Ap Rains: అంచనాలకు భిన్నంగా కదులుతున్న అల్పపీడనం..!

వాతావరణ శాఖ అంచనాలకు భిన్నంగా బంగాళాఖాతంలో అల్ప పీడనం కదులుతోంది. ప్రస్తుతం దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడు సమీపాన తీవ్ర అల్పపీడనం స్థిరంగా సాగుతోంది. తీవ్ర అల్పపీడనం కారణంతో బలమైన ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడుతున్నాయి.

New Update
Weather Alert: తెలంగాణలో మరో రెండు రోజుల పాటు వర్షాలు..

AP Rains: వాతావరణ శాఖ అంచనాలకు భిన్నంగా బంగాళాఖాతంలో అల్ప పీడనం కదులుతోంది. ప్రస్తుతం దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడు సమీపాన తీవ్ర అల్పపీడనం స్థిరంగా సాగుతోంది. ఇది రానున్న 24 గంటల్లో పశ్చిమ నైరుతిగా పయనించి దక్షిణ కోస్తా తీరం వైపు వచ్చే క్రమంలో బల హీనపడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక, తీవ్ర అల్పపీడనం కారణంతో బలమైన ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడుతున్నాయి.

Also Read: Kambli: సచిన్‌కు థాంక్స్...కోలుకుంటున్న మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ

వారం రోజులకు పైగా వదలకుండా ఉన్న ముసురు రైతులకు ముప్పుగా మారింది. నేడు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలకు ఆస్కారం వుంది. కోస్తాలో చలి తీవ్రత కొనసాగుతోంది. రానున్న 24 గంటల్లో కోస్తాలోని అనేక ప్రాంతాలు, రాయలసీమలోని పలుచోట్ల పలు ప్రాంతాలతో పాటు ప్రకాశం, తిరుపతి, నెల్లూరు,  జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.

Also Read: J&K: లోయలో పడిన ఆర్మీ వెహికల్...ఐదుగురు జవాన్లు మృతి

ఈ అల్పపీడనం కాస్త బలహీనపడుతున్న దశలో మరోటి ఏర్పడే అవకాశాలు కనపడుతున్నాయి. ఇటీవల కాలంలో బంగాళాఖాతంలో డిసెంబర్ నెలలో వరుస అల్పపీడనాలు ఏర్పడటం ఇదే మొదటిసారి. పిడుగులు పడే అవకాశముందని అధికారులు వెల్లడించారు. బుధవారం మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. 

Also Read: వాట్సాప్ యూజర్లకు బిగ్ షాక్.. వచ్చే ఏడాది సేవలు నిషేధం

రాష్ట్రంలోని అన్ని పోర్టుల్లో మూడో నంబరు ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి. శనివారం తరువాత రాష్ట్రంలో వర్షాలు తగ్గుతాయి. మంగళవారం విజయనగరం, కృష్ణా, బాపట్ల, ఏలూరు,తూర్పుగోదావరి అల్లూరి సీతారామరాజు, , విశాఖపట్నం జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి.

Also Read: AP: నేడు బలహీన పడనున్న అల్పపీడనం..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు!

అల్పపీడనం ప్రభావంతో గాలులు వీస్తాయంటున్నారు. మత్స్యకారులు బుధవారం వరకు వేటకు వెళ్లొద్దని అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలోని మన్యంలో చలి తీవ్రత పెరిగింది. ఏజెన్సీ ప్రాంతంలో చలి గాలులు విపరీతంగా వీస్తున్నాయి. అలాగే మేఘాలు తీవ్రంగా కమ్ముకున్నాయి. ఈ ప్రభావంతో ఎండా, మంచు కనపడడం లేదు. చలి గాలులతో గిరిజనులు అల్లాడిపోతున్నారు. 

మరోవైపు బంగాళాఖాతంలో వరుసగా అల్పపీడనాలు ఏపీ ప్రజల్ని, మరీ ముఖ్యంగా రైతుల్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు