాయి. 

ఇది కూడా చూడండి:  ట్రంప్ మరో విచిత్ర నిర్ణయం.. వ్యాక్సిన్లు వద్దన్న వ్యక్తికి హెల్త్ మినిస్ట్రీ!

తాజాగా అలాంటిదే ఆంధ్రప్రదేశ్‌లో జరిగింది. సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో దారుణం చోటుచేసుకుంది. ఫ్రెండ్స్ చేసే ర్యాగింగ్‌కు బీటెక్ విద్యార్థి బలి అయ్యాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. పుట్టపర్తిలోని సంస్కృతి ఇంజనీరింగ్ కాలేజీలో.. ప్రేమ్‌సాయి అనే యువకుడు బీటెక్ 2nd ఇయర్ చదువుతున్నాడు.

ఇది కూడా చూడండి: ఉన్నత హోదా ఇప్పిస్తామని.. హీరోయిన్ తండ్రికి రూ.25 లక్షలు టోకరా

ర్యాగింగ్ చేయడంతో

అదే కాలేజీలో చదువుతున్న కొందరు విద్యార్థులు ప్రేమ్ సాయిని ర్యాగింగ్ చేశారు. దీంతో ప్రేమ్ సాయి తీవ్ర మనస్థాపం చెందాడు. వెంటనే జరిగిన విషయాన్ని కాలేజీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లాడు. ఇక ప్రేమ్ సాయి కాలేజీ యాజమాన్యానికి కంప్లైట్ చేయడంతో.. విద్యార్థులు ప్రేమ్‌పై కక్షపెంచుకున్నారు.

ఇది కూడా చూడండి:  Sabarimala: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. ప్రత్యేకంగా 26 రైళ్లు ఏర్పాటు

దీంతో అవకాశం కోసం వెయిట్ చేశారు. అదే క్రమంలో ప్రేమ్ సాయిని కాలేజ్ గ్రౌండ్‌లో దారుణంగా కొట్టారు. రెండు రోజుల క్రితం ప్రేమ్ ఇంటికి వెళ్లగా.. అతడి పేరెంట్స్ ప్రేమ్ సాయి శరీరంపై ఉన్న దెబ్బలు చూసి హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అప్పటికే ప్రేమ్ చెవి లోపలి భాగం తీవ్రంగా దెబ్బతిన్నదని డాక్టర్స్ తెలిపారు.

ఇది కూడా చూడండి: వైద్యుల నిర్లక్ష్యం.. ప్రైవేట్ ఆసుపత్రికి రూ.30 లక్షల జరిమానా!

ఇక దానికి గల కారణాన్ని పేరెంట్స్ తెలుసుకున్నారు. కాలేజీలో తమ కుమారుడు ప్రేమ్‌పై ర్యాగింగ్ జరిగిందన్న విషయాన్ని తెలుసుకున్నారు. ఇక పేరెంట్స్‌కు ఆ విషయం తెలియడంతో ప్రేమ్ సాయి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే తమ అబ్బాయిని కొట్టడం వల్లే ప్రేమ్ చనిపోయాడని అతడి తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pahalgam Terrorist Attack: ఉగ్రదాడికి బిగ్‌బాస్ కంటెస్టెంట్లే ప్రధాన కారణం.. అన్వేష్ సంచలన వీడియో!

పహల్గాంలో ఉగ్రాదాడి ఘటనపై అన్వేష్ స్పందించాడు. ఈ దాడికి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ మెహబూబ్, సోహెల్, ఇమ్రాన్ ప్రధాన కారణమన్నాడు. వీరు ఉగ్రవాదుల నుంచి డబ్బులు తీసుకుని బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్లనే ఇలా జరిగిందని సంచలన ఆరోపణలు చేశాడు.

New Update
anvesh sensational comments on bigg boss contestants

anvesh sensational comments on bigg boss contestants

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రదాడి అల్లకల్లోలం సృష్టించిన విషయం తెలిసిందే. బైరసన్ వ్యాలీలో టూరిస్టులపై టెర్రరిస్టులు కాల్పులు జరిపి 28 మందిని హతమార్చారు. దేశ వ్యాప్తంగా ఇప్పుడిదే హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో ప్రముఖ యూట్యూబర్ అన్వేష్ సంచలన వీడియో రిలీజ్ చేశాడు. తన సోషల్ మీడియా అకౌంట్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఉగ్రదాడికి ముఖ్య కారణం వీరేనంటూ ముగ్గురు ఫొటోలను షేర్ చేశాడు. అందులో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ మెహబూబ్, సోహెల్, పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ ఉన్నారు.  

ఉగ్రదాడికి వీరే కారణం

అనంతరం ఆ వీడియోలో అన్వేష్ సంచలన విషయాలు పంచుకున్నాడు. ముందుగా మెహబూబ్ గురించి చెప్పాడు. ‘‘మెహబూబ్‌ తిండికి తికానా లేని మటన్ కొట్టు మస్తాన్ రావు కొడుకు. అలాంటిది.. రూ.2 కోట్లు ఖర్చు పెట్టి ‘నువ్వే కావాలి’ అనే వీడియో తీశాడు. అది కూడా అమెరికా, ఆస్ట్రేలియా, యూరప్, మెక్సికో.. 4 దేశాలు తిరిగా ఆ వీడియో తీశాడు. ఒక్క యూట్యూబ్ వీడియో కోసం రూ.2 కోట్లు ఖర్చుపెట్టాడు. ఆ వీడియో కోసం ఖర్చు పెట్టిన డబ్బులు అన్నీ ఉగ్రవాద సంస్థలు ఇచ్చినవే. 

అలాగే సోహెల్‌కు నాలుగు రెస్టారెంట్లు.. ఒక సినిమా.. ఇలా మరెన్నో ఉన్నాయి. ఈ డబ్బులన్నీ కూడా ఉగ్రవాద సంస్థలు ఇచ్చినవే. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల వీరికి ఆ డబ్బులు వచ్చాయి. ఇంకా పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ కూడా ఉన్నాడు. ఇతడు.. దుబాయ్‌లోని హోటళ్లు, దుబాయ్‌లో షాపులు, శ్రీశైలంలో కాటేజీలు, ఇండియాలో ఖరీదైన రెస్టారెంట్లు, లగ్జరీ కార్లు.. ఇలా లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ డబ్బులన్నీ ఉగ్రవాద సంస్థలు ఇచ్చాయి.

అయితే వాళ్లెందుకు ఇచ్చారంటే.. ఉగ్రవాదులు వీళ్లతో కాంటాక్ట్ అయ్యి.. తమ యాప్‌లను ప్రమోట్ చేయాలంటూ వీరికి డబ్బులు ఇస్తారు. దాని కోసం వీరు తలో రూ.10 నుంచి 20 లక్షలు తీసుకుంటారు. ఆ యాప్ ఏంటి..? అది ఎవరు క్రియేట్ చేశారు..? అది ఎక్కడ నుంచి వచ్చింది? అనేది అస్సలు పట్టించుకోరు. ఆ యాప్‌లు వాడి చనిపోయినవారెందరో ఉన్నారు. కానీ వీళ్లు మాత్రం విదేశీ ట్రిప్పులు వేస్తూ ఎంజాయ్ చేశారు. ఉగ్రవాదులు ఇచ్చిన డబ్బులు తీసుకుని బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్లనే ఇప్పుడు ఉగ్రదాడి జరిగింది. ఈ దాడికి ఈ ముగ్గురే కారణం’’ అంటూ సంచలన ఆరోపణలు చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

naa anveshana | Pahalgam attack | latest-telugu-news | telugu-news

Advertisment
Advertisment
Advertisment