/rtv/media/media_files/2025/03/31/1Hvei5yjd7eOwuHZo1uY.jpg)
పాస్టర్ ప్రవీణ్ ది ముమ్మాటికీ హత్యే అని మాజీ ఎంపీ హర్షకుమార్ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. ఈ హత్య వెనుకాల ప్రభుత్వమే ఉందా? అన్న అనుమానం వ్యక్తం చేశారు. పోలీస్ డిపార్ట్మెంట్ ఈ హత్యపై ఎందుకు హైరానా పడుతోందని ప్రశ్నించారు. ప్రవీణ్ ది యాక్సిడెంట్ గా చూపేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. సీసీ ఫుటేజీ 11.42 గంటల వరకు చూపెడుతున్నారని.. దాని తర్వాత ఫుటేజీ ఏమైందని ప్రశ్నించారు.
ఆ బండిపై ఉన్నది ప్రవీణే కాదు..
ఆ బండి మీద ఉన్నది ప్రవీణ్ కాదన్నారు హర్ష కుమార్. కావాలంటే తాను కూడా అదే స్పీడ్ లో బుల్లెట్ మీద హెల్మెట్ పెట్టుకొని అలాగే వెళ్లి అక్కడే పడతానని సవాల్ విసిరారు. చచ్చిపోతానో లేదో చూద్దామమన్నారు. ఇది ప్రెస్ ఎదురుగానే చేస్తానన్నారు. తన ఛాలెంజ్ ను పోలీస్ డిపార్ట్మెంట్ స్వీకరిస్తే చాలా సంతోషమన్నారు. ఎందుకంటే అక్కడ ఆ ప్లేస్ లో ఎవరు పడినా చావరన్నారు.
(telugu-news | latest-telugu-news | telugu breaking news | Pastor Praveen Death Mistery)