BIG BREAKING : తెలంగాణ ఎన్నికల్లో  పోటీపై పవన్ కల్యాణ్ యూటర్న్!

తెలంగాణ రాజకీయాల్లో పోటీపై ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ 24 గంటల్లోనే తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. నిన్న హైదరాబాద్‌లో మాట్లాడిన పవన్.. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించి పొలిటికల్ హీట్ పెంచారు.

New Update
pawankalyan

తెలంగాణ రాజకీయాల్లో పోటీపై ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ 24 గంటల్లోనే తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. నిన్న హైదరాబాద్‌లో మాట్లాడిన పవన్.. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించి పొలిటికల్ హీట్ పెంచారు. అయితే, ఈరోజు మంగళగిరి పార్టీ ఆఫీసులో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో మాత్రం తెలంగాణలో పోటీపై తమకు ఎలాంటి ముందస్తు ప్రణాళికలు లేవని స్పష్టం చేశారు.  

నేను ఎప్పుడూ తెలంగాణ ప్రజలను ఉద్దేశించి చెడుగా మాట్లాడలేదు. తెలంగాణ ముమ్మాటికీ ఆ ప్రాంత భూమిపుత్రులదే. ఏపీ నుంచి ఎవరూ వెళ్లి అక్కడ పోటీ చేయడం లేదు. జనసేనలో ఉన్న తెలంగాణ ప్రాంత భూమిపుత్రులే అక్కడ పోటీ చేస్తామంటున్నారు. మా తెలంగాణ నేతలు గట్టిగా పోరుపెడితేనే నేను అక్కడికి వెళ్లాను అని పవన్ వివరించారు.

రాష్ట్ర విభజన జరిగి 12 ఏళ్లు దాటిపోయింది. అయినా సరే ఇప్పటికీ కొందరిలో అంత ద్వేషం ఉంటుందని నేను అస్సలు ఊహించలేదు. ప్రాంతీయవాదం వేరు.. ప్రత్యేక రాష్ట్రం కోరుకోవడం వేరు. కానీ ఇలా మనుషులను విభజించుకుంటూ వెళ్తే చివరికి ఎక్కడికి వెళ్తాం? భూమికి మాత్రమే సరిహద్దులు ఉంటాయి.. మనసుకు ఉండవు అంటూ పవన్ ఎమోషనల్ అయ్యారు.

2014 నుంచి 2024 వరకు.. ఈ పదేళ్ల కాలంలో ఎంతమంది తెలంగాణకు చెందిన కాంట్రాక్టర్లు ఆంధ్రప్రదేశ్‌కు వచ్చి వ్యాపారాలు, పనులు చేసుకోలేదు? అని పవన్ ప్రశ్నించారు. "మహారాష్ట్ర, తమిళనాడు వంటి రాష్ట్రాలకు వెళ్తే ఎక్కడా లేని ఇబ్బందులు ఇక్కడే ఎందుకు వస్తున్నాయి? దేశంలో ఎక్కడైనా బతకడం మన హక్కు. దాన్ని కాలరాసే హక్కు ఎవరికీ లేదు. గతంలో కశ్మీరీ పండిట్లను వారి ప్రాంతం నుంచి వెళ్లగొడితే ఏమైందో అందరికీ తెలుసు అని గుర్తుచేశారు.

ఒకప్పుడు ఏపీలో బలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పూర్తిగా శూన్యమైపోయిందని పవన్ అన్నారు. గతంలో కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి వైసీపీలో చేరిన నేతలే ఇందిరాగాంధీ విగ్రహాన్ని కూల్చేశారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. 

తెలంగాణకు నేను వెళ్లకూడదా?

ఈ వివాదం వెనుక కాంగ్రెస్ తీరును పవన్ తప్పుబట్టారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు కేరళలోని వయనాడ్ వెళ్లి పోటీ చేయొచ్చు. కానీ, నా ఇల్లు ఉన్న తెలంగాణకు నేను వెళ్లకూడదా? అయితే, ఈ వివాదం అంతా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి తెలిసి జరిగిందని మాత్రం నేను అనుకోవడం లేదు అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనకు సోదరుడి లాంటివారని పవన్ కల్యాణ్ ఈ సందర్భంగా మరోసారి స్పష్టం చేశారు.

Advertisment
తాజా కథనాలు