Lady Aghori: అఘోరికి భారీ బందోబస్తు.. రోడ్డుపై పడుకుని ఏం చేస్తుందంటే!

లేడీ అఘోరి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పలు ఆలయాలను సందర్శిస్తుంది. ఇటీవలే శ్రీకాళహస్తి ఆలయాన్ని దర్శించుకున్న అఘోరి ఇప్పుడు యాగంటి క్షేత్రానికి బయల్దేరింది. తన కారు మొరాయించడంతో కాలినడకన వెళ్తుంది. ఆమెకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

New Update
Aghori (1),

తెలంగాణకు చెందిన అఘోరీ రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయం పై దాడి జరిగిన సమయంలో ఆ ఆలయాన్ని సందర్శంచి నగ్నంగా పూజలు చేయడంతో వార్తల్లోకెక్కారు. అప్పటి నుంచి తరచూ ఇంటర్వ్యూలో ఇచ్చి మరింత పాపులర్ అయ్యారు. అయితే ఆ ఆలయాన్ని ధ్వంసం చేసిన వారిని పట్టుకుని కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేసింది.

Also Read : ట్రంప్ గెలిచారు, నేను అమెరికా నుంచి వెళ్లిపోతా..మస్క్ కుమార్తె ప్రకటన

అంతేకాకుండా తాను సనాతన ధర్మ పరిరక్షణ కోసం పాటుపడుతున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగానే తాను ఆత్మార్పణం చేసుకుంటానని తెలిపింది. ఆత్మార్పణంలో తాను చనిపోతే శివుని వద్దకు వెళ్లిపోతానని, లేకుంటే సనాతన ధర్మాన్ని మరింత ముందుకు తీసుకెళ్తానని పేర్కొంది. ఈ మేరకు దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న ఆత్మార్పణం చేసుకుంటానని ప్రకటించింది. 

దీంతో అలెర్ట్ అయిన పోలీసులు ముందస్తుగా అఘోరిని అరెస్టు చేశారు. ఆపై అఘోరి సొంత గ్రామమైన కుషన్ పల్లిలోని తన ఇంట్లో రెండు రోజులు నిర్భందించారు. ఆ తర్వాత మహారాష్ర సరిహద్దులో విడిచిపెట్టేశారు. దీనిపై ఆగ్రహించిన అఘోరీ మళ్లీ తెలంగాణకు రానని తెలిపింది. 

Also Read :  సీఎం రేవంత్ సంచలనం.. యాదాద్రి పేరు మార్పు!

ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యక్షం

అనంతరం పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యక్షమైంది. ఏపీలో అడుగుపెట్టడంతోనే వివాదం మొదలైంది. టోల్ గేట్ వద్ద గొడవకు దిగింది. తనను ఎవరో టచ్ చేశారని.. సీసీ టీవీ ఫుటేజ్ చూపించమని రచ్చ రచ్చ చేసింది. పోలీసులు చేరుకుని వివాదాన్ని సర్దుమనిగించారు. ఇటీవలే శ్రీకాళహస్తి ఆలయాన్ని సందర్శించగా.. పోలీసులు ఆలయంలోపలకి అనుమతించలేదు.

దీంతో అక్కడే ఆత్మర్పణం చేసుకుంటానని ఒంటిపై పెట్రోల్ పోసుకుంది. తర్వాత దానిని నివారించిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆపై ఎర్రటి వస్తాలతో ఆలయ దర్శనం చేసుకుంది. అక్కడ నుంచి బయల్దేరిన అఘోరి కారుకు యాక్సిడెంట్ అయింది. ఈ కారు యాక్సిడెంట్ కు పోలీసులే కారణం అంటూ అఘోరి తెలిపింది. కారుకు లైట్లు లేవని చెప్పినా వినలేదని.. తనను హైవేపై వదిలేశారని పేర్కొంది.

Also Read: కన్నీళ్లు పెట్టుకున్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి!

కర్నూల్ లో ప్రత్యక్షం

ఇక శ్రీకాళహస్తిలో హల్చల్ చేసిన అఘోరి ఇప్పుడు కర్నూల్ లో ప్రత్యక్షమైంది. కారులో యాగంటికి వెళ్తున్న క్రమంలో కారు మొరాయించింది. దీంతో అలంపూర్ వద్ద కారును వదిలేసి కాలినడక సాగించారు. ఇందులో భాగంగానే పాణ్యం మండలం బలపనూరు వద్ద నేషనల్ హైవేపై అఘోరి కనిపించారు. అయితే తాను పాదయాత్రగానే వెళ్తానని.. పోలీసులు ఏర్పాటు చేసిన వాహనాలు ఎక్కనంటూ అఘోరి మొండికేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా రోడ్డు పక్కనే అఘోరి బైఠాయించింది. 

Also Read: చాగంటికి చంద్రబాబు సర్కార్ కీలక పదవి.. మరో 58 మందికి కూడా..!

