/rtv/media/media_files/2025/03/23/Ie815ULA3CsUyJwNGhlA.jpeg)
Vidadala Rajini Photograph: (Vidadala Rajini )
మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు విడదల రజినిపై ఏసీబీ కేసు నమోదు చేయడంపై ఆమె స్పందించారు. రెడ్ బుక్ పాలనలో రజినిని టార్గెట్ చేశారని ఆమె మీడియా ముందు చెప్పారు. అక్రమ కేసులు పెట్టి, అదిగో రజిని.. ఇదిగో రజిని అంటూ ఆవు కథలు చెబుతున్నారని ఆమె ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. ఏసీబీ కేసులో ఫిర్యాదుదారులను ఇంతవరకూ తాను కలవలేదని చెప్పారు. రెడ్ బుక్ పాలనకు పరాకాష్టే ఈ ఎసిబి కేసు అని విమర్శించారు. టీడీపీ ఎంపీ శ్రీకృష్ణ దేవరాయులు ఇదంతా చేస్తున్నారని.. నా జోళికి వస్తే బాగోదని ఆమె హెచ్చరించింది. అధికార పార్టీ నా కళ్లల్లో భయం చూద్దామని అనుకుంటుందని అన్నారు. అది ఎప్పటికీ జరగదని చెప్పుకొచ్చారు.
Also read: AC explosion: ఇంట్లో AC పేలి ఫ్యామిలీలో నలుగురు మృతి.. మరొకరికి తీవ్రగాయాలు
ఆమెపై ఎసిబి కేసులో పెట్టిన వ్యక్తి టిడిపి కార్యకర్త అని రజిని ఆరోపించారు. మార్కెట్ ఏజెన్సిని పెట్టి ఆమెపై కేసులను పెట్టిస్తున్నారని అన్నారు. ఈ కథకు మొత్తం డైరెక్టర్ ఎంపి శ్రీకృష్ణదేవరాయలని ఆరోపించారు. కేసు పెడితే అక్రమంగా వ్యాపారం చేసుకోవడానికి సహకరిస్తామని ఎంపి ఫిర్యాదుదారులకు హామీ ఇచ్చారన్నారు. నేనంటే ఎంపి శ్రీకృష్ణదేవరాయలకు ఎక్కువ కోపమని, 2020లో గురజాల డిఎస్పీ, సిఐలకు లంచం ఇచ్చి నాతో పాటు నా కుటుంబ సభ్యుల కాల్ డేటాను సేకరించారని విడదల రజిని ఆరోపించింది. బిసి మహిళ, ఎమ్మెల్యే అయిన నా కాల్ డేటాను తీయించారు. నా వ్యక్తి గత జీవితంలోకి ఎందుకు రావాలనుకున్నారో తెలియదు. మీ ఇంటిలో ఉన్న ఆడపిల్లల కాల్ డేటా తీస్తే ఎలా ఉంటుందో ఆలోచించండని టీడీపీ నాయకులను ప్రశ్నించింది రజినీ.
Also read: నేను కేసీఆర్ అంత మంచోడిని కాదు : KTR
ఎంపి శ్రీక్రిష్ణ దేవరాయలు జగన్ మోహన్ రెడ్డి ఎంపిని ప్రశ్నించారు. అప్పుడే జగన్ మోహన్ రెడ్డి మనసులో శ్రీకృష్ణదేవరాయలు నమ్మకాన్ని కోల్పోయారని ఆమె చెప్పింది. అప్పటి నుండి ఎంపి నాపై కక్ష పెంచుకున్నారని అన్నారు. ప్రస్తుతం విజిలెన్స్ ఎస్పిగా ఉన్న శ్రావణ్ టిడిపి ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు కొడుకు అని రజిని చెప్పారు. ఆ ఎస్పీ ఇచ్చే విజిలెన్స్ నివేదిక ఏవిధంగా ఉంటుందో ప్రజలే ఆలోచించాలని కోరారు. ఎస్పీ ఇచ్చిన రిపోర్ట్ తెలుగుదేశం రిపోర్ట్ అని అన్నది. అవినీతి ఘనాపాటి ప్రత్తిపాటి.. నా మీద, జర్మనీలో ఉండే నా మరిది మీద అక్రమ కేసులు పెట్టించారుని విడదల రజనీ అన్నారు. టీడీపీ నాయకులు నా కళ్ళలో భయం చూద్దామనుకుంటున్నారు. ఇటువంటి వాళ్ళను చూస్తే నాకు భయమనిపించదని ఆమె తేల్చి చెప్పారు. శ్రీకృష్ణదేవరాయలు వైజాగ్‌లో చెరువు భూములను కొట్టేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె చెప్పుకొచ్చారు. వడ్లమూడి యూనివర్సిటీ నుండి చిలకలూరిపేట ఎంత దూరమో..? చిలకలూరిపేట నుండి వడ్లమూడి యూనివర్సిటీ అంతే దూరమని శ్రీకృష్ణదేవరాయలు ఇది గుర్తుపెట్టుకోవాలని విడదల రజిని వార్నింగ్ ఇచ్చింది.