WIFE NUDE CALL : భార్యతో న్యూడ్ కాల్స్ చేయించిన భర్త..చేయనన్నదని ఆమెను.

అగ్నిసాక్షిగా ఏడడుగులు నడిచి మూడుముళ్ళు వేసిన భర్తే తన భార్యతో న్యూడ్ వీడియో కాల్స్ చేయించాడు. తాజాగా ఆమె చేసిన వీడియో వైరల్ కావడంతో ఆ భార్య తనకు వద్దని వేధిస్తున్నాడు. తన సమస్యను పోలీసులకు చెబుతామని వెళ్తే అక్కడ కూడా న్యాయం జరగకపోగా వేధింపులు తప్పలేదు. 

New Update
WIFE NUDE CALL

WIFE NUDE CALL

WIFE NUDE CALL : అగ్నిసాక్షిగా ఏడడుగులు నడిచి మూడు ముళ్ళు వేసిన  భర్తే తన భార్యతో న్యూడ్ వీడియో కాల్స్ చేయించాడు. తాజాగా ఆమె చేసిన వీడియో వైరల్ కావడంతో ఆ భార్య తనకు వద్దని విడాకులు కావాలని వేధిస్తున్నాడు. తన సమస్యను పోలీసులకు చెబుతామని వెళ్తే అక్కడ కూడా ఆ మహిళకు అక్కడ న్యాయం జరగకపోగా వేధింపులు తప్పలేదు. 

Also Read: Horoscope Today:ఈ రోజు ఈ రాశివారు  ప్రయాణాలు వాయిదా వేసుకుంటే బెటర్‌!

వివరాల ప్రకారం తిరుపతి జిల్లా కుప్పం బాదురు, కొత్త కండ్రిగకు చెందిన వివాహిత భర్త వేధింపులపై మీడియాను ఆశ్రయించారు.ఆమె తెలిపిన వివరాల ప్రకారం కరోనా సమయంలో ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో భర్త మునిరత్నం రెడ్డి భార్యతో న్యూడ్ వీడియో కాల్స్ చేయించి నగదు వసూలు చేయిస్తున్నాడు.తమ ఆర్థిక పరిస్థితి భాగాలేదని, ఆన్ లైన్ లో న్యూడ్ కాల్స్ చేస్తే భాగా సంపాదించవచ్చని నమ్మబలికాడు. లక్షలు సంపాదించినా ఇంకా కాల్స్ చేయాలని ఒత్తిడి తేవడంతో ఆ భార్య నిరాకరించింది. దీంతో తను చచ్చిపోతానంటూ బ్లాక్ మెయిల్ మొదలు పెట్టాడు. చామెట్ (ఛిల్ల్ చాట్) యాప్ లో తన భార్య పేరుతో మునిరత్నంరెడ్డి ఐడీ క్రియెట్ చేశాడు.  అయితే పిల్లలు పెద్దవాళ్లు అవుతున్నారు. ఇక మీదట నేను న్యూడ్ కాల్స్ చేయనని తెగేసి చెప్పడంతో ఆమెను కొట్టి, తిట్టి బలవంతంగా న్యూడ్ కాల్స్ చేయించాడు. దీంతో ఆమె ఇంటినుంచి వెళ్లిపోయి తన కూతురుతో కలిసి జీవిస్తున్నా వేధింపులు ఆపలేదు. భర్త వద్ద ఉన్నా మరో కూతరును చూడడానికి వెళ్లిన సమయంలో ఆమెపై దాడి చేసి గాయపరిచాడు. 

 Also Read:  Tariffs: ట్రంప్ టారీఫ్ లతో భారత్ కు నష్టమా...లాభమా?

ఇదిలా ఉండగా ఆమె చేసిన ఒక న్యూడ్ వీడియో కాల్ ను గుర్తు తెలియని వ్యక్తి వక్తి వైరల్ చేశాడు. దీంతో ఆమెను చులకనగా చూడడంతో పాటు విడాకులు కావాలని వేధిస్తున్నాడు. దీంతో న్యాయ కోసం పోలీస్ స్టేషన్ కి వెళ్తే వారు కూడా చులకనగా హీనంగా ప్రవర్తిస్తున్నారని ఆమె ఆవేదన చెందుతోంది. తన వీడియో కాల్ వైరల్ కావడంతో తన వద్ద ఉన్న 18 లక్షలు, బంగారు నగలు తీసుకుని ఆమెను దూరం పెట్టాడని వాపోయింది. మహిళా పోలీస్ స్టేషన్ కు వెళితే అక్కడ కూడా న్యాయం జరగలేదని ఆమె వాపోయింది. కేసు పెట్టేందుకు పోలీస్ స్టేషన్ కు వెళ్తే కానిస్టేబుల్ నన్ను లైంగికంగా వేధించాడని ఆరోపించింది. ఆర్సిపురం కానిస్టేబుల్ అసభ్యకర మెసేజులు పెట్టి… రాత్రికి రావాలంటూ వేధింపులకు గురి చేశాడంటూ ఆమె ఆరోపించింది. తన ఎదుగుతున్న ఇద్దరు బిడ్డలను కూడా అదే రకంగా వేధించి కాల్స్ చేయించే ప్రమాదం ఉన్నందున తన బిడ్డలను తనకు ఇప్పించాలని ఆ మహిళ డిమాండ్ చేస్తోంది.

ఇది కూడా చదవండి: cinema : మ్యూజిక్ డైరెక్టర్ తమన్కు బాలయ్య బిగ్ సర్‌ప్రైజ్!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

AP Crime: కడుపుతో ఉన్న భార్యను ఎందుకు చంపాడంటే.. షాకింగ్ విషయాలు చెప్పిన విశాఖ పోలీసులు.. !

విశాఖలో గర్భిణీ అనూష హత్య కేసులో ఏసీపీ సంచలన విషయాలు వెల్లడించారు. జ్ఞానేశ్వర్, అనూష ప్రేమించుకుని 2022లో సింహాచలంలో వివాహం చేసుకున్నారు. అనూషను వదిలించుకోవాలని జ్ఞానేశ్వర్ కొన్నాళ్లుగా చూస్తున్నాడని పోలీసులు విచారణలో తేలింది

New Update

AP Crime: విశాఖలో గర్భిణీ అనూషను హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఏసీపీ సంచలన విషయాలు వెల్లడించారు. జ్ఞానేశ్వర్, అనూష ప్రేమించుకుని 2022లో సింహాచలంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. నిందితుడు హిందూస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్‌లో ఉద్యోగం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. పోలీసుల విచారణ ప్రకారం.. పీఎం పాలెం పీఎస్‌ పరిధిలో గర్భిణీ అనూష హత్య ఘటనలో ఏసీపీ అప్పలరాజు సంచలన విషయాలు తెలిపారు. అనూషను వదిలించుకోవాలని జ్ఞానేశ్వర్ కొన్నాళ్లుగా చూస్తున్నాడని పోలీసులు విచారణలో తెలింది. ఈ క్రమంలోనే జ్ఞానేశ్వర్ పలు నాటకాలు ఆడిన్నారు. ముందు తనకు క్యాన్సర్ ఉందని, వేరే పెళ్లి చేసుకోవాలని అనూషపై జ్ఞానేశ్వర్ ఒత్తిడి చేశాడు.

గతంలో చంపడానికి ప్లాన్..

ఆమె అంగీకరించకపోవడంతో మరో నాటకం ఆడాడు. తనకు పెళ్లైనట్లు తల్లిదండ్రులకు తెలియదని, వారికి తెలిస్తే ఇద్దరినీ చంపేస్తారని అనూషకు చెప్పాడు. అందుకే.. విడాకులు తీసుకుందామని ఒత్తిడి చేశాడు. ఆ ప్రయత్నాలేవీ ఫలించకపోవడంతో అనూషను గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తెలిసింది. జ్ఞానేశ్వర్ భార్యను బయటకు తీసుకువెళ్లినా సరదాగా మెలిగేవాడు కాదని, జంటగా ఫొటోలు దిగుదామన్నా వద్దనేవాడు స్నేహితులు చెబుతున్నారు. గతంలో పలుమార్లు చంపడానికి ప్రయత్నించాడు. ఫలుదాలో టాబ్లెట్స్ కలిపి చంపాలని ఫ్లాన్‌ చేశాడు. జ్ఞానేశ్వర్ డెలివరీ ఉందని ఫ్రెండ్స్‌ అందరికీ వీడియో కాల్‌ చేశాడు.
 
ఇది కూడా చదవండి: రోజూ ఉదయాన్నే నిమ్మకాయ నీళ్లు తాగితే ఇవే లాభాలు

రాత్రికి రాత్రి అనూషను చున్నీతో చంపేశాడు. జ్ఞానేశ్వర్ ముఖంపై గోర్లతో రెక్కేసిన ఆనవాలు ఉన్నట్లు బాధితురాలి స్నేహితులు పోలీసుల విచారణలో తెలిపారు. అయితే.. మంగళవారం డెలివరీ ఉండగా.. సోమవారం రాత్రే ఆమెను హతమార్చాడు. ఏమీ తెలియనట్లు మళ్లీ పడుకున్నాడు. ఉదయం బంధువులు లేపినా.. అనూష లేవలేదు. వారితోపాటే అతనూ నిద్ర లేపుతున్నట్లు నటించాడు. దీంతో జ్ఞానేశ్వర్‌ను అదుపులోకి తీసుకున్నామని.. తనను అనుమానించడంతోనే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడని ఏసీపీ అప్పలరాజు తెలిపారు. పూర్తి స్థాయి దర్యాప్తు చేసి నిందితుడిపై హత్య నేరం కింద కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.   

ఇది కూడా చదవండి: క్లీన్ షేవ్, గడ్డం.. చర్మానికి ఏది మంచిదో తెలుసా?

( AP Crime | ap-crime-news | ap-crime-report | ap crime updates | ap crime latest updates )

Advertisment
Advertisment
Advertisment