/rtv/media/media_files/2025/03/20/H1mW0zw3CW7FmHTgJgp9.jpg)
Lover killed hijra
Anakapalle Crime News: అనకాపల్లి జిల్లాలో వెలుగుచూసిన హత్యకేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. కశింకోట మండలం బయ్యవరం బ్రిడ్జి కింద రెండు కాళ్లు, చేతులు బెడ్ షీట్లో చుట్టి ఉన్న విషయాన్ని స్థానికులు గుర్తించారు. కాగా మృతదేహం దిలీప్ అలియాస్ దీపు అనే హిజ్రాదిగా గుర్తించారు. మృతదేహం కుడిచేతిపై ఉన్న టాటూ ఆధారంగా నాగులాపల్లిలో ఉంటున్న దిలీపుమార్ ( అలియాస్ దీపు) అనే హిజ్రాగా తోటి హిజ్రాలు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీపుని ఆమె లవర్ బన్నీ అతి కిరాతకంగా హత్య చేసినట్లు గుర్తించారు.బన్నీని అదుపులోకి తీసుకున్న పోలీసులుహత్యకు గల కారణాలపై విచారణ చేపట్టారు. దీపు తల, మొండం వేరు చేసి. కాళ్లు, చేతుల్ని ముక్కలుగా నరికిన బన్నీ.
Also Read: దెయ్యాలతో చెడుగుడు ఆడేస్తాం.. ఎనీ డౌట్స్..?
ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులకు చాలా షాకింగ్ విషయాలు తెలిశాయి. మునగపాక మండలం నాగులపల్లిలో ఉండే దీపు బన్నీ అనే వ్యక్తితో ప్రేమలో పడింది. అతని పరిచయం ఏర్పడటంతో అప్పటి వరకు క్లోజ్‌గా ఉన్న హిజ్రా కమ్యూనిటీకి దూరంగా ఉంటూ వచ్చింది. ప్రేమ సంగతి కూడా ఎవరికీ చెప్పలేదు. ఇది ఎవరు చేశారని మొదట చాలా మందికి చాలా అనుమానాలు కలిగాయి. చివరకు ప్రియుడు బన్నీయే ఆమెను హతమార్చినట్టు పోలీసులు గుర్తించారు. అతనిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఆరా తీశారు. అనకాపల్లి ఎస్పీకి ఫోన్ చేసి వివర్లు అడిగి తెలుసుకున్నారు. త్వరగా దర్యాప్తు పూర్తి చేయాలని నిందితుడిని పట్టుకొని కఠినంగా శిక్షించాలని ఆదేశించారు.
Also Read: మణిపూర్‌లో మళ్లీ ఘర్షణ.. ఈసారి హమర్, జోమి తెగల మధ్య గొడవలు
బన్నీని అరెస్టు చేసిన పోలీసులు హత్య చేసిన విధానాన్ని రీకన్‌స్ట్రక్షన్ చేయించారు. --నాలుగేళ్లుగా బన్నీ అలీయస్ దుర్గాప్రసాద్‌తో దీపు సహజీవనం చేస్తున్నట్లు గుర్తించారు. అనకాపల్లి గవరపాలెం కు చెందిన దిలీప్ కుమార్ నాలుగేళ్ల కిత్రం శస్త్రచికిత్స చేయించుకుని హిజ్రాగా మారినట్లు వివరించారు. కాకినాడకు చెందిన బన్నీ (దుర్గాప్రసాద్) అనే ఫుడ్ డెలివరీ బాయ్ తో ఏర్పడిన పరిచయంతో వీరిద్దరూ నాగులపల్లిలో ఉంటూ సహజీవనం చేస్తున్నారు. బన్నీ గంజాయికి అలవాటు పడినట్లు తెలిసింది. ఇతనికి మరదలుతోనూ సంబంధం ఉండటంతో ఇటు దీపుతో సహాజీవనం చేస్తూ ఆటు మరదలితో ప్రేమాయణం సాగిస్తున్నాడు. ఈ విషయం దీపుకు తెలియడంతో తరచూ గొడవలు జరిగేవని ఇంటి చుట్టుపక్కల వారు తెలిపారు.
Also Read: ఏపీ, తెలంగాణలో ఎండలకు బ్రేక్.. వర్షాలకు వెల్‌కమ్-ఎక్కువగా ఈ జిల్లాల్లోనే!
ఈ నేపథ్యంలో దీపు అడ్డుతొలగించుకోడానికి బన్నీ పథకం పన్ని హత్యచేశాడు. శరీర భాగాలను ముక్కలుగా కోసి స్కూటీ బండి పై వెళ్లి బయ్యవరం, అనకాపల్లి జాతీయ రహదారి బ్రిడ్జి కింద, అనకాపల్లి డైట్ కాలేజ్ వద్ద ఉన్న కాలువల్లో, తాళ్లపాలెం వంతెన కింద ప్రాంతాల్లో పడేశానని నిందితుడే వెల్లడించడంతో మృతదేహం భాగాలను బుధవారం పోలీసులు సేకరించారు. కాగా మరదలితో పెళ్లికి అడ్డువస్తుందనే కారణాంగానే దీపును బన్నీ హాత్య చేసినట్లు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. కాగా నిందితుడిని ఎన్ కౌంటర్ చేయాలంటూ హిజ్రాలు జిల్లా ఆసుపత్రి, డీఎస్పీ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. తమకు రక్షణ కల్పించి నిందితుడికి ఉరిశిక్ష పడేలా చూడాలంటూ నినాదాలు చేశారు.
Also Read: రా కి రా.. సార్ కి సార్..! గ్రోక్ ఏఐ దెబ్బ అదుర్స్ కదూ!