అదుపు తప్పిన కారు.. అందులో ఏముందో చూసి షాకైన పోలీసులు!

అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం చింతలవీధి వద్ద శుక్రవారం భారీఎత్తున గంజాయి పట్టుబడింది. ఓ కారు 583 కేజీల గంజాయితో అదుపుతప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ రూ.27 లక్షల వరకు ఉంటుందని తెలిపారు.

New Update
ganja seized

కారులో స్పీడ్‌గా వెళ్తున్నారు. సడెన్‌గా ఆ కారు  అదుపుతప్పి రోడ్డు పక్కకు దిగబడిపోయింది. అందులో ఉన్నవారు వెంటనే కిందికి దిగి కారును బయటకు తీసే ప్రయత్నం చేశారు. కానీ రాలేదు. దీంతో వారు అక్కడ నుంచి పరారయ్యారు.

కారులో భారీగా..

అదేంటి రోడ్డు పక్కకు దిగబడిపోయిన కారు రాకపోతే.. స్థానికంగా ఉండే వారిని పిలిచి సహాయం అడగొచ్చు కదా?.. పారిపోవడం ఎందుకు? అనే ప్రశ్న మీలో రావచ్చు. అయితే వారు పారిపోవడానికి ఓ కారణం ఉంది. అదేంటో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం.

ఇది కూడా చదవండి: ప్రపంచ ఆకలి సూచీలో భారత్ స్థానం ఎంతంటే?

అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం చింతలవీధి నుండి పెదబాయలు వైపు ఆ కారు స్పీడ్‌గా వెళుతుంది. ఈ క్రమంలో ఆ కారు అదుపుతప్పి చింతలవీధి గ్రామంలోని రోడ్డు పక్కన ఒక రేకుల ఇంట్లోకి దూసుకెళ్లి గుంతలో దిగబడింది. దీంతో అందులో ఉన్నవారు ఎంత ప్రయత్నించినా బయటకు తీయలేకపోయారు. 

ఇది కూడా చదవండి: రాజకుటుంబ వారసుడిగా టీమిండియా మాజీ క్రికెటర్‌!

దీంతో వారు అక్కడ నుంచి పరారయ్యారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆపై కారులో పరిశీలించగా.. అందులో పెద్ద మొత్తంలో గంజాయి ఉన్నట్లు గుర్తించారు. దాన్ని బయటకు తీసి బరువు చూడగా.. దాదాపు 538 కేజీల గంజాయి రవాణా చేస్తున్నట్లు సీఐ దీనబంధు పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: వలసదారులకు మరణశిక్ష.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!

ఆపై కారుతో పాటు గంజాయిని పాడేరు పోలీస్ స్టేషన్‌కు తరిలించినట్లు తెలిపారు. అయితే పట్టుబడిన ఆ గంజాయి విలువ సుమారు రూ.27 లక్షల వరకు ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు. కారులో వచ్చిన వ్యక్తుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Inter Supplementary Exams : ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్.. ఫీజు చెల్లింపునకు తుది గడువు ఇదే

ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్‌ ఫలితాలను మంత్రి నారా లోకేష్‌ విడుదల చేశారు. ఇంటర్ ఫస్ట్, సెకండియర్ ఫలితాలను ఒకేసారి రిలీజ్ చేశారు. ఈ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలు రాయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఇంటర్ బోర్డు అధికారులు ముఖ్య ప్రకటన చేశారు.  

New Update
Inter Supplementary Exams

Inter Supplementary Exams

Inter Supplementary Exams:  ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్‌ ఫలితాలను మంత్రి నారా లోకేష్‌ విడుదల చేశారు. ఇంటర్ ఫస్ట్, సెకండియర్ ఫలితాలను ఒకేసారి రిలీజ్ చేశారు. కాగా ఇంటర్‌ ఫలితాల్లో గణనీయమైన ఉత్తీర్ణత సాధించింది. గతం కంటే అత్యధిక శాతం ఉత్తీర్ణత నమోదు అయినట్లు ఆధికారులు వెల్లడించారు. ఇదిలా ఉండగా.. ఇంటర్‌ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం ఇంటర్మీడియట్‌ బోర్డు కీలక ప్రకటన చేసింది. ఈ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలు రాయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలపై ఇంటర్ బోర్డు అధికారులు ముఖ్య ప్రకటన చేశారు.  


 Also Read :  తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్.. కీలక నేత రాజీనామా!
 
మే 12 నుంచి ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. మే 12 నుంచి 20 వరకు పరీక్షలు జరుగుతాయని ఇంటర్మీడియెట్ బోర్డు అధికారులు తెలిపారు. కాగా ఫేయిలై విద్యార్థులు సబ్జెక్టులను బట్టి  ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఫెయిల్ అయిన విద్యార్థులు ఏప్రిల్ 15 వరకు సప్లెమెంటరీ పరీక్షల కోసం ఫీజు చెల్లించాల్సిందిగా బోర్డు తెలిపింది. ఏప్రిల్ 22 వరకు చివరి తేదీగా ప్రకటించింది. అలాగే సప్లిమెంటరీ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు జరుగనున్నాయి.  

Also Read: కొరియోగ్రాఫర్ శ్రష్ఠి వర్మ బ్రాండ్ న్యూ కార్ అదుర్స్..!


ఈరోజు (శనివారం) ఉదయం సోషల్ మీడియా ఎక్స్‌ వేదికగా మంత్రి నారా లోకేష్  ఏపీ ఇంటర్ ఫలితాలను విడుదల చేశారు. ఈసారి అత్యధికంగా పాస్‌ పర్సంటేజ్ నమోదు అవడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో 70 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా.. రెండో సంవత్సరంలో 83 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత పొందారు. ప్రతీఏడు లాగే ఈ ఏడాది కూడా ఇంటర్ ఫలితాల్లో బాలికదే పై చేయిగా నిలిచింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో బాలికలు 71 శాతం ఉత్తీర్ణత సాధించగా.. బాలురు 64 శాతం ఉత్తీర్ణత పొందారు. అలాగే ఇంటర్ సెకండ్ ఇయర్‌లో 81 శాతంతో బాలికలు ఉత్తీర్ణత పొందగా.. బాలురు 75 శాతం ఉత్తీర్ణత సాధించారు.

Chiranjeevi: డ్యాన్స్ చేస్తూ కళ్ళు తిరిగి పడిపోయిన చిరంజీవి..!

Also Read :  అనుకున్నదే అయింది.. అఘోరీకి వర్షిణీకి పెళ్లైంది - వీడియో

Advertisment
Advertisment
Advertisment