YS Jagan Mohan Reddy : అన్నదాతలకు నష్టాలు, కష్టాలే మిగిలాయి : మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌ కీలక వ్యాఖ్యలు

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్నదాతలకు కష్టాలు, నష్టాలే మిగిలాయని వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ అన్నారు, పంటలకు మద్దతు ధర దేవుడెరుగు..కనీసం కొనేవారు లేరని ఆరోపించారు. ఈ రోజు గుంటూరు మార్కెట్‌ యార్డులో మిర్చి రైతులను ఆయన పరామర్శించారు.

New Update
YS Jagan Mohan Reddy

YS Jagan Mohan Reddy

 YS Jagan Mohan Reddy :  రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నదాతలకు కష్టాలు, నష్టాలే మిగిలాయని, పంటలకు మద్దతు ధర దేవుడెరుగు.. కనీసం అమ్ముకుందామన్నా కొనేవారు లేరని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆరోపించారు. ఈ రోజు గుంటూరు మార్కెట్‌ యార్డులో ధరల్లేక ఇబ్బంది పడుతున్న మిర్చి రైతులను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొన్నటి వరకూ ధాన్యం రైతుల కష్టాలు చూశాం. ఇవాళ మిర్చిరైతుల కష్టాలు చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు సీట్లోకి వచ్చారు, మళ్లీ రైతులను పట్టి పీడించడం మొదలుపెట్టారని ఆరోపించారు.   

Also Read: అది నిరూపిస్తే సీఎం పదవికి రాజీనామా చేస్తా.. బీజేపీకి దీదీ సవాల్


ఏపీ ప్రభుత్వం రైతులను ముంచేస్తుందని తీవ్ర ఆరోపణలు చేసారు జగన్‌. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత రైతులు నష్టపోతున్నారని చెప్పారు. కనీస ధరలు లేక మిర్చి రైతులు నష్టపోతుంటే ముఖ్యమంత్రి పట్టించుకోవటం లేదని జగన్ ఆరోపించారు. చంద్రబాబు మిర్చి రైతులకు న్యాయం చేసేలా నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేసారు. చంద్రబాబు స్పందించకపోతే ఉద్యమం తప్పదని జగన్ హెచ్చరించారు. మన ప్రభుత్వంలో నిరుడు క్వింటాలుకు అత్యధికంగా రూ.21-27 వేల దాకా పలికిన మిర్చి ధర, ఇప్పుడు రూ.8-11వేలకు పడిపోయిందన్నారు.పంట బాగుంటే ఎకరాకు సగటున 20 క్వింటాళ్లు దిగుబడి వస్తుంది. తెగుళ్లు కారణంగా ఈ ఏడాది దిగుబడులు పడిపోయాయి. ఏ జిల్లాలో చూసినా ఎకరాకు 10 క్వింటాళ్లకు మించి రాలేదు. పెట్టుబడి ఖర్చులు చూస్తే, ఎకరా సాగుకు సుమారు రూ.1,50,000 పైమాటే అవుతోంది. కౌలు రైతుల పరిస్థితి మరింత దారుణంగా ఉందని జగన్‌ అన్నారు.

 Also Read: భారత్‌ లో టెస్లా..ఆనంద్‌ మహీంద్రా కీలక వ్యాఖ్యలు!

 కృష్ణా, ఎన్టీఆర్‌, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, కర్నూలు, అనంతపురం ఈజిల్లాల్లో రైతులందరి పరిస్థితీ అంతేనన్నారు. పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా ఆ ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి.. వీరంతా పట్టించుకోవడంలేదు. ప్రభుత్వంలో ఒక్క రివ్యూ కూడా చేయలేదు. గవర్నమెంటు తరఫున రైతులను పలకరించే వారు లేరన్నారు. రాష్ట్ర సచివాలయానికి అత్యంత సమీపంలో గుంటూరు మార్కెట్‌  యార్డు ఉంది. ఇక్కడ రైతుల ఆక్రోశం, ఆవేదన చంద్రబాబునాయుడు గారికి వినిపించడంలేదా అని ఆయన ప్రశ్నించారు..చంద్రబాబు అధికారంలోకి వచ్చి రైతులకు సహాయం చేయకపోగా, వైయస్సార్‌సీపీ ప్రభుత్వంలో వ్యవసాయరంగంలో తీసుకొచ్చిన విప్లవాత్మక సంస్కరణలన్నింటినీ కూడా మూలన పడేశారు.ఆర్బీకేలను, ఈ-క్రాప్‌ వ్యవస్థలను నిర్వీర్యంచేశారు. ఇంటిగ్రేటెడ్‌ ల్యాబులను నిర్వీర్యంచేశారు. సీజన్‌ మొదలయ్యే సరికి రైతులకు పెట్టుబడి సహాయం, రైతులకు సున్నావడ్డీకే రుణాలు, విత్తనాలు ఎరువులకు సైతం ఆర్బీకేల్లో నాణ్యతకు గ్యారంటీ.. ఇలా ప్రతి విప్లవాత్మక మార్పునూ ఉద్దేశపూర్వకంగా మూలనపెట్టారని ఆరోపించారు.