రోడ్డుపై పడుకుని నిరసన

రోడ్డుపై పడుకుని నిరసన చేసింది. ఎవరైనా బలవంతం చేస్తే ఆత్మార్పణం చేసుకుంటానని బెదిరిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో విషయం తెలుసుకున్న భక్తులు, స్థానికులు ఆమెను దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుంటున్నారు. పోలీసులు సైతం ఆమెకు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. అఘోరీని సురక్షిత ప్రదేశానికి తరలించాలని పాణ్యం పోలీస్ సిబ్బంది, జాతీయ రహదారి సిబ్బంది చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే అఘోరి రోడ్డు ప్రక్కన బైఠాయించింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pahalgam Terrorist Attack: ఉగ్రదాడికి బిగ్‌బాస్ కంటెస్టెంట్లే ప్రధాన కారణం.. అన్వేష్ సంచలన వీడియో!

పహల్గాంలో ఉగ్రాదాడి ఘటనపై అన్వేష్ స్పందించాడు. ఈ దాడికి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ మెహబూబ్, సోహెల్, ఇమ్రాన్ ప్రధాన కారణమన్నాడు. వీరు ఉగ్రవాదుల నుంచి డబ్బులు తీసుకుని బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్లనే ఇలా జరిగిందని సంచలన ఆరోపణలు చేశాడు.

New Update
anvesh sensational comments on bigg boss contestants

anvesh sensational comments on bigg boss contestants

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రదాడి అల్లకల్లోలం సృష్టించిన విషయం తెలిసిందే. బైరసన్ వ్యాలీలో టూరిస్టులపై టెర్రరిస్టులు కాల్పులు జరిపి 28 మందిని హతమార్చారు. దేశ వ్యాప్తంగా ఇప్పుడిదే హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో ప్రముఖ యూట్యూబర్ అన్వేష్ సంచలన వీడియో రిలీజ్ చేశాడు. తన సోషల్ మీడియా అకౌంట్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఉగ్రదాడికి ముఖ్య కారణం వీరేనంటూ ముగ్గురు ఫొటోలను షేర్ చేశాడు. అందులో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ మెహబూబ్, సోహెల్, పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ ఉన్నారు.  

ఉగ్రదాడికి వీరే కారణం

అనంతరం ఆ వీడియోలో అన్వేష్ సంచలన విషయాలు పంచుకున్నాడు. ముందుగా మెహబూబ్ గురించి చెప్పాడు. ‘‘మెహబూబ్‌ తిండికి తికానా లేని మటన్ కొట్టు మస్తాన్ రావు కొడుకు. అలాంటిది.. రూ.2 కోట్లు ఖర్చు పెట్టి ‘నువ్వే కావాలి’ అనే వీడియో తీశాడు. అది కూడా అమెరికా, ఆస్ట్రేలియా, యూరప్, మెక్సికో.. 4 దేశాలు తిరిగా ఆ వీడియో తీశాడు. ఒక్క యూట్యూబ్ వీడియో కోసం రూ.2 కోట్లు ఖర్చుపెట్టాడు. ఆ వీడియో కోసం ఖర్చు పెట్టిన డబ్బులు అన్నీ ఉగ్రవాద సంస్థలు ఇచ్చినవే. 

అలాగే సోహెల్‌కు నాలుగు రెస్టారెంట్లు.. ఒక సినిమా.. ఇలా మరెన్నో ఉన్నాయి. ఈ డబ్బులన్నీ కూడా ఉగ్రవాద సంస్థలు ఇచ్చినవే. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల వీరికి ఆ డబ్బులు వచ్చాయి. ఇంకా పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ కూడా ఉన్నాడు. ఇతడు.. దుబాయ్‌లోని హోటళ్లు, దుబాయ్‌లో షాపులు, శ్రీశైలంలో కాటేజీలు, ఇండియాలో ఖరీదైన రెస్టారెంట్లు, లగ్జరీ కార్లు.. ఇలా లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ డబ్బులన్నీ ఉగ్రవాద సంస్థలు ఇచ్చాయి.

అయితే వాళ్లెందుకు ఇచ్చారంటే.. ఉగ్రవాదులు వీళ్లతో కాంటాక్ట్ అయ్యి.. తమ యాప్‌లను ప్రమోట్ చేయాలంటూ వీరికి డబ్బులు ఇస్తారు. దాని కోసం వీరు తలో రూ.10 నుంచి 20 లక్షలు తీసుకుంటారు. ఆ యాప్ ఏంటి..? అది ఎవరు క్రియేట్ చేశారు..? అది ఎక్కడ నుంచి వచ్చింది? అనేది అస్సలు పట్టించుకోరు. ఆ యాప్‌లు వాడి చనిపోయినవారెందరో ఉన్నారు. కానీ వీళ్లు మాత్రం విదేశీ ట్రిప్పులు వేస్తూ ఎంజాయ్ చేశారు. ఉగ్రవాదులు ఇచ్చిన డబ్బులు తీసుకుని బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్లనే ఇప్పుడు ఉగ్రదాడి జరిగింది. ఈ దాడికి ఈ ముగ్గురే కారణం’’ అంటూ సంచలన ఆరోపణలు చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

naa anveshana | Pahalgam attack | latest-telugu-news | telugu-news

Advertisment
Advertisment
Advertisment