/rtv/media/media_files/2025/03/27/iNONfdfyak6HINJ7HSr4.jpg)
Suryalanka Beach
Suryalanka Beach: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రం రాష్ట్రాభివృద్ధికి వరుస శుభవార్తలు చెబుతోంది. పలు ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన నిధులను విడుదల చేస్తోంది. అందులో భాగంగా మరో శుభవార్త వినిపించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సూర్యలంక బీచ్ అభివృద్ధికి నిధులు విడుదల చేసింది. స్వదేశీ దర్శన్ పథకం 2.0 కింద ఏపీలోని సూర్యలంక బీచ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ.97.52 కోట్లు విడుదల చేసినట్లు ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. ఈ నిధులతో పాటుగా మరిన్ని నిధులతో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో సూర్యలంక బీచ్ రూపురేఖలు మారుస్తామని కందుల దుర్గేష్ వెల్లడించారు.
Also Read: ఇది అస్సలు ఊహించలేదు.. 'మంగళవారం' సీక్వెల్ లో హీరోయిన్ గా ఎవరంటే!
మరోపైపు కందుల దుర్గేష్ ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో ఆయన భేటీ అయ్యారు. ఈ భేటీ సందర్భంగా సూర్యలంక బీచ్‌కు నిధులు విడుదల చేయాలని కేంద్ర మంత్రిని కోరారు. ఈ క్రమంలోనే కేంద్రం నుంచి సూర్యలంక బీచ్ అభివృద్ధికి రూ.97.52 కోట్లు విడుదల కావటం విశేషం.
Also Read: పోలీసులు కాదు రాక్షసులు.. పసివాడిపై థర్డ్ డిగ్రీ.. ప్రాణం పోయేలా కొట్టి!
సూర్యలంక బీచ్‌నే బాపట్ల బీచ్ అని కూడా పిలుస్తూ ఉంటారు. బంగాళాఖాతం తీరంలో ఉండే ఈ బీచ్‌కు వారాంతాల్లో పర్యాటకులు అధిక సంఖ్యలో తరలివస్తుంటారు. బాపట్లకు సుమారుగా 9 కిలోమీటర్ల దూరంలో ఈ సూర్యలంక బీచ్ ఉంటుంది. పర్యాటకుల కోసం ఇక్కడ రిసార్టులు కూడా నిర్మించారు. సూర్యలంక బీచ్ ఉదయం, సాయంత్రం వేళల్లో చూడటానికి చాలా అందంగా కనిపిస్తుంది. అలాగే సముద్రస్నానం చేయడానికి, సూర్యాస్తమయం ఆస్వాదించడానికి అనువైన ప్రదేశం. పర్యాటకుల కోసం ఇక్కడ జెట్ స్కీయింగ్, బోటింగ్, ఇతర క్రీడలు కూడా అందుబాటులో ఉన్నాయి. చల్లటి వాతావరణం, ప్రకృతి అందాలు చూసేందుకు ఈ బీచ్ ఉత్తమమైన ప్రదేశం.
Also Read: వినియోగదారులకు షాక్.. పెరిగిన పాల ధరలు.. ఎంతంటే ?
ఇక సూర్యలంక బీచ్‌కు సమీపంలోనే బాపట్ల భావనారాయణస్వామి ఆలయం, గుంటూరు నగరం ఉంది. సూర్యలంక బీచ్‌కు రావాలంటే బాపట్లకు చేరుకుని అక్కడి నుంచి బస్ లేదా కారులో సూర్యలంక బీచ్‌కు చేరుకోవచ్చు. అలాగే గుంటూరురైల్వే స్టేషన్ నుంచి కూడా సులభంగా చేరుకోవచ్చు. సూర్యలంక బీచ్‌ను ఏడాదిలో ఎప్పుడైనా సందర్శించవచ్చు. కానీ మార్చి నుంచి జూన్ అలాగే నవంబర్ నుంచి మధ్య మంచి వాతావరణం ఉంటుందని స్థానికులు చెప్తున్నారు.
Also Read: అలాంటి సాహసం ఎప్పుడూ చేయలేదు.. SSMB 29 పై రాజమౌళి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్