/rtv/media/media_files/2025/04/13/y30R1x20EN3BtEwsixgl.jpg)
IAS transfers
IAS transfers : ఏపీలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పలు హోదాల్లో పని చేస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. అధికారంలోకి వచ్చిన తరువాత పక్కన పెట్టిన అధికారులకు ఇప్పుడు పోస్టింగ్ ఇస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటు సమయం నుంచి రెవిన్యూ - రిజిస్ట్రేషన్ శాఖలు కీలకంగా మారాయి.
Also Read: సుంకాలు 90 రోజుల విరామం ఎఫెక్ట్.. భారీ లాభాల్లో భారత స్టాక్ మార్కెట్లు..
ఈ శాఖలను ఇప్పటి వరకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో పర్యవేక్షించిన సీనియ ర్ ఐఏఎస్ అధికారి సిసోడియాను బదిలీ చేసారు. సిసోడియాకు హ్యాండ్లూమ్, టెక్స్‌టైల్ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు కేటాయించారు. ఆయన స్థానంలో ప్రస్తుతం CCLA స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్న జయలక్ష్మి రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా అదనపు బాధ్యతల అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసారు.
ఇక, ప్రస్తుతం ఐటీ కార్యదర్శిగా ఉన్నా కాటమనేని భాస్కర్ కు ఏపీ హెచ్ఆర్డీ సంస్థ డైరెక్టర్ గా అదనపు బాధ్యతలు అప్పగించారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సీఎంఓలో కీలకం గా వ్యవహరించిన ముత్యాల రాజుకు ఇప్పుడు పోస్టింగ్ దక్కింది. ఆయనకు స్టేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పంచాయితీ రాజ్ సెక్రటరీగా నియమించారు.
Also Read: కొరియోగ్రాఫర్ శ్రష్ఠి వర్మ బ్రాండ్ న్యూ కార్ అదుర్స్..!
పోస్టింగ్ కోసం వెయిటింగ్ లో ఉన్న మరో అధికారి మాధవీ లతకు రైతు బజార్ల సీఈవోగా నియామకం చేసారు. మరో ఐఏఎస్ గౌతమికి గిరిజన విద్య సంస్థల కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించారు. ఫైబర్ నెట్ లో జీవీ రెడ్డి పై ఆరోపణలు చేసి.. అక్కడ నుంచి బదిలీ అయిన దినేష్ కుమార్ ను ఆయూష్ డైరెక్టర్ గా నియమించారు. ఏపీ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఎండీ గా కే నీలకంఠారెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఇది కూడా చూడండి: BRS: బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పోలీసుల అనుమతి మంజూరు..!