AP Budget 2026: మంత్రి లోకేష్ శాఖకు భారీ కేటాయింపులు.. పవన్‌కు ఎన్ని వేల కోట్లో తెలుసా?

మొత్తం బడ్జెట్ కేటాయింపులు రూ.3,32,205 కోట్లు కాగా.. వాటిని వివిధ శాఖలకు ప్రకటించారు. మంత్రుల శాఖల వారీగా చూస్తే ఎడ్యుకేషన్ మినిస్టర్‌గా ఉన్న నారా లోకేష్ శాఖకు బడ్జెట్‌లో పాఠశాల విద్యకు అత్యధికంగా రూ.32,308 కోట్లు కేటాయించడం విశేషం.

New Update
AP budget

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ 2026-27 వార్షిక బడ్జెట్ నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. మొత్తం బడ్జెట్ రూ.3,32,205 కోట్లు కాగా.. వాటిని వివిధ శాఖలకు కేటాయించారు. మంత్రుల శాఖల వారీగా చూస్తే ఎడ్యుకేషన్ మినిస్టర్‌గా ఉన్న నారా లోకేష్ శాఖకు బడ్జెట్‌లో భారీగా నిధులు ప్రకటించారు. పాఠశాల విద్య కోసం అత్యధికంగా రూ.32,308.32 కోట్లు కేటాయించారు. రాష్ట్ర చరిత్రలో విద్యా రంగానికి ఇంత భారీ స్థాయిలో నిధులు ఇవ్వడం ఇదే మొదటిసారిగా పేర్కొంటున్నారు. నైపుణ్యాభివృద్ధి, ఐటీ రంగాలకు కూడా బడ్జెట్‌లో ప్రత్యేక ప్రాధాన్యత కల్పించారు.

లోకేశ్ - పవన్ కేటాయింపులు

ఇక డిప్యూటీ సీఎంతోపాటు పంచాయతీ రాజ్ & గ్రామీణాభివృద్ధి మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ శాఖలకు కూడా భారీగానే నిధులు మంజూరయ్యాయి. ఈ శాఖకు రూ. 22,941.54 కోట్లు కేటాయించారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన, ఉపాధి హామీ పథకం, గ్రామీణ తాగునీటి సరఫరా వంటి విభాగాలకు ఈ నిధులు వెచ్చించనున్నారు. పర్యావరణం, అటవీ శాఖకు కూడా విడిగా నిధులు కేటాయించబడ్డాయి.

సామాజిక న్యాయం దిశగా బీసీ సంక్షేమానికి రూ. 23,650 కోట్లు, గ్రామీణాభివృద్ధికి రూ. 22,941 కోట్లు కేటాయించారు. ప్రజారోగ్యం కోసం వైద్యశాఖకు రూ.19,306 కోట్లు, సాగునీటి ప్రాజెక్టుల కోసం రూ. 18,223 కోట్లు కేటాయించి రైతాంగానికి అండగా నిలిచారు. పట్టణాభివృద్ధి, విద్యుత్ మరియు వ్యవసాయ రంగాలకు కూడా గణనీయమైన నిధులను మళ్లించారు.

రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' విధానాన్ని ప్రభుత్వం బలోపేతం చేసింది. దీనికి తోడు TReDS వంటి డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా పారదర్శకతను పెంచింది. పారిశ్రామిక రంగంలో భారీ మార్పులు తెస్తూ ఇప్పటివరకు ఏకంగా 26 కొత్త పాలసీలను ప్రభుత్వం రూపొందించింది. సాస్కీ నిధుల వినియోగం ద్వారా మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించారు. ఇప్పటికే రూ. 6,544 కోట్లు వినియోగించగా, ఈ ఏడాది చివరకు మరో రూ. 1,438 కోట్లు ఖర్చు చేయనున్నారు.

సంక్షేమ పథకాలు - ప్రాధాన్యతలు

ప్రజా సౌకర్యాలే లక్ష్యంగా పథకాల వారీగా నిధుల పంపిణీ జరిగింది. 'వీబీ జీ రామ్ జీ' కార్యక్రమానికి రూ. 8,365 కోట్లు, గృహనిర్మాణానికి రూ. 5,451 కోట్లు కేటాయించారు. ఆరోగ్య భరోసా ఇచ్చే ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్ట్‌కు రూ. 4,000 కోట్లు, ఇంటింటికి నీరందించే జల జీవన్ మిషన్‌కు మరో రూ. 4,000 కోట్లు కేటాయించడం విశేషం.

Advertisment
తాజా కథనాలు