KA PAUL: మైండ్ దొబ్బిందా..? చిరంజీవిపై కేఏ పాల్ ఫైర్!

తాను ఇకనుంచి రాజకీయాలకు దూరంగా ఉంటానన్న చిరంజీవి వ్యాఖ్యలపై కే.ఏ పాల్ స్పందించారు. 70 ఏళ్ల వయసున్న చిరంజీవి మతి తప్పిందా? లేక కొత్త వేషమా అని అన్నారు. ప్రజా రాజ్యమే జనసేనగా ఆవిర్భవించిందన్న చిరంజీవి.. పూటకో స్టేట్మెంట్ ఇస్తున్నారని మండిపడ్డారు.

New Update
KA Paul Fires On Megastar Chiranjeevi Comments

KA Paul Fires On Megastar Chiranjeevi Comments

‘బ్మహ్మానందం’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ ఈవెంట్‌లో మెగాస్టార్ మాట్లాడుతూ.. ఇక మీదట పాలిటిక్స్‌కు చోటు లేదని సంచలన ప్రకటన చేశారు. రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పారు. ఆయన వ్యాఖ్యలపై కే.ఏ పాల్ రియాక్ట్ అయ్యారు. 70 ఏళ్ల వయసున్న చిరంజీవి మతి తప్పిందా? లేక ఇదేమైనా కొత్త వేషమా అని అన్నారు. 

Also Read: మహిళల్లో రొమ్ము కాన్సర్‌కు వేరుసెనగలు బాగా పని చేస్తాయా?

చిరంజీవి పూటకో స్టేట్మెంట్

ప్రజా రాజ్యమే జనసేనగా ఆవిర్భవించిందన్న చిరంజీవి.. పూటకో స్టేట్మెంట్ ఇస్తున్నారని మండిపడ్డారు. పవన్, చిరంజీవి బీజేపీలో చేరుతారని తాను ఎప్పుడో చెప్పానన్నారు. పవన్ కళ్యాణ్ డ్రామాలో చంద్రబాబు మోసపోయారని పేర్కొన్నారు. పవన్‌ని నమ్మి చంద్రబాబు తన కొడుకుకే అన్యాయం చేస్తున్నారు అని తెలిపారు.

Also Read: TTD: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. ఇకపై వాట్సాప్‌లోనే

వాళ్లకి ఓటు బ్యాంక్ లేదన్న వాస్తవం మీకు తెలియదా అని ప్రశ్నించారు. కోర్టులు, జడ్జీలను వీళ్ళు ఎలా మేనేజ్ చేస్తున్నారో తన దగ్గర చాలా ఆధారాలు ఉన్నాయని.. వాటిని సరైన టైంలో బయటపెడతానని తెలిపారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ డ్రామాని సీరియస్‌గా తీసుకోకండని పేర్కొన్నారు. 

Also Read: Trump-musk:మస్క్‌ కు హై పవర్‌ ఇచ్చిన ట్రంప్‌...ఇక కోతలే..కోతలు!

నీ భార్య కన్నీళ్లు పెడుతుంది

వాళ్ళ పదవుల విషయంలో డీల్ కుదరక ఈ డ్రామాలు ఆడుతున్నారన్నారు. సనాతన ధర్మం టూర్ చేసే ముందు.. నీ భార్య కన్నీళ్లు పెడుతుంది గుర్తు చేసుకో అని హెచ్చరించారు. పవన్ కళ్యాణ్ వదిలెయ్యక ముందే.. చంద్రబాబు తెలివిగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని పేర్కొన్నారు.

హామీలు అమలు చేయకుండా చంద్రబాబు చేతులెత్తేస్తాడని, రేవంత్ రెడ్డి మోసగాడని తనకు ఎప్పుడో తెలుసన్నారు. అమెరికాలో తెలుగు విద్యార్థుల కోసం 72 గంటల పాటు ఆమరణ దీక్ష చెయ్యాలని నిర్ణయించుకున్నానని అన్నారు. స్టీల్ ప్లాంట్ కోసం ఎలా ఆమరణ దీక్ష చేసి గెలిచానో అమెరికాలో తెలుగు విద్యార్థుల కోసం అలాగే దీక్ష చేస్తానన్నారు. 

Also Read : ఇది మరీ దారుణం.. రేషన్ కార్డు దరఖాస్తుకు రూ.2వేలు.. మీసేవ సెంటర్ల వసూళ్ల దందా!

అల్లు అర్జున్‌ని జైలుకు పంపింది వీళ్ళేనని.. ఆయన్ని కూడా బీజేపీలో చేర్చాలని ఇబ్బంది పెట్టారని ఆరోపించారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోలేదని.. తాను సుప్రీం కోర్టులో కేస్ వేస్తున్నానని అన్నారు. దమ్ముంటే ఈవిఎం ఎన్నికలు కాకుండా బ్యాలెట్ ఎలెక్షన్స్ పెట్టండి అని సవాల్ విసిరారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు