/rtv/media/media_files/2025/02/25/EYD5cZc9Ldl9YSIaV9Tm.webp)
Annadata Sukhibhava
AP News : ఏపీలో గెలిచేందుకు కూటమి ప్రభుత్వం అనేక హామీలిచ్చింది. వాటిలో కొన్నింటిని ఇప్పటికే అమలు చేస్తోంది. కొన్నింటిపైనా చర్చ జరుగుతోంది. అయితే కూటమి పార్టీలు ఇచ్చిన రెండు కీలక పథకాలు మాత్రం ఇంతవరకు అమలు కాలేదు. దీంతో అబ్ధిదారుల్లో ఆందోళన నెలకొంది. హామీలన్నీ అమలు చేస్తామని ప్రభుత్వం చెబుతున్నా ఇంకా క్లారిటీ రాలేదు. దీనిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Also Read : విమానం లోపల కమ్మేసిన పొగ మంచు.. ఊపిరాడకపోవడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్!
ఈ రెండు పథకాల్లో తల్లికి వందనంగా పేరు మారిన అమ్మఒడి పథకం, అన్నదాత సుఖీభవగా పేరు మారిన రైతు భరోసా ఉన్నాయి. ఈ రెండు పథకాల అమలుపై ఇప్పటికే ప్రభుత్వం సంకేతాలు ఇస్తున్నప్పటికీ ఇప్పటివరకు అమలుకు నోచులకోలేదు. ఈ క్రమంలో మంత్రి నారా లోకేష్ మండలిలో కీలక ప్రకటన చేసారు. ఇవాళ శాసన మండలి సమావేశాలు వాడీవాడిగా జరిగాయి. ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్సీలు పథకాలపై ప్రభుత్వాన్ని నిలదీశారు. తాము అమలు చేసిన పథకాలన్నీ కూటమి ప్రభుత్వం పూర్తిగా పక్కనబెట్టేసిందని ఆరోపించాయి. ఈ నేపథ్యంలో మంత్రి నారా లోకేష్ స్పందించి సమాధానం ఇచ్చారు. శాసనమండలి సాక్షిగా చెప్తున్నా ఏప్రిల్, మే నెలల్లో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలు అమలు చేస్తామని ప్రకటించారు. కూటమి ఇచ్చిన ప్రతి హామీకి కట్టుబడి ఉన్నామని తెలిపారు.
రాష్ట్రంలో ఈ ఏడాది బడ్జెట్ తర్వాత కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల పథకాలు ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు సంకేతాలు ఇస్తున్నారు. అలాగే కీలకమైన తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలను జూన్ లోపు అమలు చేయాలని నిర్ణయించారు. తల్లికి వందనం పథకాన్ని విద్యాసంవత్సరం ప్రారంభంలోపే ఇచ్చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్, మే నెలల్లోనే ఈ రెండు పథకాలు అమలు చేసి తీరుతామని లోకేష్ చేసిన ప్రకటన లబ్దిదారుల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తున్నాయి.
Also Read : ఏనుగుల దాడిపై పవన్ దిగ్భ్రాంతి.. రూ.10 లక్షలు ఆర్థిక సాయం!