Also Read: రిటర్నులు ఆలస్యమయ్యాయా..అయితే  నో రిఫండ్‌.. ఐటీ శాఖ ఏమందంటే!

వైయస్సార్‌సీపీ ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం ఎంఎస్‌పీ  ప్రకటించని పసుపు, మిర్చి, ఉల్లి, అరటి లాంటి పంటలకే కాదు, మొత్తంగా 24 పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించి, రైతులకు  ఎంఎస్‌పీ ధరలు రాకపోతే, రాష్ట్ర ప్రభుత్వమే జోక్యంచేసుకుని కొనుగోలు చేసేదని వివరించారు. కనీస మద్దతు ధరలు తెలియజేస్తూ ఆర్బీకేల్లో పోస్టర్లు ఉంచేవాళ్లం.  ధాన్యం కొనుగోలుకు రూ.65,258 కోట్లు ఖర్చు చేస్తే, ధాన్యం కాకుండా ఇతర పంటల కొనుగోలు కోసం అక్షరాల రూ. 7,773 కోట్లు ఖర్చు చేసి మన ప్రభుత్వం రైతులను ఆదుకుంది. ఇవాళ మిర్చి రైతులు ఇన్ని కష్టాలు పడుతుంటే, చంద్రబాబునాయుడు కుంభ కర్ణుడిలా నిద్రపోతున్నాడని ఎద్దేవా చేశారు.

Also Read: నేడు ఈ రాశి వారికి వాహన ప్రమాదాలు జరిగే సూచనలున్నాయి... జాగ్రత్త!

మన ప్రభుత్వ హయాంలో CM APP అనే గొప్ప మార్పును తీసుకు వచ్చాం. రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ఏ పంట ధర ఎలా ఉందో ఆ యాప్‌ద్వారా నిరంతరం సమాచారం వచ్చేది.  ఆర్బీకేల్లో ఉండే సిబ్బంది రైతులకు అందుతున్న ధరలమీద ఎప్పటికప్పుడు యాప్‌లో అప్‌డేట్‌ చేసేవాళ్లు. ఆ సమాచారం ఆధారంగా కనీస మద్దతు ధర రాని పక్షంలో వెంటనే చర్యలు తీసుకునేవాళ్లమని జగన్ గుర్తు చేశారు. జేసీల ఆధ్వర్యంలో మార్కెటింగ్‌ శాఖతో కలిసి అవసరమైతే ప్రభుత్వం తరఫున కొనుగోళ్లు చేసేవాళ్లం. కనీస మద్దతు ధరలు ఎంతో తెలియజేస్తూ ఆర్బీకేల్లో పెద్ద పెద్ద పోస్టర్లు ఉంచేవాళ్లం. రైతులనుంచి ఫిర్యాదులు స్వీకరించి, వాటిని పరిష్కరించడానికి 14400, 1907 నంబర్లు కూడా ఉండేవి. ఇప్పుడు ఈవ్యవస్థలను పూర్తిగా నాశనం చేశారని జగన్‌ ఆరోపించారు.

Also Read: Trump: భారత్ దగ్గర బోలెడు డబ్బులు.. ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు

మనం అధికారంలో ఉన్నప్పుడు మిరప రైతులకు ఎప్పుడూలేని విధంగా  చాలా గొప్పగా పంటలబీమా అందించాం. 2019-20లో రూ.90.24 కోట్లు, 2020-21లో రూ.36.02 కోట్లు, 2021-22లో రూ.439.79 రైతులకు కోట్లు అందించామని జగన్ చెప్పుకున్నారు. గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదు. ఇప్పుడు ఉచిత పంటల బీమాను పూర్తిగా రద్దుచేసి రైతులపై భారాన్ని మోపారు. మన ప్రభుత్వంలో రైతుల‌పై ఒక్కపైసా భారం మోపకుండా ఉచిత పంటలబీమాను అమలు చేసి, 54.55లక్షల మందికి రూ.7,802 కోట్లు పంట నష్టపరిహారం కింద చెల్లించామని జగన్ అన్నారు.

