/rtv/media/media_files/2025/02/13/F9zoV9zECBXzVIQhMkgB.jpg)
vamshi
వైసీపీ లీడర్ వల్లభనేని వంశీకి మరో షాక్ తగిలింది. ఆల్‌రెడీ రిమాండ్‌లో ఉన్న వంశీకి మరో కేసులో గన్నవరం కోర్టు ఏప్రిల్ 1 వరకు రిమాండ్ విధించింది. ప్రస్తుతం సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో అరెస్టై విజయవాడ జిల్లా జైల్లో వంశీ రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయన్ని పీటీ వారెంట్‌పై అరెస్ట్ చేసి మంగళవారం గన్నవరం కోర్టులో హాజరుపరిచారు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరు పీఎస్ పరిధిలో ఓ ముస్లిం మహిళకు చెందిన భూమిని.. ఆమె కుమారులని ఇద్దరు వ్యక్తులు రిజిస్ట్రేషన్ చేశారు.
Also read: Nagpur violence : మహారాష్ట్రను మరో మణిపూర్‌లా చేయాలని BJP ప్లాన్: ఆదిత్య ఠాక్రే
భూమిని కొనుగోలు చేసేందుకు తాను మహిళతో అగ్రిమెంట్ చేసుకున్నానని శ్రీధర్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు ఆధారంగా రాము, వల్లభనేని వంశీ, రంగా మరొకరిపై ఆత్కూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో వంశీ ఏ2గా ఉన్నారు. ఇందులో గన్నవరం కోర్టు ఏప్రిల్ 1వరకు రిమాండ్ విధించడంతో మంగళవారం విజయవాడ జిల్లా జైలుకు తరలించారు.
తనకు జైలులో ఇనుప మంచం ఇచ్చారని, పరుపు, ఫైబర్ కుర్చీ ఇచ్చేందుకు జైలు అధికారులను ఆదేశించాలని వంశీ న్యాయమూర్తిని కోరారు. ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టులో ఈ అంశంపై విచారణ జరిగిన నేపథ్యంలో తాను వాటిపై ఆదేశాలివ్వలేనని గన్నవరం కోర్టు తెలిపింది. మెడికల్ రిపోర్టులు పొందుపరిస్తే వాటి ఆధారంగా ఫైబర్ కుర్చీ ఇచ్చే అంశంపై ఆదేశాలిస్తామని కోర్టు తెలిపింది.