Kiran Royal: పవన్ కల్యాణ్ అభిమానిగా కాలర్ ఎగరేసుకుని తిరుగుతా: కిరణ్ రాయల్
పవన్ కల్యాణ్ అభిమానిగా కాలర్ ఎగరేసుకుని తిరుగుతానని జనసేన నేత కిరణ్ రాయల్ అన్నారు. ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టాల్సిన వైసీపీ నేతలు నన్ను టార్గెట్ చేసి విషం చిమ్మారని ఆరోపించారు. తనపై వచ్చిన ఆరోపణలపై పార్టీకి వివరణ ఇస్తానన్నారు.
తిరుపతి జనసేన పార్టీ ఇంఛార్జ్ కిరణ్ రాయల్.. ఓ మహిళను మోసం చేశారంటూ వస్తున్న ఆరోపణలు దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే జనసేన ఆయన్ని పార్టీకి దూరంగా ఉంచుతూ ఆదివారం ఆదేశాలు కూడా జారీ చేసిన సంగతి తెలిసిందే. అలాగే ఆయన జగన్ 2.0 ఫొటోలు చూపించిన వీడియోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా కిరణ్ రాయల్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
''జగన్ 2.0 ఫోటో విడుదల చేశానని నా జీవితాన్ని నాశనం చేయాలని వైసీపీ నేతలు చూశారు. మళ్లీ చెబుతున్నాను. ఈ చిట్టి రెడ్డి పోస్టర్ అంటే నాకు చాలా ఇష్టం. నా జీవితాన్ని మార్చింది చిట్టి రెడ్డి 2.0 పోస్టర్. వైసీపీ సోషల్ మీడియా నామీద పెట్టిన శ్రద్ద జగన్ మీద పెట్టి ఉంటే పదిసీట్లు ఎక్కవగా వచ్చేవి. జగన్ మీద పది రూపాయల పోస్టర్ తయారు చేస్తే10 కోట్ల పబ్లిసిటీని వైసీపీ క్యాడర్ నాకు ఇచ్చారు.
ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టాల్సిన వైసీపీ నేతలు నన్ను టార్గెట్ చేసి నాపై విషం చిమ్మారు. వైసీపీ నేతలు రాజకీయాల కోసం మహిళను వాడుకున్నారు. భూమన కరుణాకర్ రెడ్డి కుటుంబం పాతిక లక్షల డబ్బు ఆమెకు ఇచ్చి నా మీద ప్రయోగించారు. ఇప్పుడు అ అమ్మయి జీవితాన్ని నాశనం చేశారు. రెండేళ్లుగా అజ్ఞాతంలో ఉన్న ఆమెను బయటకు తీసుకుని వచ్చి జైపూర్ పోలీసులతో అరెస్టు చేయించింది వైసీపీనే.
నన్ను దొండకాయ అంటారా.. అవును నేను పవర్‌ఫుల్ దొండకాయనే. ఆ మహిళ మీద రూ.3 కోట్ల పరువు నష్టం దావా వేస్తాను. ఆమె కోసం వాదించిన వైసీపీ లాయర్లు ఎక్కడ నుండి వచ్చారు. నాకు ఒక కూతురు, చెల్లి, అక్క ఉంది కాబట్టి గౌరవంగా మాట్లాడుతున్నాను. ఆ మహిళపై చాలా కేసులు పలు రాష్టాల్లో ఉన్నాయి. ఆడవాళ్ళను అడ్డం పెట్టుకొని రాజకీయం చేయడం వైసీపీకే చెల్లింది. నిజం నిప్పులాంటిది. పార్టీకి నా మీద వచ్చిన ఆరోపణపై వివరణ ఇస్తాను. కోర్టులో న్యాయం గెలుస్తోంది నాకు అండగా ఉన్న జనసేన కార్యకర్తలందరికీ ధన్యవాదాలు. పవన్ కల్యాణ్ అభిమాని అంటూ కాలర్ ఎగరేసుకుని తిరుగుతానని'' కిరణ్ రాయల్ అన్నారు.
ఇదిలాఉండగా.. కిరణ్ రాయల్ చేసిన మోసం గురించి చెబుతూ లక్ష్మి అనే ఓ మహిళ విడుదల చేసిన వీడియో సంచనలం రేపిన సంగతి తెలిసిందే. రూ.కోటికిపైగా నగదు, 25 సవర్ల బంగారం కొట్టేసి తనను ఆర్థిక ఇబ్బందుల్లో పడేశాడని.. అందుకే తాను సూసైడ్ చేసుకుంటున్నట్లు లక్ష్మీ అనే మహిళ ఆ వీడియోలో మాట్లాడింది. ఆ తర్వాత బాధిత మహిళతో కిరణ్ రాయల్ సన్నిహితంగా ఉన్న మరో వీడియో కూడా బయటపడింది. దీంతో ఆయన ఇంటిని మహిళలు ముట్టడించారు. కిరణ్ రాయ్‌ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే తాజాగా జనసేన.. ఆయన్ని పార్టీకి దూరంగా ఉంచుతూ ఆదేశాలు జారీ చేయడం చర్చనీయం అవుతోంది.

Kiran Royal

Also Read: మతిపోగొడుతున్న ఏయిర్ షో.. అత్యాధునిక యుద్ధ విమానాల ప్రదర్శన

Also Read: మా నెక్స్ట్ టార్గెట్ కిర్రాక్ ఆర్పీ, ఆ తర్వాత సీమరాజా.. వైసీపీ సోషల్ మీడియాలో షాకింగ్ పోస్ట్!