/rtv/media/media_files/2025/04/13/woLGxkvwOXrDnyJfRe4w.jpg)
anna lezhneva
Tirupati Venkateswara Swamy Temple : శ్రీవారి దర్శనార్థం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నలేజినోవా తిరుమలకు చేరుకున్నారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గం గుండా తిరుమలకు చేరుకోగా తిరుమలలోని గాయత్రి అతిథి గృహంలో బస చేశారు. గాయత్రి అతిథి గృహం వద్దకు చేసుకున్న అన్నలేజినోవాకు టీటీడీ అధికారులు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. గాయత్రి సదనంలో టీటీడీ ఉద్యోగుల సమక్షంలో డిక్లరేషన్ పత్రాలపై సంతకం చేశారు. అనంతరం క్షేత్ర సంప్రదాయం నియమాలను పాటించారు. ముందుగా ఆలయ మాడ వీధుల్లోకి చేరుకుని శ్రీ భూ వరహా స్వామి ఆలయంకు చేరుకున్నారు. అనంతరం శ్రీ భూ వరహా స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శన అనంతరం ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
Also read: మావోయిస్టులతో చర్చలు..మోడీ, అమిత్ షాకు పీస్ డైలాగ్ కమిటీ కీలక లేఖ
భూ వరహా స్వామి దర్శనం అనంతరం కళ్యాణకట్టకు చేరుకున్నారు. కల్యాణకట్టలో స్వామి వారికి మొక్కుల చెల్లించుకున్నారు. ఆ దేవదేవుడికి తలనీలాలు సమర్పించారు. అటు ఆతరువాత నేరుగా శ్రీ గాయత్రి నిలయం కు చేరుకున్నారు. రాత్రి అక్కడే బస చేసి రేపు వేకువజామున ఉదయం శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొననున్నారు. పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ గత గత వారం సింగపూర్ లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నాడు. ఈ ప్రమాదంలో చేతులు, కాళ్ళకు గాయాలయ్యాయి. అదే విధంగా ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లిపోవడంతో ఇబ్బందులకు లోనయ్యాడు. మార్క్ శంకర్ ను ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు.
Also Read: హెచ్ 1బీ వీసా, గ్రీన్ కార్డ్..నిత్యం ఉంచుకోవాల్సిందే..వలసదారులకు స్ట్రిక్ట్ రూల్స్
మార్క్ శంకర్ కు వారం రోజులు సింగపూర్ లో ప్రత్యేక వైద్య సేవలు అందించారు. ఘటన నుంచి పూర్తిగా కోలుకున్నాడు మార్క్ శంకర్. దీంతో బాబు క్షేమం కోసం శ్రీవారికి ఆపద మొక్కులు మొక్కుకున్నారు అన్నలేజినోవా. ఆపద నుంచి శ్రీవారు మార్క్ శంకర్ ను కాపాడటంతో నేడు తిరుమలకు వచ్చి మొక్కులు సమర్పించుకొనడానికి తిరుమలకు వచ్చారు అన్నలేజినోవా. సింగపూర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో తమ కుమారుడు మార్క్ శంకర్ సురక్షితంగా బయటపడటంతో స్వామి వారికి దర్శించుకొని మొక్కులు చెల్లించుకోనున్నారు.
Sharmila fires on YCP : ప్రజలు చెప్పుతో కొట్టినా పద్ధతి మారలేదు.. వైసీపీపై షర్మిల సంచలన వ్యాఖ్యలు!
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌షర్మిల మరోసారి వైసీపీపై ఫైర్ అయ్యారు. ప్రజలు చెప్పుతో కొట్టినట్లు తీర్పు ఇచ్చినా ఇంకా బుద్ది మారలేదంటూ గాటు వ్యాఖ్యలు చేశారు. వైసీపీకి ఆ పార్టీని మోసే సంస్థలకు ఇంకా పచ్చకామెర్ల రోగం తగ్గినట్లు లేదన్నారు.
YS Sharmila fire on ycp
Sharmila fires on YCP : ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి వైసీపీపై ఫైర్ అయ్యారు. ప్రజలు చెప్పుతో కొట్టినట్లు తీర్పు ఇచ్చినా ఇంకా బుద్ది మారలేదంటూ గాటు వ్యాఖ్యలు చేశారు. వైసీపీకి ఆ పార్టీని మోసే సంస్థలకు ఇంకా పచ్చ కామెర్ల రోగం తగ్గినట్లు లేదు. కళ్ళకు కమ్మిన పసుపు బైర్లు తొలగినట్లు లేదు. ఇప్పటికీ అద్దంలో మొహం చూసుకున్నా చంద్రబాబు కనిపించడం చాలా బాధాకరం అంటూ షర్మిల ఎద్దేవా చేశారు.ఏది చేసినా అర్థం, పరమార్థం టీడీపీ అనడం వారి వెర్రితనానికి నిదర్శనం. స్వయంశక్తితో ఎదుగుతుంటే, రాష్ట్రంలో కాంగ్రెస్ పుంజుకుంటుంటే, ప్రత్యామ్నాయ పార్టీగా ప్రజల్లో ముద్ర వేసుకుంటుంటే, చూసి ఓర్వలేక, అసత్యపు ఆరోపణలతో నిందలు వేయడం మీ చేతకానితనానికి నిదర్శనం అంటూ మండి పడ్డారు. మిమ్మల్ని 11 సీట్లకే పరిమితం చేసి ప్రజలు చెప్పుతో కొట్టినట్లు తీర్పునిచ్చినా.. మీ నీచపు చేష్టలు మారలేదు. అసత్యాలు వల్లె వేయడం మానుకోలేదు అంటూ ఆరోపించారు. నిజాలు జీర్ణించుకోలేని మీరు..ఇక ఈ జన్మకు మారరు అని రాష్ట్ర ప్రజలకు మరోసారి అర్థం అయ్యిందంటూ చివాట్లు పెట్టారు.
ఇది కూడా చదవండి: Raghunandan: మీనాక్షి నటరాజన్, రేవంత్ కు మధ్య వార్.. ఎంపీ రఘునందన్ సంచలన ఇంటర్వ్యూ!
ఇంతకాలం ఎవరి సేవలో ఎవరు తరించారో అందరికీ తెలుసు. ఎవరికి ఎవరు దత్తపుత్రుడుగా ఉన్నారో తెలుసని షర్మిల గాటుగానే స్పందిచారు. తండ్రి ఆశయాలకు తూట్లు పొడిచి, రాష్ట్ర ప్రయోజనాలను మోడీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టి.. స్వలాభమే పరమావధిగా రాష్ట్రాన్ని దోచుకుతిన్నారని షర్మిల ఆరోపించారు. ప్యాలెస్ లు కట్టుకున్నారు. సొంత ఖజానాలు నింపుకున్నారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ అని తెచ్చి ప్రజల ఆస్తులు కాజేయాలని చూశారని ఆరోపించారు. రిషికొండను కబ్జా చేయాలని చూశారు. మొత్తంగా మోడీ దోస్తులకు రాష్ట్రాన్ని దోచి పెట్టారన్నారు. కులమతాల మధ్య చిచ్చు పెట్టే ప్రతి అంశంలో మోడీకి మద్దతుగా నిలిచి 5 ఏళ్ల పాటు మోదా సేవలో తరించినట్లు ప్రజలకు సర్వం బోధపడిందని తేల్చి చెప్పారు.
