/rtv/media/media_files/2025/03/04/PHi4qToe3XM4zIyTnBUe.jpg)
Half Day Schools
Half Day Schools : చలికాలం అలా వెళ్లిందో లేదో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే బానుడు భగభగలాడుతున్నాడు. దీంతో సామాన్యులు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. ఒకవైపు అన్ని తరగతుల పరీక్షలు దగ్గరపడుతుండటంతో ప్రభుత్వం ఒంటిపూట బడి మీదా ఫోకస్ పెట్టింది. ఇప్పటికే రంజన్ పండగ నేపథ్యంతో తెలంగాణ రాష్ట్రంలోని ఉర్దూ విద్యార్ధులకు ఒంటి పూట బడులు ప్రారంభమైనాయి. మరో వారం రోజుల్లో అన్ని పాఠశాలలకు ఒంటి పూట బడులు పెట్టే అవకాశం ఉంది.
Also Read: చిరుత, సింహం పిల్లలతో ప్రధాని మోదీ.. వీడియో వైరల్
అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ ఎండల తీవ్రంగా నానాటికీ పెరుగుతుంది. మార్చి ప్రారంభం ముందు నుంచే ఎండలు మండిపోతున్నాయి. ఈ ఏడాది ఎండలు తీవ్రంగా ఉంటాయన్న హెచ్చరికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యా సంస్థలకు మార్చి 15 నుంచి ఒంటి పూట బడులు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఇందుకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే ప్రణాళికలు కూడా సిద్ధం చేసిందట. అయితే ఎండల తీవ్ర పెరుగుతున్నందున ఒంటిపూట బడులను మార్చి మొదటి వారం నుంచే నిర్వహించాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. దీనిపై ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాలేదు.
Also Read: రాష్ట్ర ప్రభుత్వాలు అందులో విఫలమయ్యాయి.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
దీంతో మార్చి 15 నుంచే ఒంటి పూట బడులు ప్రారంభమయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. మరోవైపు మునుపెన్నడు లేనివిధంగా ఈ సారి ఎండలు తీవ్రంగా ఉంటాయని వాతావరణ శాఖ కూడా హెచ్చరిస్తోంది. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఎండల తీవ్రత సాధారణం కంటే అధికంగా ఉంటుందని, వడగాలులు కూడా తీవ్రంగా ఉంటాయని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో.. ఒంటిపూట బడులు వీలైనంత త్వరగా ప్రారంభించాలనే ఆలోచనలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఉన్నాయి.
Also Read: Software Engineer: గోవాలో పెళ్లి.. హైదరాబాద్లో సూసైడ్.. ఆర్నెళ్లకే నవవధువు జీవితం నాశనం!
కాగా గతేడాదిలో మార్చి 18వ తేదీ నుంచి ఏపీలో ఒంటి పూట బడులు ప్రారంభమయ్యాయి. అయితే ఈసారి మార్చి 15వ తేదీ నుంచే ప్రారంభించే అవకాశం ఉంది. ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వస్తే.. 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ఒంటిపూట బడులు నిర్వహిస్తారు. దీంతో ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30 వరకే తరగతులు నిర్వహించే అవకాశం ఉంటుంది. ఇక ఒంటిపూట బడులపై తెలంగాణ ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఏపీ లాగే 15 నుంచే ఒంటిపూట బడులు నిర్వహిస్తారా? లేక ఆ తర్వాతనా అనేది తేలాల్సి ఉంది.
Also Read: Bangladesh: బంగ్లాదేశ్ యూటర్న్.. భారత్ తో సంబంధం తప్ప వేరే దారి లేదంటూ ప్రకటన