Liquor Shops : ఏపీలో మందుబాబులకు బిగ్ షాక్.. పది రోజులు వైన్స్ బంద్!

ఏపీలో పది రోజుల పాటు మద్యం దుకాణాలు బంద్‌ అవ్వనున్నాయి. గత ప్రభుత్వం హయాంలో మద్యం దుకాణాలను ప్రభుత్వమే నిర్వహించగా..ఈ సారి ప్రైవేట్‌ వ్యక్తులు వీటిని నిర్వహించనున్నారు. దీంతో కాంట్రాక్టు ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో పది రోజుల పాటు షాపులు మూసివేయనున్నారు.

New Update
BREAKING: మద్యం ప్రియులకు షాక్.. రేపు, ఎల్లుండి మద్యం షాపులు బంద్

AP : ఏపీలో ని మందుబాబులకు ఏపీ సర్కార్‌ ఓ బ్యాడ్‌ న్యూస్‌ చెప్పింది. అది ఏంటంటే..ఏపీలో పది రోజుల పాటు మద్యం దుకాణాలు బంద్‌ చేస్తున్నట్లు తెలిపింది. అసలే రేపు దుకాణాలు బంద్‌ అంటేనే ముందు రోజే షాపుల ముందు బారులు తీరి మరీ తమకు కావాల్సిన సరుకును తెచ్చి ఇంట్లో పెట్టేసుకుంటారు.

అయితే ఏపీలో మందుబాబులకు ఈ విషయంలో షాక్ తగిలింది. అక్టోబర్ రెండు గాంధీ జయంతి ఒక్కరోజే మద్యం షాపులు బంద్ అవుతాయని అనుకున్న చాలా మందికి.. ఊహించని మరో గట్టి షాక్‌ తగిలింది. ఏకంగా పదిరోజుల పాటు మద్యం దుకాణాలు బంద్ అయ్యే పరిస్థితి వచ్చింది. దీంతో మందుబాబులు తీవ్ర ఆందోళనకు గురౌతున్నారు. నూతన మద్యం పాలసీ కారణంగా తక్కువ ధరకే నాణ్యమైన బ్రాండ్లు రుచి చూడొచ్చని అనుకుంటే.. ఇదేంటి ఇలా అయ్యిందంటూ తమ బాధను ఇంట్లో ఖాళీ అయిన సీసాలతో చెప్పుకుంటున్నారు.

అయితే అసలు సంగతి ఏంటంటే.. ఏపీ ప్రభుత్వం అక్టోబర్ 12 నుంచి నూతన మద్యం విధానం అమలు చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. వైసీపీ ప్రభుత్వం హయాంలో ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కొత్త మద్యం పాలసీ ప్రకారం మద్యం షాపులను ప్రైవేట్ వ్యక్తులు నిర్వహించనున్నారు. దీంతో ఇప్పటి వరకూ ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేసిన కాంట్రాక్టు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీరందరి కాంట్రాక్టు సెప్టెంబర్ 30తోనే ముగిసింది. 

ఇంకో పది రోజుల్లో నూతన మద్యం పాలసీ అమల్లోకి రానుంది. దీంతో పదిరోజుల తర్వాత తమకు ఉద్యోగాలు ఉండవని ఆందోళన చేస్తున్నారు. మద్యం దుకాణాలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తే తమ గతేంకానంటూ నిరసనలకు దిగుతున్నారు. ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించాలని.. తమకు ఓ దారి చూపాలని డిమాండ్ చేస్తున్నారు. 

మరోవైపు ఈ పదిరోజులూ మద్యం దుకాణాలు తెరవాలని ప్రభుత్వం కోరినప్పటికీ.. ఇప్పటి నుంచే కాంట్రాక్టు ఉద్యోగులు దుకాణాలకు రావటం మానేశారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల మద్యం దుకాణాలు తెరుచుకోలేదు. ఇక రేపు అక్టోబర్ రెండో తేదీ గాంధీ జయంతి కావటంతో పూర్తిస్థాయిలో మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. ఆ తర్వాత కూడా కాంట్రాక్టు సిబ్బంది వల్ల.. మరో పదిరోజులు లిక్కర్ షాపులు బంద్ అయ్యే పరిస్థితి ఉంది. దీంతో మందుబాబులు తెగ ఫీలవుతున్నారు. 