ఇది కూడా చదవండి: ఎమ్మెల్సీగా అద్దంకి ప్రమాణ స్వీకారం.. ఆత్మీయంగా అలింగనం చేసుకున్న కోమటిరెడ్డి.. ఫొటోలు వైరల్
ఎవరో ఒకరి సేవలో తరించాల్సిన ఖర్మ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ వైఎస్ షర్మిలా రెడ్డికి పట్టలేదంటూ చెప్పుకొచ్చారు. పులి బిడ్డ పులిబిడ్డే. ఈ రాష్ట్రంలో BJP అంటే బాబు, జగన్, పవన్.. అన్ని పార్టీలు బీజేపీకి గులాంగిరి చేసేవే.. ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రతిపక్షంగా ఒంటరి పోరాటం చేస్తుందని తేల్చి చెప్పారు. ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే అసెంబ్లీకి పోవడానికి మీకు దమ్ములేకుంటే.. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యాలను బయట ఉండి ఎత్తిచూపుతూ.. ప్రజా సమస్యల మీద గొంతెత్తి పోరాడుతున్నది ఈ రాష్ట్రంలో ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమేనన్నారు. వక్ఫ్ బిల్లుకి మద్దతు పలికి ముస్లింలకు ఇఫ్తార్ విందులో బాబు విషం పెట్టారని చేసిన మా ఆరోపణలు వినపడకపోవడం మీరు చెవిటోళ్లు అనడానికి... పోలవరం ప్రాజెక్ట్ విషయంలో మా ఆవేదన కనపడకపోవడం మీరు గుడ్డోళ్ళు అనడానికి నిదర్శనమంటూ ఏద్దేవా చేశారు. మీకు ప్రజల శ్రేయస్సే ముఖ్యం అనుకుంటే అసెంబ్లీకి వెళ్ళి పోలవరం మీద ఎందుకు ప్రశ్నించలేదు ? అసెంబ్లీ వేదికగా సూపర్ సిక్స్ మోసాలను ఎందుకు ఎండగట్టలేదు ? మీ నీచపు కుయుక్తులతో, పాపపు సొమ్మును ఎరగా చూపి కాంగ్రెస్ పార్టీని ఖాళీ చేయాలనే కుట్ర తప్పా ప్రజా సమస్యలపై మీకు ఏమాత్రం శ్రద్ధ లేదు. కాంగ్రెస్ ఎదగడం చూసి మీరు భయపడుతున్నారు అనేది పచ్చి నిజం అంటూ షర్మిల ఆరోపించారు.
ఇది కూడా చదవండి: Dia Mirza: HCU వివాదంపై రేవంత్ రెడ్డికి హీరోయిన్ కౌంటర్! అవి AI కాదు రియల్
Tirupati Venkateswara Swamy Temple : శ్రీవారికి తలనీలాలు సమర్పించిన పవన్ భార్య
శ్రీవారి దర్శనార్థం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నలేజినోవా తిరుమలకు చేరుకున్నారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
AB Venkateswara Rao : జగన్ అంటే హత్యలు, అవినీతి, అరాచకం...మాజీ ఇంటిలిజెంట్ చీఫ్ సంచలన వ్యాఖ్యలు
గడచిన ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి చేసిన విధ్వంసాన్ని కల్లారా చూసామని, ఆ విధ్వంసం నుంచి కోలు కోవడానికి చాలా కష్టపడాలి. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
Cricket Betting : క్రికెట్ బెట్టింగ్ భూతానికి మరో విద్యార్థి బలి
బెట్టింగ్ విషయంలో ప్రభుత్వం ఎన్ని రకాల కఠిన నిర్ణయాలు తీసుకుంటున్న యువతలో ఎలాంటి మార్పు రావడం లేదు. Short News | Pages | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
Ap Crime: ఓరి పాపిస్టోడా.. రూ.5 కోసం ముసలవ్వను కొట్టి కొట్టి చంపేశావ్ కదరా!
అన్నమయ్య జిల్లాలో శనివారం దారుణం జరిగింది. రూ.5 కోసం జరిగిన వివాదం వృద్ధురాలిని బలిగొంది. క్రైం | Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ తిరుపతి
IAS transfers : ఏపీలో ఐఏఎస్ ల బదిలీలు...సిసోడియా ఔటు- ముత్యాల రాజుకు చోటు..!!
ఏపీలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పలు హోదాల్లో ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
AP: బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు.. 6గురి దుర్మరణం.. కన్నీరు పెట్టించే వీడియోలు..!
అనకాపల్లిలో దారుణం జరిగింది. కైలాసపట్నంలోని బాణాసంచా కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. క్రైం | Short News | Latest News In Telugu | వైరల్ | వైజాగ్ | ఆంధ్రప్రదేశ్
DC VS MI: ఢిల్లీకి బ్రేక్ పడింది..ఉత్కంఠ మ్యాచ్ లో గెలిచిన ముంబయ్
DRDO: భారత అమ్ములపోదిలో మరో అస్త్రం..లేజర్ వెపన్
Tirupati Venkateswara Swamy Temple : శ్రీవారికి తలనీలాలు సమర్పించిన పవన్ భార్య
DC vs MI: ఢిల్లీ క్యాపిటల్స్ ముందు భారీ లక్ష్యం.. మంబయి స్కోర్ ఎంతంటే ?
AB Venkateswara Rao : జగన్ అంటే హత్యలు, అవినీతి, అరాచకం...మాజీ ఇంటిలిజెంట్ చీఫ్ సంచలన వ్యాఖ్యలు