BIG BREAKING: ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్‌ పదవికి జీవీ రెడ్డి రాజీనామా

టీడీపీ అధికార ప్రతినిధి, ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్‌ జీవీ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలిపారు. టీడీపీ పార్టీతో పాటు పదవులు కూడా వదులుకుంటున్నట్లు వెల్లడించారు. ఇకపై న్యాయవాద వృత్తిలోనే కొనసాగుతానని తెలిపారు.

New Update
GV Reddy

GV Reddy Photograph: (GV Reddy)

టీడీపీ అధికార ప్రతినిధి, ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్‌ జీవీ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలిపారు. టీడీపీ పార్టీతో పాటు పదవులు కూడా వదులుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. కేవలం వ్యక్తిగత కారణాలతోనే తెలుగు దేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వం, జాతీయ అధికార ప్రతినిధి హోదా, ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ చైర్మన్ పదవులకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు.

ఇది కూడా చూడండి: AP Love case: ప్రియుడి కోసం పోటీ.. విషం తాగిన ఇద్దరు యువతులు.. చివరికి ఏమైందంటే!

ఇది కూడా చూడండి: Kishan reddy: సీఎం రేవంత్ మానసిక క్షోభకు గురిచేస్తున్నారు.. కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

నాపై ఉంచిన విశ్వాసానికి..

ఇన్ని రోజులు మీరు నాపై ఉంచిన విశ్వాసానికి, అందించిన మద్ధతుకు మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు అని తెలియజేశారు. తెలుగు దేశం పార్టీ ఇంకా ఎదగడంతో పాటు ప్రజా సేవలో కూడా ముందు ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు. ఇకపై పూర్తిగా న్యాయవాద వృత్తిలోనే కొనసాగుతానని, భవిష్యత్తులో ఎలాంటి రాజకీయ పార్టీలో చేరే ఉద్దేశం లేదని సోషల్ మీడియా ద్వారా తెలిపారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు