/rtv/media/media_files/2025/03/05/x6uaj5Z92QPuVopAf9Wy.jpg)
Nagababu Janasena MLC Candidate
తెలంగాణలో జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నిర్వహించ తలపెట్టిన సభ తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి సంధ్య కన్వెన్షన్‌లో తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ పేరుతో భారీ సమావేశాన్ని నిర్వహించేందుకు జనసేన శ్రేణులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి. అయితే, ఊహించని మలుపుగా ఈ సభకు కాంగ్రెస్ ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. భద్రతా కారణాలను అడ్డుపెట్టుకుని సైబరాబాద్ పోలీసులు ఈ సభకు అనుమతి నిరాకరించడం ఇప్పుడు రెండు రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్‌గా మారింది.
ఇటీవల కాలంలో ప్రముఖ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్, పవన్ కల్యాణ్ మధ్య నడిచిన పొలిటికల్ వార్ కారణంగా తెలంగాణలో కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ వివాదంలో ప్రొఫెసర్ నాగేశ్వర్‌పై ఏపీలో కేసులు నమోదు కావడం, దానికి తోడు ఏపీకి చెందిన కొందరు లీడర్ల కామెంట్స్ తెలంగాణ ప్రజల సెంటిమెంట్‌ను దెబ్బతీసేలా ఉన్నాయని పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటికే పవన్ కల్యాణ్ సభను అడ్డుకుంటామంటూ పలువురు తెలంగాణ వాదులు వార్నింగ్స్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందన్న కారణంతో సైబరాబాద్ పోలీసులు ఈ సభకు పర్మిషన్ ఇవ్వలేమని తేల్చి చెప్పారు.
నాగబాబు సంచలన వ్యాఖ్యలు
జనసేన సభ రద్దు కావడం, పవన్‌పై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తుండటంతో జనసేన జనరల్ సెక్రటరీ, ఎమ్మెల్ కొణిదెల నాగబాబు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్‌ను అడ్డుకునే శక్తి ఎవరికీ లేదని ఆయన తేల్చి చెప్పారు. అధికారులు, ప్రతిపక్షాలు కలిసి పవన్ కల్యాణ్‌ను ఎంత అణిచివేయాలని చూసినా.. ప్రతిసారీ ఆయన మహా విజయాన్ని సాధిస్తూనే ఉంటారు. అదృష్టం అనేది అందరినీ వరించదు. నిరంతరం శ్రమించి, అపజయాల ఎదుట ధైర్యంగా లేచి నిలబడాలి. అలాంటి అసాధారణమైన విజయమే ఒక చరిత్ర అవుతుంది. పవన్ కల్యాణ్ సరిగ్గా అలాంటి చరిత్రనే సృష్టిస్తారు. సినిమా స్టైల్లో చెప్పాలంటే.. ఆయన రావడం కొంచెం లేట్ అవ్వొచ్చు, కానీ రావడం మాత్రం పక్కా! త్వరలోనే తెలంగాణ గడ్డపై భారీ సభ పెట్టి తీరుతాం అని నాగాబాబు కామెంట్స్ చేశారు, పవన్‌పై బురదజల్లుతున్న విమర్శకులకు, అధికారులకు, నాయకులకు త్వరలోనే గట్టిగా బదులిస్తామని, అప్పుడు అందరూ సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుందని నాగబాబు హెచ్చరించారు. నాగాబాబు చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
మరోవైపు ప్రభుత్వం, పోలీసులు కలిసి సభకు అనుమతి నిరాకరించడంపై జనసేన నాయకులు తీవ్రంగా మండిపడుతున్నారు. సభకు పర్మిషన్ ఇవ్వకపోతే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. జనసేన నేత సాగర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ ఎవడబ్బా సొత్తు కాదు.. పవన్ కల్యాణ్ సభను అడ్డుకోవాలని చూస్తే నష్టపోయేది వాళ్లే అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Follow Us