Also Read: Elon Musk:ఇంటర్వ్యూ కోసం వెళ్లి రొమాన్స్ చేశా.. అందుకు బదులుగా మస్క్ నాకు ఏమి ఇచ్చాడో తెలుసా!

 ఒక్క మిర్చే కాదు, కంది పండిస్తున్న రైతులు కూడా ధరల్లేక విలవిల్లాడుతున్నారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. కందిపప్పు క్వింటాలుకు కనీస మద్దతు ధర రూ.7,550 అయితే, ఇప్పుడు రూ.5,500లు కూడా రావడంలేదు. గత ఏడాది రూ.9-10వేల మధ్య ధర వచ్చేది. కాని మార్కెట్లో కిలో కందిపప్పు రూ.150లు పైనే ఉంది. గత ఏడాది క్వింటాలు పత్తి ధర రూ.10వేలు ఉండేది. ఇప్పుడు రూ.5వేలుకూడా దాటడం లేదు. పెసలు కనీస మద్దతు ధర రూ.8,558లు. ఇప్పుడు రూ.6వేలు రావడం కష్టంగా ఉంది. అలాగే మినుములు కనీస మద్దతు ధర రూ.7,400. గత ఏడాది క్వింటాలుకు రూ.10వేలు రాగా, ఇప్పుడు రూ.7వేలు కూడా రావడంలేదు. టమోటా రైతులకు కిలోకి రూ.3-5లు కూడా రావడంలేదని జగన్‌ ఆరోపించారు.చంద్రబాబుగారూ… ఇప్పటికైనా కళ్లు తెరవండి. రైతే రాజని గుర్తించండి, రైతు కన్నీరు పెట్టుకుంటే… అది రాష్ట్రానికి అరిష్టం. చంద్రబాబుగారు గుంటూరు మార్కెట్‌ యార్డుకు వచ్చి, మిర్చి రైతులతో మాట్లాడి, వారికి బాసటగా నిలవాలి. ప్రభుత్వమే మిర్చిని కొనుగోలుచేసి రైతులకు అండగా నిలవాలని డిమాండ్‌ చేస్తున్నామని జగన్‌ సూచించారు.

Also Read: Nara lokesh: ఏపీలో టీచర్లకు తీపికబురు చెప్పిన  మంత్రి లోకేష్

Also Read: Maha Kumbh Mela: ప్రయాగ్‌రాజ్‌ వెళ్లే వారికి అలర్ట్..నేడు ఆ రైలు రద్దు..14 గంటల ముందే రైల్వే శాఖ ప్రకటన!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Vontimitta Kodandarama Swamy Temple: హనుమంతుడి లేని రామాలయం..మన దగ్గరే..ఎన్నో ప్రత్యేకతలు!

ప్రతి రామాలయంలో సీతారామలక్ష్మణులతో పాటుగా ఆంజనేయడు కూడా కొలువై ఉంటాడు. రాములోరి సేవలో తరిస్తూ భక్తుల పూజలు అందుకుంటూ ఉంటాడు. కానీ ఆంజనేయుడు లేని రామాలయం ఒకటుందని.. మీకు తెలుసా.. ఆ ఆలయం గురించి ఈ కథనంలో..

New Update
hanuman

hanuman

రామాలయం లేని ఊరు.. హనుమంతుడు లేని రాములోరి ఆలయం ఉండదనేది పెద్దలు ఎప్పుడూ చెబుతుంటారు. కానీ హనుమంతుడు లేని రామాలయం కూడా ఒకటి ఉంది. అది కూడా మరెక్కడో కాదు సాక్షాత్తు  ఏపీలోనే ఉందని తెలుసా.. అదే వైఎస్ఆర్ కడప జిల్లాలోని ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయం. అన్ని ఆలయాల్లో సీతారామలక్ష్మణ ఆంజనేయస్వాములు కనిపిస్తే ఇక్కడ మాత్రం ఆంజనేయస్వామి ఉండరు. దాని వెనుక కూడా ఆసక్తికరమైన కథ ఉంది. 

Also Read: Kerala: మీరు సరిగా పని చేయడం లేదు..కుక్కల్లాగా నడవండి..ఉద్యోగులకు వేధింపులు!

ఆంజనేయస్వామిని కలవకముందే.. ఈ ప్రాంతంలో శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు సంచరించారని.. అందుకే ఆలయంలో ఆంజనేయుడి విగ్రహం ఉండదనేది స్థానికులు చెబుతారు.ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయంలో ఒకే శిలపై సీతారామ లక్ష్మణ దేవతామూర్తుల విగ్రహాలు ఉంటాయి. అందుకే ఒంటిమిట్టను ఏకశిలానగరం అని కూడా పిలుస్తారు. త్రేతాయుగంలో సీతాలక్ష్మణ సమేతుడైన శ్రీరాముడు దండకారణ్యంలో సంచరిస్తూ ఇక్కడకు వచ్చారని పురాణాలు చెప్తున్నాయి. 

Also Read: WhatsApp new features: వాట్సాప్‌ వీడియో కాల్స్ చేసుకునే వారికి గుడ్‌న్యూస్.. కొత్తగా 3 ఫీచర్లు!

ఆ సమయంలో సీతాదేవికి బాగా దప్పిక వేసిందని.. సీతాదేవి దాహం తీర్చేందుకు శ్రీరాముడు భూమిలోనికి బాణం వేస్తే నీటిబుగ్గ పుట్టిందని పురాణాల్లో ఉంది. అదే ఒంటిమిట్ట రామతీర్థం అయ్యిందని చెప్తుంటారు.ఇక ఈ ఆలయం పేరుపైనా అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. కోదండరామస్వామి ఆలయాన్ని మిట్టమీద నిర్మించారని.. అందుకే ఒంటిమిట్ట రామాల‌యం అని పేరు వ‌చ్చింద‌ని కొంతమంది చెప్తుంటారు. అయితే ఒంటుడు, మిట్టుడు అనే ఇద్దరు రామ‌భ‌క్తులు ఈ గుడిని నిర్మించారని.. వారి పేరుమీద ఒంటిమిట్ట రామాలయం అయ్యిందనేది మరో వాదన. సీతారాముల క‌ల్యాణం త‌ర్వాత మృకండ మహర్షి, శృంగి మహర్షి యాగ రక్షణ కోసం శ్రీరామలక్ష్మణులు ఇక్కడ‌కు వ‌చ్చారని.. అందుకు ఆ మ‌హర్షులు సీతారామ ల‌క్ష్మణుల విగ్రహాల‌ను ఇక్కడ ఏర్పాటు చేయించారని మరో కథనం. ఆ విగ్రహాలకు తర్వాత కాలంలో జాంబవంతుడు ప్రాణ ప్రతిష్ట చేశాడ‌ని మరికొందరు అంటుంటారు.

ఒంటిమిట్ట రామాలయంలో సీతారాముల కళ్యాణం రాత్రి వేళ ఎందుకు జరుగుతుందనే దానికి కూడా ఆసక్తికరమైన కథ ఉంది. అది కూడా శ్రీరామనవమి రోజున కాకుండా చైత్ర శుద్ధ పౌర్ణమి రాత్రి జరుగుతుంది. పురాణాల ప్రకారం విష్ణుమూర్తి, లక్ష్మీదేవి వివాహం పగలు జరిగినప్పుడు, చంద్రుడు తన సోదరి లక్ష్మీదేవి పెళ్లిని చూడలేకపోయానని విష్ణువుతో మొరపెట్టుకున్నాడట. దీంతో "నీ కోరిక రామావతారంలో తీరుతుంది" అని మహా విష్ణువు వరమిచ్చాడు. 

ఆ ప్రకారం ఒంటమిట్టలో సీతారాముల కళ్యాణం వెన్నెల వెలుగుల్లో నిర్వహిస్తారు. ఇక ఒంటిమిట్ట ఆలయ గోపురాలు చోళ శైలిలో, రంగమంటపం విజయనగర శిల్పకళా వైభవాన్ని ప్రతిబింబిస్తాయి. 32 స్తంభాలతో కూడిన రంగమంటపం, 160 అడుగుల ఎత్తైన గోపురం దీని సౌందర్యాన్ని మరింత ఆకర్షణీయంగా చేస్తాయి.

Also Read: Iran: చరిత్రలో రికార్డ్ స్థాయికి పడిపోయిన ఇరాన్ కరెన్సీ విలువ.. డాలర్‌కు 10 లక్షల రియాల్స్‌..

Also Read: Sri Rama Navami 2025: శ్రీరామ నవమి ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఇదే

 

 kadapa | vontimitta-kodandaram | temple | sri-rama-navami | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates

Advertisment
Advertisment
Advertisment