ఏపీకి హెవీ రెయిన్ అలర్ట్.. మంత్రి నిమ్మల కీలక ప్రకటన! రానున్న నాలుగురోజులు పాటు ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయనే నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అలెర్ట్ అయ్యింది. భారీ వర్షాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండేలా సీఎం చంద్రబాబు ఆదేశించారని మంత్రి తుమ్మల తెలిపారు. By B Aravind 14 Oct 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి అల్పపీడనం ప్రభావం వల్ల ఆంధ్రప్రదేశ్‌లో రానున్న నాలుగురోజులు పాటు పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వం అలెర్ట్ అయ్యింది. ఇటీవల ఏపీలో భారీ వర్షాల వల్ల విజయవాడ, గుంటూరు తదితర ప్రాంతాల్లో వరదలు పోటెత్తిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం ముందుస్తు చర్యలకు సిద్ధమయ్యింది. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు కీలక వ్యాఖ్యాలు చేశారు. '' భారీ వర్షాల వల్ల ఇబ్బందులు రాకుండా ఉండేలా చూడాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ప్రాజెక్టుల్లో ఇన్‌ఫ్లోస్ మీద ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నాం. సోమశిల రిజర్వాయరుకు గతంలో రానన్ని ఇన్‌ఫ్లోస్ వస్తున్నాయి. Also Read: ఆ విభాగాల్లో పెట్టుబడులు పెట్టండి.. ఫాక్స్‌కన్ కంపెనీలో సీఎం రేవంత్ సిద్ధంగా ఉన్నాం ముందుగానే చెరువులు, వాగులు, రిజర్వాయర్లు గండ్లు పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం.ఈ మధ్యకాలంలో ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తున్నాయి. ఇవి వచ్చినా ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ప్రకాశం, చిత్తూరు, అనంతపురం, సత్యసాయి, కర్నూలు, కడప వంటి జిల్లాల్లో వాగుల్లో ఇన్‌ఫ్లోస్‌ను పరిశీలిస్తున్నాం. వాగుల క్యాచ్మెంట్ ఏరియాలో ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నాం. వచ్చే 24 గంటల్లో భారీ వర్షాలు ఉంటాయని అంచనా. ఆర్టీజీఎస్ సహకారంతో నిరంతర పర్యవేక్షణ చేపడుతున్నాం. Also Read: హైదరాబాద్-విజయవాడ రూట్లో ప్రయాణించే వారికి అదిరిపోయే శుభవార్త! కరవు రహిత రాష్ట్రంగా చేస్తాం ఇంకా కొన్ని జలశయాల్లో నీరు నింపలేని పరిస్థితి ఉంది. గత ఐదేళ్ల పాపం రాష్ట్రాన్ని పీడిస్తోంది. పెన్నా బేసిన్లోని రిజర్వాయర్లల్లో నీటిని నింపలేకపోతున్నాం. గత ఐదేళ్లల్లో ఇరిగేషన్ వ్యవస్థను నాశనం చేశారు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా రిజర్వాయర్లల్లో నీటిని నింపే ప్రయత్నం చేస్తున్నాం. ఏపీలోని రిజర్వాయర్లల్లో మొత్తంగా 760 టీఎంసీల కెపాసిటీతో నీటిని నిల్వ చేయొచ్చు. ప్రస్తుతం 680 టీఎంసీల నీటిని నిల్వ చేయగలిగాం. రాష్ట్రాన్ని కరవు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం. వరదలు, వర్షపు నీటిని ఒడిసి పట్టేలా చర్యలు తీసుకుంటామని'' మంత్రి నిమ్మల వివరించారు. Also Read: టీడీపీ దాడి కేసు.. విచారణకు హాజరైన వైసీపీ నేతలు ఇదిలాఉండగా.. సముద్రం అలజడిగా మారిన నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. పిడుగులు పడే అవకాశాలుండడంతో పొలాల్లో పని చేసే రైతులు, వ్యవసాయ కూలీలు , పశువుల కాపరులు చెట్ల కింద కానీ, స్తంభాల వద్ద కానీ,ఖాళీ ప్రదేశాల్లో కానీ ఉండరాదని సూచించారు. అలాగే పర్యాటక ప్రాంతాలకు కూడా వెళ్లొద్దని హెచ్చరించారు. #rains #heavy-rains మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి