/rtv/media/media_files/2025/02/13/LWZzHPWXqbZm2DziF2NM.webp)
Alla Nani
Alla Nani : ఏపీలో అధికారం కోల్పొయిన వైసీపీ కి మరో షాక్ తగిలింది. మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని అధికారికంగా టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. వైసీపీలో కీలకంగా వ్యవహరించిన ఆళ్ల నాని మూడు నెలల క్రితం పార్టీకి, ఏలూరు జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. అప్పటినుంచి ఎవరికీ అందుబాటులో లేని ఆళ్ల నాని టీడీపీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబు సమక్షంలో ఆయన సైకిల్ ఎక్కబోతున్నారని కార్యకర్తలు స్పష్టం చేస్తు్న్నారు. నిజానికి మూడు రోజుల క్రితమే ఆయన టీడీపీలో చేరుతారని ప్రచారం సాగింది. అయితే నాని చేరికను పలువురు టీడీపీ నేతలు వ్యతిరేకించడంతో చేరిక వాయిదా పడింది. అయితే తాజాగా చంద్రబాబు ఆయన చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే టీడీపీ సభ్యత్వం తీసుకున్న నాని అన్ని అనుకూలిస్తే రేపు చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆళ్ల నాని మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. గత ప్రభుత్వంలో ఉపముఖ్యమంత్రిగా పనిచేశారు.
Also Read: పార్లమెంటులో కొత్త ఐటీ బిల్లు-2025ను ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్
గత కొన్ని నెలలుగా ఆయన టీడీపీలో చేరతారని టాక్ నడుస్తోంది. అయితే నాని చేరికపై టీడీపీ కేడర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఆయన చేరికతో కేడర్‌లో మరింత అసంతృప్తి పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో పార్టీ ఆలోచనలో పడింది. దీంతో ఇప్పటికే పలుమార్లు ఆళ్ల నాని టీడీపీలో చేరిక అంశం వాయిదా పడుతూ వచ్చింది. మరోమారు నానిని పార్టీలోకి తీసుకోవాలా వద్దా అనే విషయంపై అధిష్టానం పునరాలోచనలో పడింది. కానీ మొత్తానికి ఆళ్ల నాని టీడీపీ నేతలతో చర్చలు జరపగా.. గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు ప్రచారం నడుస్తోంది. ఆయనకు ఎలాంటి హామీ ఇవ్వకపోయినా.. పార్టీలో స్వచ్ఛందంగా చేరేందుకే నాని ఓకే చెప్పినట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: రామరాజ్యం ఆర్మీ పేరుతో అరాచకాలు.. వీరరాఘవరెడ్డి బాగోతం బయటపెట్టిన RTV!
ఆళ్ల నాని చేరిక అంశంపై టీడీపీలో మొదటి నుంచి చర్చ నడుస్తూనే ఉంది. 2024 ఎన్నికల్లో ఏలూరులో 60 వేలకు పైగా మెజారిటీతో గెలిచిన టీడీపీకి వైసీపీ నాయకుల అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు. గతంలో అధికారంలో ఉండగా.. టీడీపీ నేతలు, కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేసిన ఆళ్ల నాని.. ఇప్పుడు టీడీపీలో చేరడానికి ఎలా ఓకే చెబుతామని ఏలూరులో పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆళ్ల నాని 2004, 2009 ఎన్నికల్లో ఏలూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా విజయం సాధించారు. వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ సమయంలో కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో ఏలూరు నుంచి వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత జగన్ ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. 2019 ఎన్నికల్లో మళ్లీ ఆళ్ల నానికి ఏలూరు నుంచి వైసీపీ టికెట్ ఇచ్చారు జగన్. ఆ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆళ్ల నాని.. జగన్ కేబినెట్‌లో డిప్యూటీ సీఎంగా రెండున్నరేళ్ల పాటూ పనిచేశారు. ఇక గత ఎన్నికల్లో ఏలూరు అసెంబ్లీ స్థానానికి వైసీపీ తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మొదట్లో ఆయన జనసేన పార్టీలో చేరబోతున్నట్లు ప్రచారం జరిగింది. కానీ చివరకు తెలుగు దేశం పార్టీ సభ్యత్వం తీసుకోవడంతో సైకిల్ ఎక్కబోతున్నట్టు క్లారిటీ వచ్చింది.
Also Read : ముందుకూ, వెనక్కూ ఊగిసలాడుతున్న స్టాక్ మార్కెట్లు
Also Read : ఇది మరీ దారుణం.. రేషన్ కార్డు దరఖాస్తుకు రూ.2వేలు.. మీసేవ సెంటర్ల వసూళ్ల దందా!