Nagababu: ‘కోవా బన్‌’ వలీకి అండగా నాగబాబు..అదే దారిలో లోకేష్‌

కుటుంబాన్ని పోషించుకునేందుకు కోవాబన్‌ విక్రయిస్తూ పొట్టపోసుకుంటున్న కర్నూలుకు చెందిన వలీ అనే సాధారణ పౌరుడు మేడారం జాతరలో కొంతమంది వల్ల ఇబ్బంది పడిన విషయం తెలిసిందే. కాగా ఆయనకు జనసేన ఎమ్మెల్సీ, సటుడు నాగబాబు అండగా నిలిచారు.

New Update
FotoJet (15)

Nagababu supports ‘Kova Ban’ Vali.

Nagababu: కుటుంబాన్ని పోషించుకునేందుకు కోవాబన్‌ విక్రయిస్తూ పొట్టపోసుకుంటున్న కర్నూలుకు చెందిన వలీ అనే సాధారణ పౌరుడు మేడారం జాతరలో కొంతమంది యూట్యూబర్ల మూలంగా ఇబ్బంది పడిన విషయం తెలిసిందే. విషయం తెలిసిన వెంటనే ప్రాంతాలకు అతీతంగా ఆయనకు సంఘీభావం వెల్లువెత్తింది. పలువురు రాజకీయ నాయకులతో పాటు కవులు, కళాకారులు, జర్నలిస్టులు, పలు రంగాల వారు ఆయనకు మద్దతుగా నిలిచారు. తాజాగా జనసేన పార్టీ ఎమ్మెల్సీ, నటుడు నాగబాబు కూడా ఈ విషయమై స్పందించారు. కుటుంబాన్ని పోషించుకునేందుకు కోవా బన్‌ అమ్ముకుంటున్న సాధారణ పౌరుడు వలీని కొంతమంది పనిగట్టుకొని భయభ్రాంతులకు గురిచేయడం సరికాదన్నారు.

కొంతమంది చేసిన  అత్యుత్సాహం వల్ల ఇవాళ వారి కుటుంబం పస్తులుండాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. చిరు వ్యాపారులు మన దేశంలో కోట్ల మంది ఉన్నారని, చేతనైతే వాళ్లకు చేయూతనివ్వాలి తప్ప.. ఆరోపణలతో కడుపు కొట్టడం సరికాదని హితవు పలికారు. న్యాయబద్ధంగా, నాణ్యమైన చిరుతిండి పదార్థాలు విక్రయించే చిరు వ్యాపారులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు.

చిరు వ్యాపారులతో పాటు ఎవరైన విక్రయించే ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించేందుకు ఫుడ్‌ సేఫ్టీ అథారిటీలు ఉన్నాయని, ఏదైనా అనుమానం ఉంటే సంబంధిత అధికారులను సంప్రదించాలే తప్ప.. ఓ నిరుపేదను అవమానించడం మంచి పద్ధతి కాదని నాగబాబు అన్నారు. ప్రస్తుతం ఆ కుటుంబం వ్యాపారం చేసుకునేందుకు భయపడుతోందని ఆయన ఆవేదన చెందారు, ఈ నేపథ్యంలో వారిలో ధైర్యాన్ని నింపేందుకు వలీని పిలిపించి మాట్లాడినట్లు  నాగబాబు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. వలీతో ఉన్న పోటోను విడుదల చేశారు. కాగా ఇటీవల మేడారం జాతరలో కర్నూలుకు చెందిన వలీ..  రూ.10కే కోవాబన్ను విక్రయిస్తుండగా.. కొందరు వ్యక్తులు అత్యుత్సాహంతో అతడిని ఇబ్బంది పెట్టిన సంగతి తెలిసిందే.  

వలీని త్వరలో కలుస్తా: మంత్రి లోకేశ్‌

ఇదిలా ఉండగా ఆయనకు అన్ని వర్గాల వారు అండగా నిలుస్తున్నారు. తాజాగా ఏపీ మంత్రి నారా లోకేశ్‌ కూడా స్పందించారు. కర్నూలుకు చెందిన వలీ అనే చిరు వ్యాపారిని త్వరలో కలుస్తానని తెలిపారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్‌’లో ఓ పోస్ట్‌ చేశారు. ‘‘వలీ చేసిన కోవా బన్‌ రుచి చూసేందుకు ఆసక్తితో ఉన్నా. ఆయనపై కొందరు ఆరోపణలు చేయడం కలచివేసింది. ఐక్యతను దెబ్బతీసే ఇలాంటి ప్రవర్తనకు సమాజంలో స్థానం లేదు. వలీకి అండగా ఉంటాం.’’ అని లోకేశ్‌ తన ఎక్స్‌ లో పేర్కొన్నారు.

Advertisment
తాజా కథనాలు