AP News: అక్కడెలా పడుకున్నావ్‌రా... తాగుబోతు పనికి అంతా షాక్‌

సత్యసాయి జిల్లా హిందూపురానికి వెళ్తున్న ఆర్టీసీ బస్సులో 15 కిలోమీటర్ల వరకు టైర్‌ మీద పడుకుని ప్రయాణించాడు ఓ వ్యక్తి. మందు మత్తులో తన ప్రాణాలను రిస్కులో పెట్టేసుకున్నాడు. బైక్‌పై వెళ్లేవారు గమనించకపోతే పెద్ద ప్రమాదమే జరిగి ఉండేదంటున్నారు ప్రయాణికులు.

New Update
ap news

ap news

AP News: మందుబాబులం మేం మందుబాబులం.. మందుకొడితే మాకు మేమే మహారాజులం అనే పాట గుర్తుండే ఉంటుంది. చుక్క పడితే చాలు జనాలకు చుక్కలు చూపించే వాళ్లు ఎంతో మంది ఉంటారు. తాగుబోతులకు ఓ లెక్కుంటుంది. అదే స్థాయిలో తిక్క కూడా ఉంటుంది. ఎప్పుడు ఏం చేస్తారో ఎవరికీ అర్థం కాదు. తాజాగా ఏపీలో ఓ మందుబాబు చేసిన పనిచూసి అంతా షాక్‌ అయ్యారు. ఇంతకీ ఏం చేశాడంటే సత్యసాయి జిల్లాలో కొత్తచెరువు నుంచి హిందూపురానికి వెళ్తున్న ఆర్టీసీ బస్సు పెనుకొండ సమీపంలోని రాంపురం దగ్గరికి రాగానే కొందరు బైక్‌పై వెళ్తున్నవారికి ఓ దృశ్యం కనపడింది. అదేంటంటే బస్సు కింద కాళ్లు వేలాడుతూ ఉండటాన్ని గుర్తించారు.

మందు మత్తులో ప్రాణాలను రిస్కులో..

వెంటనే బస్సు డ్రైవర్‌కు విషయం చెప్పడంతో డ్రైవర్‌కు గుండె ఆగినంత పనైంది. సడెన్‌ బ్రేక్‌ వేసి హుటాహుటిన కిందకి దిగి వచ్చి చూడగా.. ఓ మందుబాబు అప్పుడే తెల్లారిందా అన్నట్టుగా బెడ్‌ మీద నుంచి లేచినట్టు స్టెప్నీ టైర్‌పైనుంచి లేచి కిందకు దిగడంతో అంతా ఆశ్చర్యపోయారు. దాదాపు 15 కిలోమీటర్ల వరకు అలాగే టైర్‌ మీద పడుకుని ప్రయాణించాడు ఆ వ్యక్తి. మందు మత్తులో తన ప్రాణాలను రిస్కులో పెట్టేసుకున్నాడు. బైక్‌పై వెళ్లేవారు గమనించకపోతే పెద్ద ప్రమాదమే జరిగి ఉండేదంటున్నారు ప్రయాణికులు. 

బస్సు డ్రైవర్‌ ఆ మందుబాబును కిందకి దించి చివాట్లు పెట్టి అక్కడి నుంచి బస్సు స్టార్ట్‌ చేసి వెళ్లిపోయాడు. గతంలోనూ ఇలాంటి ఘటనలు మన తెలుగు రాష్ట్రాల్లో చాలానే జరిగాయి. ఈ మధ్య ఓ మందుబాబు ఎక్కడా స్థలం లేనట్టు ఏకంగా కరెంట్‌ తీగలనే సోఫాలా ఫీలై పడుకుని ఊయల ఊగాడు. కొందరు అయితే మద్యం మత్తులో నడి రోడ్డుపై నానా హంగామా సృష్టించారు. రోడ్డుపై భారీ వాహనాలు ఎదురు వస్తున్నా తగ్గేదే లే అంటూ ఎదురొడ్డి నిలుచుకున్నారు. మనల్ని ఎవడ్రా ఆపేదంటూ నానా హైరానా క్రియేట్‌ చేశారు. 

ఇది కూడా చదవండి: చక్కెరకు బదులుగా ఇవి తిన్నారంటే వ్యాధులు మీ దరి చేరవు

 

Advertisment
Advertisment
Advertisment