Also Read:  దసరా వేళ టీజీఆర్టీసీ తీపి కబురు..ఇక నుంచి ఇంటింటికి..!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Cricket Betting : క్రికెట్‌ బెట్టింగ్‌ భూతానికి మరో విద్యార్థి బలి

బెట్టింగ్ విషయంలో ప్రభుత్వం, పోలీసులు ఎన్ని రకాల కఠిన నిర్ణయాలు తీసుకుంటున్న యువతలో ఎలాంటి మార్పు రావడం లేదు. బెట్టింగ్ లో లక్షలు పోగొట్టుకుని ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. బుద్వేల్‌ కు చెందిన బీటెక్ విద్యార్థి క్రికెట్‌ బెట్టింగ్‌ భూతానికి బలయ్యాడు.

New Update
Cricket Betting

Cricket Betting

Cricket Betting : బెట్టింగ్ విషయంలో ప్రభుత్వం, పోలీసులు ఎన్ని రకాల కఠిన నిర్ణయాలు తీసుకుంటున్న యువతలో ఎలాంటి మార్పు రావడం లేదు. బెట్టింగ్ లో లక్షలు పోగొట్టుకుని ఎవరికి చెప్పుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అలాంటి ఘటనే బుద్వేల్‌లో చోటు చేసుకుంది.

ఇది కూడా చూడండి: SRH VS PBKS: వాట్ ఏ కమ్ బ్యాక్..ఎస్ఆర్హెచ్ దుమ్ము దులిపేసింది మామా..

క్రికెట్‌ బెట్టింగ్‌ భూతానికి మరో విద్యార్థి బలయ్యాడు. డబ్బులు అధికంగా వస్తాయన్న ఆశతో బెట్టింగ్‌లో పాల్గొన్న యువకుడు చివరికి ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటన బుద్వేల్‌లో విషాదాన్ని నెలకొల్పింది. బుద్వేల్‌కు చెందిన పవన్ కుమార్ బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఐపీఎల్ సీజన్ అంటేనే బెట్టింగ్ రాయుళ్లు పండగ చేసుకుంటారు. ఈ ఒక్క ఐపీఎల్ సీజన్ లోనే బెట్టింగ్ దందాలో కోట్లు చేతులు మారతాయి. ఈ బెట్టింగుల ద్వారా ఈజీ మనీకి అలవాటు పడిన కొందరు యువకులు డబ్బు పోగోట్టుకొని మనస్థాపంతో ప్రాణాలు తీసుకున్న ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి.

Also Read: Vivo V50e 5G Offers: మచ్చా ఆఫర్ అంటే ఇదేరా.. ప్రీ బుకింగ్ స్టార్ట్.. రూ. 5వేల భారీ డిస్కౌంట్- కెమెరా సూపరెహే!

పవన్ కడా ఇటీవల జరిగిన ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లలో బెట్టింగ్‌కు లోనయ్యాడు. మొదట్లో స్వల్ప లాభాలు రావడంతో ఆశ పెరిగింది. ఆ తర్వాత పెద్ద మొత్తంలో అంటే సుమారు 80 వేలు బెట్టింగ్ పెట్టాడు. అయితే.. పెట్టిన మొత్తాన్ని నష్టపోయిన పవన్‌ తీవ్ర మనస్తాపానికి లోనయ్యాడు. పరిస్థితిని తట్టుకోలేక ఇంటి గదిలోని ఫ్యాన్‌కు ఉరి వేసుకొని పవన్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఎదిగిన కొడుకు బెట్టింగ్ భూతానికి బలవ్వడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నారు.

Also Read: కొరియోగ్రాఫర్ శ్రష్ఠి వర్మ బ్రాండ్ న్యూ కార్ అదుర్స్..!

Advertisment
Advertisment
Advertisment