/rtv/media/media_files/2024/11/15/F7eobRGKF62wJ5dazIwH.jpg)
వైసీపీ నేత, సినీ నటుడు పోసాని కృష్ణమురళికి బిగ్ షాక్ తగిలింది. ఆయన్ను ఒక రోజు సీఐడీ కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో ఆయన్ను రేపు అంటే మంగళవారం ఉదయం 10నుంచి సాయంత్రం 5గంటల వరకు సీబీఐ అధికారులు కస్టడీలోకి తీసుకొని విచారించనున్నారు. మీడియా సమావేశాలలలో ప్రముఖులను అసభ్య పదజాలంతో దూషించినందుకు పోసానిపై సీఐడీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఇదే కేసులో గుంటూరు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. మరోవైపు మంగళవారం పోసాని బెయిల్ పిటిషన్ గుంటూరు కోర్టులో రేపు విచారణకు రానుంది.
Also Read : నిరుద్యోగులకు రూ.3 లక్షలు.. రేవంత్ సర్కార్ పథకానికి ఇలా అప్లై చేసుకోండి!